S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/06/2015 - 07:33

ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో వరుసగా ఎక్కువ మెయిడిన్లు వేసిన బౌలర్ బాపూ నాద్కర్ణి. భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించిన అతను 1964 జనవరిలో ఇంగ్లాండ్‌పై చెన్నై మ్యాచ్‌లో 32 ఓవర్లు బౌల్ చేశాడు. వీటిలో 27 వరుస మెయిడిన్లు ఉన్నాయి. కేవలం ఐదు పరుగులిచ్చాడు. ఒక ఇన్నింగ్స్‌లో పది లేక అంతకంటే ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్లలో అత్యంత తక్కువ పరుగులిచ్చిన ఘనత కూడా అతనికే దక్కుతుంది.

12/06/2015 - 07:32

వనే్డ ఇంటర్నేషనల్స్, ట్వంటీ-20 మ్యాచ్‌ల రంగ ప్రవేశంతో ప్రాభవం కోల్పోయి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాల్సిన బాధ్యతను అందరూ కలిసి పంచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తోపాటు, టెస్టు హోదాగల దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలి.

12/06/2015 - 07:32

ప్రపంచ మాజీ నంబర్ వన్ టైగర్ ఉడ్స్ వివాహేతర సంబంధాల కారణంగా అతని భార్య ఎలెన్ నార్డెగ్రిన్ విడాకులు తీసుకుంది. పరువు పోగొట్టుకున్న ఉడ్స్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మళ్లీ బయటకు వచ్చి కెరీర్‌ను కొనసాగించినప్పటికీ, గతంలో మాదిరి అద్భుతాలు సృష్టించలేకపోయాడు. కెరీర్‌లో ఎన్నడూ లేని రీతిలో ప్రస్తుతం 362వ ర్యాంక్‌లో ఉన్నాడు.

12/06/2015 - 07:31

టెస్టు క్రికెట్‌కు మరో గ్రహణం పట్టింది. ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్‌కు నిర్వచనం చెప్పేలా ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ ఇప్పుడు కొత్త ఒరవడిలో కొట్టుకుపోతున్నది. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌లపై ఐదు రోజుల జరగాల్సిన మ్యాచ్‌లకు మూడు రోజులు కూడా పూర్తికాకుండానే తెరపడుతున్నది. తమతమ ఆటగాళ్లకు అనువునా, వారికి సహకరించే రీతిలో పిచ్‌లను తయారు చేసుకోవడం కొత్త కాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయమే.

12/06/2015 - 07:30

సఫారీలకు చుక్కలు చూపిస్తున్న స్పిన్నర్

11/28/2015 - 23:55

చారిత్రక ప్రాధాన్యం ఉన్న క్రీడల్లో మల్ల యుద్ధం ఒకటి. రెజ్లింగ్‌గా నేడు అంతర్జాతీయ క్రీడగా వెలుగుతున్నప్పటికీ, దీని మూలాలు పలు దేశాల ఇతిహాసాల్లో కనిపిస్తాయ. మల్ల యుద్ధానికి మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది.
==============

11/28/2015 - 23:54

ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో పాల్గొన్న తొలి భారతీయుడు ‘ది గ్రేట్’ ఖలీ ఆధ్వర్యంలో కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (సిడబ్ల్యుఇ) ఆరంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫైట్స్‌ను ఉత్తరాఖండ్‌లో నిర్వహించేందుకు ఖలీ సన్నాహాలు చేస్తున్నాడు. రెజ్లింగ్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు జరిగిన ప్రయత్నమే ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్.

11/28/2015 - 23:56

భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను కళాత్మక ఆటకు ప్రతీకగా పేర్కొంటారు. అయితే, వనే్డల్లో అతని ఆట ఏమాత్రం సరిపోదన్న విమర్శలున్నాయి. మొదటి వరల్డ్ కప్‌లో అతని జిడ్డు బ్యాటింగ్ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 ఓవర్లలో 335 పరుగులు సాధించాల్సి ఉండగా, ఓపెనర్‌గా వచ్చిన గవాస్కర్ జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను నీరుగార్చాడు.

11/28/2015 - 23:52

స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి, జైలు శిక్షను కూడా అనుభవించిన పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ ఒక వివాదాస్పద టోర్నీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.

11/28/2015 - 23:51

పారిస్‌లోని సెయింట్ డెనిస్ శివార్లలోని స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం బయట బాంబులు పేలినా, స్టేడియంలోపల ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. ప్రపంచ చాంపియన్ జర్మనీని ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. మ్యాచ్ ప్రథమార్ధంలో స్టేడియం వెలుపల బాంబులు పేలిన శబ్దం వినిపించినప్పటికీ, చాలా మంది దానిని బాణాసంచా శబ్దంగా భ్రమించారు.

Pages