S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

05/13/2017 - 22:24

టెస్టు చాంపియన్‌షిప్ కారణంగా రద్దవుతుందనుకున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జూన్ ఒకటి నుంచి అభిమానులను అలరించడానికి ముస్తాబవుతున్నది. ఎనిమిది జట్లు ఢీకొంటున్న ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా లేదా అన్న అనుమానం చివరి క్షణం వరకూ కొనసాగింది.

05/13/2017 - 22:21

సమర్థమైన జట్ల మధ్య జరిగే పోరాటం కాబట్టే దీనిని చాంపియన్స్ ట్రోఫీ అంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ, అది నిజం కాదు. వాస్తవానికి చాంపియన్ అనే వ్యక్తి పేరుమీద ఈ ట్రోఫీకి ఆ పేరు వచ్చింది. 1998లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌ను తొలుత ఐసిసి నాకౌట్ టోర్నీగా పిలిచేవారు. 200లో చాంపియన్స్ ట్రోఫీగా పేరుమార్చారు.

05/13/2017 - 22:20

గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లు
జూన్ 1: ఇంగ్లాండ్/ బంగ్లాదేశ్, జూన్ 2: ఆస్ట్రేలియా/ న్యూజిలాండ్, జూన్ 5: ఆస్ట్రేలియా/ బంగ్లాదేశ్, జూన్ 6: ఇంగ్లాండ్/ న్యూజిలాండ్, జూన్ 9: న్యూజిలాండ్/ బంగ్లాదేశ్, జూన్ 10: ఇంగ్లాండ్/ ఆస్ట్రేలియా.
గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు

05/13/2017 - 22:19

న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ‘బ్లాక్ క్యాప్స్’ అంటారు. 1923-24 ఆర్థిక సంవత్సరంలో తమ దేశం నుంచి భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. లెక్కకు మించిన బ్లాక్ మనీ మొదట న్యూజిలాండ్ చేరి, అక్కడి నుంచి హవాలా వ్యాపారంలోకి వెళ్లినట్టు సాక్ష్యాధారాలు లభించాయి. బ్లాక్ మనీకి కొమ్ముకాసింది కాబట్టే న్యూజిలాండ్‌కు ‘బ్లాక్’ అనే పదాన్ని ఆస్ట్రేలియా పత్రికలు ఖాయం చేశాయి.

05/13/2017 - 22:17

ఏ సిరీస్ లేదా టోర్నీల్లోనైనా ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లేదా టోర్నమెంట్ అవార్డులు అత్యంత ప్రధాన్యతను సంతరించుకుంటాయి. 1998లో మొదటిసారి చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును జాక్వెస్ కాలిస్ దక్కించుకున్నాడు. ఆ టోర్నీలో ఫిలియో వాలెస్ అత్యధికంగా 221 పరుగులు చేయగా, కాలిస్ అందరికంటే ఎక్కువగా 8 వికెట్లు సాధించాడు.

05/13/2017 - 22:10

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లను క్రికెట్‌లో చిరకాల శత్రువులుగా పేర్కొంటారు. అయితే, ఈ రెండు దేశాల జాతీయ గీతం ఒకటేనన్నది చాలా తక్కువ మందికి తెలిసిన నిజం. అంతేగాక, రెండు దేశాల జాతీయ జెండాల్లో చాలా సారూప్యం ఉంటుంది. చివరికి అభిమానులు తమతమ ఆటగాళ్లకు మద్దతునిచ్చే తీరు కూడా ఒకే రకం.

05/13/2017 - 22:08

* ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల ‘టాప్-10’ జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే చోటు సంపాదించాడు. శ్రీలంక బౌలర్ పర్వేజ్ మహారుఫ్ 14 పరుగులకు ఆరు వికెట్లతో నంబర్ వన్ స్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా, షాహిద్ అఫ్రిదీ, మఖయా ఎన్తినీ, మెర్విన్ డిల్లాన్, జాక్వెస్ కాలిస్, జాకబ్ ఓరమ్, గ్లేన్ మెక్‌గ్రాత్, షేన్ ఒకార్నర్ తలా ఐదు వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించారు.

05/13/2017 - 22:06

* న్యూజిలాండ్ బౌలలర్ కేల్ మిల్స్ బౌలింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించాడు. అతను 15 ఇన్నింగ్స్ ఆడి, 675 పరుగులిచ్చి 28 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 17 ఇన్నింగ్స్‌లో 805 బంతులు వేసి 484 పరుగులకు 24 వికెట్లు కూల్చి రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పేసర్ 16 ఇన్నింగ్స్‌లో 739 బంతులు వేశాడు. 591 పరుగులిచ్చి 22 వికెట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు.

05/13/2017 - 22:04

* చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టాప్ స్కోరర్ వెస్టిండీస్ హీరో క్రిస్ గేల్. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతను 17 ఇన్నింగ్స్‌లో 791 పరుగులు చేశాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనే 18 ఇన్నింగ్స్‌లో 742, అతని సహచరుడు కుమార సంగక్కర 21 ఇన్నింగ్స్‌లో 683 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

05/08/2017 - 22:07

* సాకర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారికి మొదట ఎల్లో కార్డు చూపి హెచ్చరిస్తారు. పదేపదే పొరపాట్లు చేసిన వారికి లేదా క్రీడాస్ఫూర్తిని దారుణంగా దెబ్బతీసిన వారికి రెడ్ కార్డు చూపి బయటకు పంపుతారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతి తక్కువ సమయంలోనే గెంటివేతకు గురైన ఆటగాడు లీ టాడ్.

Pages