S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

11/13/2016 - 04:15

సాకర్ ప్రపంచంలో అర్జెంటీనా, బ్రెజిల్ చిరకాల ప్రత్యర్థులన్నది అందరికీ తెలిసిందే. రెండు జట్ల ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా కయ్యానికి కాలుదువ్వుకుంటారు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. పోటీలు, టోర్నీలు లేనప్పుడూ ఇరు దేశాల మధ్య ఇదే దృశ్యం కనిపిస్తుంది. అయితే, అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి బ్రెజిల్ హీరో నేమార్ సాయం చేశాడు.

11/13/2016 - 04:12

ఆర్భాటాలు లేకుండా..

11/13/2016 - 00:18

ఫార్ములా వన్ రేస్‌లో ఇద్దరు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆరంభంలో మంచి మిత్రులు. కానీ, చాలకాలంగా ప్రత్యర్థుల్లా మారిపోయారు. కత్తులు దూస్తున్నారు. ప్రపంచ సర్క్యూట్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండు పర్యాయాలు , ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లూయిస్ హామిల్టన్‌కు ఈఏడాది తన జట్టుకే చెందిన నికో రోజ్‌బెర్గ్ నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైంది.

11/06/2016 - 04:08

ఇంగ్లాండ్‌తో మరోసారి యుద్ధానికి భారత్ సన్నాహాలు చేస్తున్నది. సొంత గడ్డపై జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు పోరులో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఇటీవలే న్యూజిలాండ్‌కు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ వేసి మంచి ఊపుమీద ఉంది. ప్రపంచ నంబర్ స్థానాన్ని మరోసారి దక్కించుకుంది.

11/06/2016 - 04:05

టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డును రాహుల్ ద్రవిడ్‌తో కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ పంచుకుంటున్నాడు. వీరిద్దరూ చెరి ఏడు సెంచరీలు సాధించారు. ఇంగ్లాండ్ తరఫున భారత్‌పై కెవిన్ పీటర్సన్ అత్యధికంగా ఆరు శతకాలు నమోదు చేశాడు. ఇయాన్ బోథమ్, గ్రాహం గూచ్ చెరి ఐదు సెంచరీలు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

11/06/2016 - 04:01

భారత జట్టును విజయం ఊరిస్తున్నది. ఇంగ్లాండ్‌పై టీమిండియాకు చివరిసారి టెస్టు సిరీస్ 2008లో దక్కింది. అప్పటి జట్టులో ఆడిన వారిలో అమిత్ మిశ్రా మాత్రమే ఇప్పటి జట్టులో ఉన్నాడు. 2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఐదు టెస్టుల్లో అతను 13.4 సగటుతో కేవలం 134 పరుగులు చేయగలిగాడు.

11/06/2016 - 03:59

స్టు సిరీస్‌లో కీలక పరిణామం. వివిధ కారణాలను పేర్కొంటూ చాలాకాలం డిఆర్‌ఎస్‌ను భారత క్రికెట్ బోర్డు వ్యతిరేకిస్తూ వస్తున్నది. అయితే, కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే తదితరులు సానుకూలత వ్యక్తం చేయడం ఒకవైపు, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న మరోవైపు ప్రభావం చూపగా బిసిసిఐ తన మొండిపట్టును వీడింది. డిఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు ఆమోదించింది.

11/06/2016 - 03:54

భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడిన టెస్టుల్లో, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ ఫ్రెడ్ ట్రూమన్. 1952లో జరిగిన మాంచెస్టర్ టెస్టులో అతను 31 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు. చెన్నైలో వినూ మన్కడ్ 55 పరుగులకు 8, ఢిల్లీ టెస్టులో భగవత్ చంద్రశేఖర్ 79 పరుగులకు 8 చొప్పున వికెట్లు కూల్చి, మన దేశం తరఫున ఇంగ్లాండ్‌పై ఉత్తమ బౌలింగ్ విశే్లషణ నమోదు చేశారు.

11/06/2016 - 03:48

* ఇంగ్లాండ్‌పై ఎక్కువ టెస్టులు ఆడిన భారత బ్యాట్స్‌మన్‌గా గవాస్కర్ నెలకొల్పిన రికార్డు పదిలంగా ఉంది. అతను ఇంగ్లాండ్‌పై 38 మ్యాచ్‌లు ఆడితే, గుండప్ప విశ్వనాథ్ 30, కపిల్ దేవ్ 27, దిలీప్ వెంగ్‌సర్కార్ 26 చొప్పున టెస్టులు ఆడారు. ఇక ఇంగ్లాండ్ తరఫున భారత్‌పై డేవిడ్ గోవర్ అత్యధికంగా 24 టెస్టుల్లో పాల్గొన్నాడు.

10/29/2016 - 22:08

వెస్టిండీస్ అంటే ఒకప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు గుర్తుకొస్తారు. బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సృష్టించే బ్యాట్స్‌మెన్ గుర్తుకొస్తారు. కానీ, అదంతా గత వైభవమే. నేడు అది కొడిగట్టిన దీపం. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించే చార్లెస్ గ్రిఫిత్‌లు, మైఖేల్ హోల్డింగ్‌లు, జోల్ గార్నర్లు, మాల్కం మార్షల్‌లు, ఆండీ రాబర్ట్స్‌లు, కొట్నీ వాల్ష్‌లు ఇప్పుడు జట్టులో లేరు.

Pages