S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

09/18/2016 - 02:25

* కొత్తకొత్త ఆటలను కనిపెడుతున్న ఉత్సాహవంతులు ఈ క్రమంలో ప్రమాదాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా హార్స్ బోర్డింగ్‌ను పేర్కోవాలి. రోడ్లపై బోర్డు స్కేటింగ్ చేయడంలో మజా లేదనుకున్నారో ఏమోగానీ హార్స్ బోర్డింగ్‌ను కనిపెట్టారు. గుర్రాన్ని జాకీ వేగంగా తోలుతుంటే, ఒక తాడు సాయంతో స్కేట్‌బోర్డింగ్‌పై దానిని అనుసరించడమే ఈ ఆట.

09/18/2016 - 02:22

* మినియాపొలిస్ స్టేడియంలో 1984లో బేస్ బాల్ మ్యాచ్ జరిగింది. ఆక్లాండ్ జట్టుకు చెందిన స్లగ్గర్ డేవ్ కింగ్‌మన్ కొట్టిన బంతి స్టేడియం రూఫ్ దిశగా దూసుకెళ్లింది. అంతే.. ఒక్కసారిగా మాయమైంది. బంతి స్టేడియం రూఫ్ కిందైనా పడాలి. లేదా రూఫ్ మీదైనా ఉండాలి. కానీ, అది ఎటు వెళ్లిందో ఎవరికీ అర్థం కావడం లేదు.

09/18/2016 - 02:19

జార్ టీం లేదా ఫాన్సీ బేర్స్ బయటపెట్టిన అంశాలు ఇప్పుడు చాలా మంది ప్రముఖ అథ్లెట్లను అనుమానంగా చూసేలా చేస్తున్నాయి. అంతేగాక, ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రష్యా ప్రభుత్వమే వ్యూహాత్మకంగా డోపింగ్‌ను ప్రోత్సహించి ఉంటే, ఐఒసి, ఐఎఎఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలేకాదు.. వాడా కూడా నిద్ర పోతున్నదా? దశాబ్దాలు దీనిని రహస్యంగానే ఎందుకు ఉంచింది? ఒలింపిక్స్‌కు ముందు ఎందుకు హడావుడిగా నివేదికలను విడుదల చేసింది?

09/18/2016 - 02:17

డయానా నయాద్ క్యూబా నుంచి ఫ్లొరిడా వరకు 103 కిలోమీటర్ల ట్రెక్‌ను ఈది సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అసాధారణ ఫీట్‌ను సాధించే సమయానికి ఆమె వయసు 64 సంవత్సరాలు. అంతకు ముందు ఆరు పర్యాయాలు ఆమె క్యూబా నుంచి ఫ్లొరిడా వరకూ ఈదే ప్రయత్నం చేసింది. అన్ని పర్యాయాలు విఫలమైనప్పటికీ, పట్టుదలతో మరోసారి సాహసానికి పూనుకొంది. ఏడో ప్రయత్నం సఫలమైంది. రికార్డు ఆమె సొంతమైంది.

09/10/2016 - 23:26

పది లక్షల స్ట్రోక్స్!

09/10/2016 - 23:20

ఆశ్చర్యంగా అనిపించినా, స్విమ్మింగ్ విధానాల్లో అన్నిటి కంటే మొదటిది బ్రెస్ట్ స్ట్రోక్ అని నిపుణులు తేల్చారు. ఫ్రీ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, బటర్ ఫ్లై స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, సైడ్ స్ట్రోక్, ఎలిమెంటరీ స్ట్రోక్ వంటి విధానాల్లో ప్రొఫెషనల్ స్విమ్మర్లు ఈత కొడతారు. వీటిలో బ్రెస్ట్ స్ట్రోక్ విధానం అత్యంత పాతది. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దంలోనే ఈ విధానం అమల్లో ఉండేది.

09/10/2016 - 23:17

బహ్రైన్‌కు చెందిన అల్‌జైన్ తారెక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నప్పుడు ఆమె వయసు కేవలం పదేళ్లు. ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది. 50 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్‌ను ఆమె 41.13 సెకన్లలో పూర్తి చేసింది.

09/10/2016 - 23:14

కాలి బొటన వేళ్లను వంచి నేలకు బలంగా నొక్కితే ఏమవుతుంది? ఎముకలు చిట్లిపోతాయి. కనీసం బెణుకుతాయి. వారం పది రోజులు నడవలేని పరిస్థితి వస్తుంది. కానీ, దాదాపుగా అందరు ప్రొఫెషనల్ స్విమ్మర్లు కాలి బొటన వేళ్లను రబ్బరు మాదిరి వంచగలుగుతారు. వాటిని పూర్తిగా వంచి, నేలకు అదిమిపట్టేస్తారు. బొటనవేళ్ల ఆసరాతో ఆరంభం అద్భుతంగా ఉండేందుకు ఇంతలా కష్టపడతారు. అంతేకాదు..

09/10/2016 - 23:09

ఊపిరి బిగబట్టి ఎంత సేపు ఉండగలం? సాధారణ మనుషులకు 30 సెకన్లు దాటితే ఉండడం సాధ్యం కాదు. ఆరోగ్యంగా ఉండి, బాగా శిక్షణ పొందిన వారు సుమారు రెండు నిమిషాల వరకూ ఊపిరి బిగపడతారు. కానీ, స్విమ్మింగ్‌లో ఫ్రీడైవర్లు చాలా మంది పది నిమిషాల వరకూ ఊపిరి పీల్చకుండా ఉండగలుగుతారు? ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టిన రికార్డు స్టిగ్ సెవెరినె్సన్ పేరిట ఉంది. అతను ఏకంగా 22 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా ఉండిపోయాడట.

09/10/2016 - 22:28

ఈత కొలనులో నీళ్లు స్థిరంగా ఉంటాయని అనుకుంటారు. కానీ, అది నిజంకాదు. నీరు స్థిరంగా ఉంటే, పోటీదారులు పూల్‌లోకి దూకిన వెంటనే వాటికి నలువైపులా ఉండే గోడలకు తగిలి నీరు అలల రూపంలో ఎదురు వస్తాయి. అందుకే, ఒత్తిడికి గురైనప్పుడు నీరు సైడ్ వాల్స్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. మరోవైపు నుంచి కొత్త నీరు పూల్స్‌లోకి చేరుతుంది.

Pages