S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

08/27/2016 - 21:33

రియో ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకాలు సాధించి పెడతారన్న అభిమానుల ఆశలను వమ్ము చేసిన టెన్నిస్ స్టార్లంతా ఫ్లాప్ షోలతో నిరాశ పరిచారు. సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బొపన్న, ప్రార్థనా తొంబారే ఘోరంగా విఫలమయ్యారు. ప్రత్యేకించి, మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా, బొపన్న జోడీ చేతులెత్తేసిన విధానం అందరినీ ఆవేదనకు గురి చేసింది.

08/27/2016 - 21:31

రియోలో భారత బృంద ప్రదర్శనను ఒకసారి గుర్తుచేసుకుంటే, ఆ పాఠాలతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చు. బాడ్మింటన్‌లో పివి సింధు ఫైనల్‌కు చేరి, టైటిల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్‌తో చివరి వరకూ పోరాడింది. తుది యుద్ధంలో ఓడి, రజత పతకానికి పరిమితమైనప్పటికీ, కోట్లాది మంది అభిమానుల నీరాజనాలు అందుకుంది.

08/27/2016 - 21:30

రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్‌ను మినహాయిస్తే మిగతా వారంతా నిరాశ పరిచారు. మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి పరువు నిలిపింది. 48 కిలోల ఫ్రీస్టయిల్ ప్రీ క్వార్టర్స్‌లో వినేష్ ఫొగట్ గాయపడి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్, సందీప్ తోమర్, రవీందర్ ఖత్రి, హర్దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యారు.

08/27/2016 - 21:29

భారత బాక్సర్లు ప్రత్యర్థులపై బలమైన పంచ్‌లు విసరడంలో విఫలమయ్యారు. వికాస్ కృషన్, మనోజ్ కుమార్, శివ థాపా తమ స్థాయికి తగిన ప్రదర్శన కూడా ఇవ్వలేక చతికిల పడ్డారు. లండన్ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ కాంస్య పతకాన్ని సాధించగా, ఈసారి మహిళల విభాగంలో ఒక్కరూ కూడా క్వాలిఫై కాలేదు.
బాణాలు తగల్లేదు

08/27/2016 - 21:27

టీనేజ్‌లోనే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన అదితి అశోక్ ఆకట్టుకుంది. తన స్థాయికి మించి కష్టపడిన ఆమె 41వ స్థానంతో ముగించినప్పటికీ, తనకు ఉత్తమ భవిష్యత్తు ఉందని నిరూపించింది. పురుషుల విభాగంలో చౌరసియా 50, అనిర్బాన్ లాహిరి 57 స్థానాలకు ఒదిగిపోయారు.

,
08/27/2016 - 21:25

బ్రెజిల్ సింక్రనైజ్డ్ స్విమ్మర్లు బియా ఫెరెస్, బ్రాన్కా ఫెరెస్ కవలలు. ఇద్దరూ డ్రైవర్లే. పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో సింక్రనైజ్డ్ టీం విభాగంలో పోటీపడుతున్నారు. ఒకరికొకరుగా జీవిస్తున్న ఈ ఇద్దరూ ఒకే రకమైన ఉద్యోగం కోరుకుంటున్నారు. ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చినా చేయబోమని రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు ప్రకటించారు.

,
08/20/2016 - 22:16

తెలుగు తేజం పివి సింధుకు మహిళల బాడ్మింటన్‌లో రజతం.. ఎవరూ పట్టించుకోని సాక్షి మాలిక్‌కు మహిళల రెజ్లింగ్‌లో కాంస్యం.. రియో ఒలింపిక్స్‌లో మేజర్ ఈవెంట్స్ ముగిసే సమయానికి భారత్ సాధించిన పతకాలివి. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప మిగిలిన ఈవెంట్స్‌లో పతకాలు వస్తాయన్న ఆశ లేదు. గతంలో ఎన్నడూ లేనంత భారీ బృందం రియోకి వెళ్లింది. 118 మంది పోటీపడడం సంఖ్యా పరంగా ఒక రికార్డు. సింధు ప్రతిభ.. సాక్షి పోరాటం..

08/20/2016 - 22:11

ఒలింపిక్స్ పురుషుల వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో తీవ్రంగా గాయపడి, శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఫ్రెంచ్ జిమ్నాస్ట్ సమీర్ అయిత్ సరుూద్ ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఎడమ మోకాలి కింద భాగంలో రెండు చోట్ల ఎముక విరగడంతో శస్తచ్రికిత్స జరిగిందని అతను ఆసుపత్రి నుంచి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. గాయం తీవ్రమైనదేనని, అయితే, తన కెరీర్‌కు తెరపడిందని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు.

08/20/2016 - 22:10

బ్రిటిష్ అథ్లెట్లు జాసన్ కెన్నీ, లారా ట్రాట్ అద్వితీయ ప్రతిభతోనేకాదు.. ఒకరి కోసం ఒకరుగా నిలిచే జంటగానూ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సైక్లింగ్ టీం పర్స్యూట్, ఒమ్నియమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న ట్రాట్ రియోలోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేసి, బ్రిటిష్ అత్యుత్తమ క్రీడాకారిణిగా చరిత్ర పుటలోకి ఎక్కింది.

08/20/2016 - 22:08

మెగా ఈవెంట్స్‌లో, ప్రత్యేకంగా ఒలింపిక్స్‌లో స్విమ్మర్లు చాలా మంది రెండేసి క్యాప్‌లు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి ప్రత్యేక కారణం ఉందా అంటే ఉందనే సమాధానం వస్తున్నది. మొదట లేటెక్స్ క్యాప్‌ను పెట్టుకునే స్విమ్మర్లు దానిపైన సిలికాన్ క్యాప్‌ను ధరిస్తారు. నీటిలో కళ్లకు రక్షణగా పెట్టుకునే గాగుల్స్ హఠాత్తుగా కింద పడకుండా ఉండేందుకు రెండు క్యాప్స్‌ను స్విమ్మర్లు వాడుతున్నారు.

Pages