S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

03/19/2017 - 06:39

* స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్రెజిల్ పోల్‌వాల్టర్ థియాగో బ్రాజ్ డ సిల్వ ఉత్సాహంగా బరిలోకి దిగాడు. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఫైనల్ చేరాడు. అక్కడ కూడా అందరి కంటే ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అభిమానులు జేజేలు పలుకుతారనుకున్న అతను వారి వైఖరితో ఒక్కసారిగా నీరుగారిపోయాడు.

03/19/2017 - 06:36

పర్యావరణ పరిరక్షణతోపాటు, ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యర్ధాలను తిరిగి ఉపయోగించే అవకాశాలపై అవగాహన పెంచడానికి వీలుగా 2020 ఒలింపిక్స్‌లో పతకాలను ఆ వ్యర్ధాలతోనే తయారు చేయాలని నిర్వాహణ కమిటీ తీర్మానించింది. పాడైన సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసి పతకాలు తయారు చేస్తామని తెలిపింది.

03/19/2017 - 06:34

మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో కనీసం 50 పతకాలను సాధించే దిశగా నీతి ఆయోగ్ చర్యలు తీసుకుంటోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 13 క్రీడాంశాల్లో పోటీపడేందుకు 83 మందిని పంపింది. ఆరు పతకాలను సాధించింది.

03/19/2017 - 06:33

కెరీర్‌లో వందకుపైగా (136) టెస్టులు ఆడినప్పటికీ, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన ఏకైక ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ 86 వనే్డ ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. కానీ, అతనికి ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. భారత సెలక్టర్లు తీసుకునే విచిత్ర నిర్ణయాలకు ఇదో నిదర్శనం.

03/19/2017 - 06:31

* సియాల్ కోట్‌లో 1984 అక్టోబర్ 31న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3 వికెట్లకు 210 పరుగులు చేసింది. గుండప్ప విశ్వనాథ్ (12), గులాం పార్కర్ (20), సందీప్ పాటిల్ (59) అవుట్‌కాగా, రవిశాస్ర్తీ (5)తో కలిసి దిలీప్ వెంగ్‌స్కార్ క్రీజ్‌లో ఉన్నాడు.

03/19/2017 - 06:28

* బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ తన రంజీ ట్రోఫీ కెరీర్ మొత్తంలో ఒకే ఒకసారి డకౌటయ్యాడు. అతనిని సున్నాకే అవుట్ చేసిన ఘనత భువనేశ్వర్ కుమార్ దక్కించుకున్నాడు. 2009 జనవరిలో ఉత్తర ప్రదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన రంజీ ఫైనల్‌లో ముంబయి 243 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

03/19/2017 - 06:25

* ఒలింపిక్స్‌ను చూసేందుకు చైనా నుంచి లండన్ వరకూ ప్రయాణించిన ఓ రైతు అప్పట్లో ‘రియల్ హీరో’గా మారాడు. జియాంగ్జూ ప్రాంతానికి చెందిన చెన్ గుయాన్మింగ్ ఓ సామాన్య రైతు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే, క్రీడా పతాకాన్ని స్వీకరించిన ఇంగ్లాండ్ ప్రధాని లండన్ ఒలింపిక్స్‌కు అందరూ ఆహ్వానితులేనని ప్రకటించాడు.

03/11/2017 - 22:18

వివాదాల ఊబిలో కూరుకుపోయిన ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ విలవిల్లాడుతున్నది. క్రికెట్‌కు వివాదాలు కొత్తకాకపోయినా, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్రీడాస్ఫూర్తిని, క్రికెట్ సిద్ధాంతాన్ని అవహేళన చేస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకున్న సంఘటన క్రికెట్‌లో చీకటి కోణాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

03/11/2017 - 22:16

క్రికెట్ రారాజుగా వెలిగిపోయిన సచిన్ తెండూల్కర్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. లెక్కకు మించి రికార్డులను తన ఖాతాలో చేర్చుకున్న అతనికి అజాత శత్రువన్న పేరుంది. ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే అతనికి కూడా వివాదాల తాకిడి తప్పలేదు. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 23 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును 2003లో సచిన్ సమం చేశాడు.

03/11/2017 - 22:13

స్లెడ్జింగ్ లేదా మైదానంలో బాహాబాహీ.. క్రికెట్ పరువును దిగజార్చడంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుంటారన్న వాదన ఉంది. అయితే, మనకూ ఇదేమీ కొత్తకాదు. పలువురు క్రికెటర్లు వివాదాల్లో చిక్కుకున్నవారే. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని, జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ పేరును ఈ సందర్భంగా ప్రస్తావించాలి.

Pages