S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/21/2017 - 23:38

* ఇంట్లో పులి.. వాకిట్లో పిల్లి అన్న ముద్ర భారత క్రికెట్ జట్టుపై ఎన్నో దశాబ్దాలుగా ఉంది. చాలా మంది క్రికెటర్లకూ ఇలాంటి పేరే ఉంది. ఇటీవలే పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగి, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వనే్డలో సెంచరీ సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ పేరును ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించాలి. అతని ప్రతాపం కేవలం ఆసియాలోనే.

01/21/2017 - 23:36

కొత్త ఒరవడి

01/21/2017 - 23:34

చాలాకాలంగా వినిపిస్తున్న డిమాండ్‌ను జాతీయ సెలక్టర్లు ఎట్టకేలకు తీర్చారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకే వనే్డ, టి-20 ఫార్మాట్లలోనూ నాయకత్వ పగ్గాలను అప్పగించారు. మహేంద్ర సింగ్ ధోనీతో ఏ విధంగా పోల్చడానికి వీల్లేనప్పటికీ, అతని మాదిరిగానే కోహ్లీ కూడా సమర్థుడే. జట్టుకు విజయాలను అందించగల సమర్థుడే.

01/07/2017 - 23:29

‘జార్ఖండ్ డైనమెట్’ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డ, టి-20 ఫార్మాట్స్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పడంతో, భారత క్రికెట్‌లో ఓ అద్వితీయ శకానికి తెరపడింది. అదే సమయంలో సరికొత్త అధ్యాయానికి పునాది పడింది. ఇన్నాళ్లూ టెస్టు జట్టు కెప్టెన్‌గా టీమిండియాను దూకుడుగా పరుగులు తీయిస్తున్న విరాట్ కోహ్లీ ఇకపై పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ నాయకత్వం వహించనుండడమే అందుకు కారణం.

01/07/2017 - 23:28

ధోనీ హెయర్ స్టయల్ ఎప్పుడూ చర్చనీయాంశమే. అమ్మాయలు కూడా అసూయపడేలా పొడవాటి జుట్టు కావచ్చు... అరగుండు కావచ్చు.. ఒక్కోసారి పూర్తి గుండు గీయంచుకోని ఉండొచ్చు... ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అన్న చందంగా ధోనీ ఏం చేసినా అదొక సంచలనమే అవుతుంది. చివరికి అతని హెయర్ స్టయల్‌ను కూడా అనుకరించడం అభిమానులకు అలవాటైంది. కెరీర్‌ను ఆరంభించిన రోజుల్లో తన ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌తో ప్రత్యేకంగా కనిపించేవాడు.

01/07/2017 - 23:25

వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తూనే జట్టుకు నాయకత్వం వహిస్తూ ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ధోనీ టాపర్. అతను ఈ ద్విపాత్రాభియనం చేస్తూ 6,633 పరుగులు సాధించాడు. 1,756 పరుగులతో కుమార సంగక్కర ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడాను చూస్తే, ధోనీ రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించే అవకాశమే లేదని స్పష్టమవుతుంది.

01/07/2017 - 23:24

కోపిష్టి బాక్సర్‌గా ముద్రపడిన డెరెక్ చిసోరాకు కోపమొచ్చింది. ఈసారి ఏకంగా బ్రిటిష్ బాక్సింగ్ బోర్డు (బిబిబిసి) అధికారులపైనే అతను కాలుదువ్వాడు. బ్రిటిష్ చాంపియన్ డిలియన్ వైట్‌తో చిసోరా ఫైట్‌ను ప్రమోట్ చేయడానికి బిబిబిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే లండన్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

01/07/2017 - 23:21

* ధోనీకి ఆర్మీ అంటే ఎంతో ఇష్టం. క్రికెటర్‌ను కాకపోతే, సైన్యంలో చేరే వాడినని అతను చాలా సందర్భాల్లో చెప్పాడు. 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. అప్పటి నుంచి అతను ఎప్పుడు సమయం దొరికినా సైనిక శిబిరాల్లోకి వెళ్లేవాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, అతనికి ఎక్కువ విశ్రాంతి లభించడం ఖాయం.

01/07/2017 - 23:20

* ధోనీకి మోటార్ బైక్స్‌పై వేగంగా షికార్లు చేయడం అంటే మహా సరదా. అతని వద్ద ఇరవై ఐదుకుపైగా మోటార్ సైకిళ్లు ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుతునే ఉంది. కొన్న ఏ వాహనాన్నీ అతను అమ్మలేదు. ఎప్పుడో ఒకసారి వాటిని వాడుతునే ఉంటాడు.

12/31/2016 - 21:50

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తాను తీసుకున్న గోతిలో తానే పడింది. మొండి వైఖరిని ప్రదర్శించి, తాడును తెగే వరకూ లాగిన బోర్డు అధికారులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ. మూడో తేదీన సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వారిని వేధిస్తున్నది.

Pages