S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

03/11/2017 - 22:11

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్‌కు ఎప్పుడూ పడేదికాదు. ధోనీ వల్లే తన కెరీర్ దెబ్బతిన్నదని సెవాగ్ అభిప్రాయం. 2011లో టీమిండియా ప్రపంచ కప్‌ను సాధించినప్పుడు అంతా జట్టు కెప్టెన్ ధోనీని ఆకాశానికి ఎత్తేశారు. కానీ, సెవాగ్ మాత్రం ఆ ఘనత జట్టులోని ఆటగాళ్లందరికీ చెందుతుందని వ్యాఖ్యానించాడు. భారత్ విజయానికి ధోనీ నాయకత్వం ఏమాత్రం కారణం కాదని తేల్చిచెప్పాడు.

03/11/2017 - 22:09

భారత క్రికెటర్లపై తల్లులే ఆరోపణలు చేసిన సంఘటనలు లేకపోలేదు. పంజాబ్ ఆల్‌రౌండర్ మన్‌ప్రీత్ గోనీ, మాజీ వికెట్‌కీపర్ నయన్ మోంగియా ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నారు. జాతీయ జట్టుకు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిథ్యం వహించిన గోనీ తనను చంపుతానని బెదిరించినట్టు ఆతని తల్లి మొహీందర్ కౌర్ ఆరోపించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 2008లో ఈ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత గోనీ కెరీర్ ప్రమాదంలో పడింది.

03/11/2017 - 22:06

* మాజీ ఓపెనర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధుపై హత్య కేసు నమోదైంది. 1988లో జరిగిన ఒక చిన్నపాటి ప్రమాదం ఘర్షణకు దారితీసింది. పటియాలా నివాసి గుమ్‌నామ్ సింగ్‌ను సిద్ధు బలంగా కొట్టి, అతని మరణానికి కారణమయ్యాడని ఫిర్యాదుదారుల ఆరోపణ. 2006 డిసెంబర్‌లో కోర్టు సిద్ధుని దోషిగా తేల్చి, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

03/11/2017 - 22:04

* బలమైన వెస్టిండీస్‌ను ఓడించి, 1983లో ప్రపంచ కప్‌ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ మొహీందర్ అమర్‌నాథ్. ఎంత బాగా ఆడినా, జట్టు నుంచి పదేపదే తనను తప్పించడంపై మొహీందర్ ఎన్నోసార్లు అసంతృప్తి వ్యక్తం చేశాడు. 1988లో మరోసారి తనపై వేటు పడడాన్ని అతను సహించలేకపోయాడు. సెలక్టర్లను జోకర్ల గుంపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

03/11/2017 - 22:03

సచిన్ తెండూల్కర్‌కు సమవుజ్జీగా పేర్కోదగ్గ ఆటగాడు వినోద్ కాంబ్లీ. క్రమశిక్షణను పాటిస్తే కెరీర్‌లో ఎంత ఉన్నతంగా ఎదగవచ్చో చెప్పడానికి సచిన్ ఉదాహరణగా నిలిస్తే, క్రమశిక్షణ లేకపోతే, ఎంత ప్రతిభాశాలికైనా పతనం తప్పదని కాంబ్లీ కెరీర్ పాఠాలు నేర్పుతుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించి, కెరీర్‌ను నాశనం చేసుకున్న కాంబ్లీ వివాదాల్లోనూ ముందుండేవాడు.

03/05/2017 - 00:41

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) 1909 జూన్ 15వ తేదీన ఏర్పడింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు అధికారికంగా ఐసిసిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందాయి. 1936 మే 31న భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు చేరాయి. 1953 జూలై 28న పాకిస్తాన్, 1981 జూలై 21న శ్రీలంక, 1992 జూలై 6న జింబాబ్వే, 2000 జూన్ 26న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు ఐసిసిలో చోటు లభించింది.

03/05/2017 - 00:38

నిరంతరం అంతర్యుద్ధంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, ఇస్లామిక్ మత వాదులు ఎన్ని అడ్డంకాలు సృష్టిస్తున్నా అఫ్గానిస్థాన్ క్రికెటర్లు వెనుకంజ వేయడంలో లేదు. ఆ జట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ, టెస్టు హోదా ఉన్న దేశాలకు గట్టి సవాళ్లు విసురుతున్నది. జింబాబ్వే టూర్‌కు వెళ్లి, అక్కడ వనే్డ సిరీస్‌ను 3-2 తేడాతో గెల్చుకున్న తీరు అఫ్గాన్ దూకుడుకు అద్దం పడుతున్నది.

03/05/2017 - 00:36

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్లు వసీం అక్రం, వకార్ యూనిస్ మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతున్నది. దీనికి భారత మాజీ ఓపెనర్ సెవాగ్ ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలే కారణం కావడం విశేషం. 1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కుంబ్లే 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

03/04/2017 - 23:57

తొమ్మిది జట్లతో కూడిన టెస్టు లీగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. స్కాట్‌లాండ్, అఫ్గానిస్థాన్ దేశాల్లోని దేశవాళీ పోటీలకు ‘్ఫస్ట్‌క్లాస్’ హోదాను ప్రకటించడంతో, ఈ రెండు దేశాలకు టెస్టు హోదా దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం టెస్టు జట్లు పదికాగా, ఈ సంఖ్య త్వరలోనే పనె్నండుకు పెరుగుతుంది. తొమ్మిది జట్ల టెస్టు లీగ్ జరిగితే మిగతా మూడు జట్లకు, ప్రపంచ మేటి జట్లతో తలపడే అవకాశం లభిస్తుంది.

03/04/2017 - 23:52

* అది యుద్ధ మైదానం కాకపోయినా, రాళ్లతో ఒకరినొకరు కొట్టుకుంటారు. జెల్లికట్టు మాదిరిగానే ఇది కూడా ఒక ఆటే. సంప్రదాయం పేరుతో జరుగుతున్న తతంగమే. సుమారు మూడు వందల సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది. మధ్యప్రదేశ్‌లోని చిన్‌ద్వారా జిల్లాలో జామ్ నదీ తీరంలోని పంధుర్నా, సవార్‌గావ్ గ్రామస్తులు పాల్గొనే ‘గోత్మర్ మేళా’ వాస్తవానికి యుద్ధాన్ని తలపిస్తుంది. వందలాది మంది తీవ్రంగా గాయపడతారు.

Pages