S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

03/19/2016 - 21:35

క్రికెట్ స్వరూపం మారింది. కళాత్మక ఆట పేరుతో గంటల తరబడి క్రీజ్‌లో పాతుకుపోయే రోజులకు తెరపడింది. ఎంత సేపు క్రీజ్‌లో ఉన్నామని కాదు.. ఎన్ని పరుగులు చేశామన్నదే ముఖ్యమన్న అభిప్రాయం ప్రతి క్రికెటర్‌లో పాతుకుపోయింది. అంపైర్ నుంచి గార్డ్ తీసుకున్న మరుక్షణం నుంచే బౌలర్లపై విరుచుకుపడడం బ్యాట్స్‌మెన్ ప్రధాన లక్షణమైంది.

03/19/2016 - 21:30

మామూలు బంతులేకాదు.. వజ్రాలు పొదిగిన బంతులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ సీజస్ ఆరంభాన్ని పురస్కరించుకొని, 2004లో వజ్రాలతో బంతిని తయారు చేయించారు. శ్రీలంకలోని అల్‌స్టోన్ కొచ్ సంస్థ దీనిని 53.83 క్యారెట్ల బరువుతూగే 2,704 వజ్రాలతో రూపొందించింది. ఈ వజ్రాలను 125 గ్రాముల నాణ్యమైన బంగారంతో ఒక దగ్గరికి చేర్చి, బంతి ఆకారంలో తీర్చిదిద్దారు.

03/19/2016 - 21:29

క్రికెట్ ఆడే దేశాలు, క్రికెటర్ల మధ్యేకాదు.. బంతులు తయారు చేసే కంపెనీల మధ్య కూడా ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది. క్రికెట్ బంతులను తయారు చేసే కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు మాత్రం ముచ్చటగా మూడే. వీటిలో మొదటిది కూకబూరా. ఈ కంపెనీకి చెందిన బంతులకు విశేష ఆదరణ ఉంది.

03/19/2016 - 21:28

ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు బంతులను తయారు చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి తయారీకి వాడే జంతు చర్మం నాణ్యత నుంచి ‘సీమ్’గా పిలిచే కుట్ల వరకూ ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. బరువు నుంచి ఫినిషింగ్ దాకా ప్రతి దశలోనూ వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలి. మృదువుగా ఉంటే పరుగుల వరద పారదు. మరీ దృఢంగా ఉంటే బంతి విపరీతంగా స్వింగ్ అవుతుంది.

03/19/2016 - 21:27

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న వింత నిర్ణయం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా దేశవాళీ పోటీల్లో ఎస్‌జి బంతులను వాడుతున్నారు. కపిల్ దేవ్, కర్నస్ ఘావ్రీ, మదన్‌లాల్, బల్వీందర్ సింగ్ సంధు, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, బాపూ నాద్కర్ణి, అనిల్ కుంబ్లే వంటి మేటి బౌలర్లు క్రికెట్ ప్రపంచానికి ఇక్కడి నుంచే లభించారు.

03/19/2016 - 21:26

* ఫాస్ట్ బౌలర్లు సాధ్యమైనంత వరకూ బంతిని పాతపడకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలోనే ఉమ్మిని లేదా చెమటను దానికి పూస్తూ, ప్యాంట్ లేదా షర్టుకు బలంగా రుద్దుతుంటారు. అయితే, బంతిని మరింత మెరిపించడానికి, వేగంగా దూసుకెళ్లేలా చేయడానికి ఇంగ్లాండ్ పేసర్ బాబ్ విల్లీస్ ఓ కొత్త పద్ధతి కనిపెట్టాడు.

03/19/2016 - 21:24

* క్రికెట్ మ్యాచ్‌ల్లో ఒక బ్యాట్స్‌మన్ బంతిని స్టాండ్స్‌లోకి కొట్టినప్పుడు ఏమవుతుంది? ఆ బంతిని అందుకున్న ప్రేక్షకుడు దానిని మళ్లీ మైదానంలోకి విసురుతాడు. లేదా సమీపంలోని ఆటగాడికి అందిస్తాడు. కానీ, బేస్‌బాల్‌లో బంతి దొరికితే అదృష్టమే. దానిని మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. దర్జాగా జేబులో వేసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు.

03/19/2016 - 21:22

* క్రికెట్ బంతులు సరిగ్గా రెండు అర్ధ భాగాలను కలిపి తయారు చేస్తారన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ, అది నిజం కాదు. 224 మిల్లీ మీటర్లు, 229 మిల్లీ మీటర్లు ఉండే రెండు అర్ధ భాగాలను కలిపి బంతులను కుడతారు. మరీ సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప ఈ తేడా కనిపించదు. ఒక్కో బంతి బరువు 155.9 నుంచి 163 గ్రాముల వరకు ఉంటుంది.

03/13/2016 - 02:38

వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్‌తొలి, చివరి మ్యాచ్‌ల్లో శతకాలను నమోదు చేసిన బ్యాట్స్‌మన్ డెనిస్ అమిస్. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మన్ 1972లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వనే్డ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మ్యాచ్‌లో 103 పరుగులు సాధించాడు.

03/13/2016 - 02:36

కాప్రియాటి

Pages