S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

05/28/2016 - 22:40

బ్రిస్బేన్, మే 19: టెస్టు మ్యాచ్‌లు పగలు జరుగుతాయి. వనే్డ, టి-20 ఫార్మెట్‌లో మ్యాచ్‌లు కూడా పగలు జరిగినా, ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు డే/నైట్ పోటీలుగానే ఉంటాయి. కానీ టెస్టు క్రికెట్‌లోనూ డే/నైట్ మ్యాచ్‌లు రంగ ప్రవేశం చేశాయి. దీనితో ప్రేక్షకుల కోసం ‘ట్వి లైట్’ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

05/28/2016 - 22:37

లాస్ ఏంజిల్స్, మే 9: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందన్న విమర్శలు ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రీడా రంగంలో ఇప్పటికే ప్రతిష్ట కోల్పోయిన రష్యా మరోసారి వివాదంలో చిక్కుకుంది. రష్యా డోపింగ్ నిరోధక విభాగం (రసడా) మాజీ అధికారి విటాలీ స్టెపనోవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోచీ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వారిలో నలుగురు డోపింగ్ దోషులేనంటూ సంచలన ప్రకటన చేశాడు.

05/28/2016 - 22:35

రోలాండ్ గారోస్ ఫ్రాన్స్‌లో సమర్థుడైన పైలట్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పశ్చిమ సరిహద్దులో సేవలు అందించిన అతను మధ్యదరా సముద్రం మీదుగా విమానాన్ని నడిపిని తొలి ఫ్రెంచ్ పైలట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఆ సమయంలోనే అతను ఫ్రాన్స్ నుంచి జర్మనీకి దగ్గరిదారిని కనిపెట్టాడు. విమానానికి ఉండే ప్రొపెలర్స్‌ను ఉపయోగించి, మెషిన్ గన్స్‌ను వాడే విధానానికి శ్రీకారం చుట్టాడు.

05/21/2016 - 23:28

టెన్నిస్... ఆడేవాళ్లకే కాదు.. చూసే వాళ్లకూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మిగతా క్రీడల్లో మాదిరి మూసపోసినట్టు ఒకే విధంగా ఆడడం టెన్నిస్‌లో కనిపించదు. పశుబలంతో బంతిని బలంగా కొట్టే ‘పవర్ ప్లే’ వచ్చి చేరిందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా, చాలా క్రీడల్లాగా టెన్నిస్ తన మూలాలను కోల్పోలేదు. అందుకే, టెన్నిస్‌లో ప్రతి మ్యాచ్ ఒక అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తుంది. ప్రతి షాట్‌లోనూ కళాత్మక విలువలు పుష్కలంగా ఉంటాయి.

05/21/2016 - 23:22

మేసన్ మెలెరియో డిట్స్ మెల్లెర్ సంస్థ ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీల డిజైన్‌ను ఖరారు చేసి, వాటిని తయారు చేస్తున్నది. నాణ్యమైన వెండితో తయారయ్యే ఈ ట్రోఫీలపై విజేతల పేర్లను చెక్కుతారు. అసలైన ట్రోఫీ ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల వద్ద ఉంటుంది. వెండితోనే తయారు చేసిన నమూనా ట్రోఫీలను విజేతలకు అందచేస్తారు.

05/21/2016 - 23:29

ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్ క్రీడాకారులు టైటిల్ సాధించడం చాలా అరుదు. పురుషుల విభాగంలో మార్సెల్ బెర్నార్డ్ (1946), మాట్స్ విలాండర్ (198), గుస్టావో కుయెర్టర్ (1997), గస్టాన్ గైడో (2004) అన్‌సీడెడ్స్‌గా బరిలోకి దిగి టైటిల్ సాధించారు. మహిళల విభాగంలో మార్గరెట్ ష్రివెన్ మాత్రమే ఈ ఫీట్‌ను నమోదు చేసింది. 1933లో ఆమె సాధించిన ఈ ఘనతను ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు.

05/21/2016 - 23:03

అథ్లెట్స్‌ను మించిన ఫిట్నెస్ లేకపోతే, ఫ్రెంచ్ ఓపెన్‌లో రాణించడం అసాధ్యం. ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ వంటి కొంత మందికి మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ సొంతం. తొమ్మిది సార్లు పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్న నాదల్ ఈనెల 22 నుంచి జూన్ 5 వరకూ జరిగే ఈటోర్నీలో గెలుస్తాడా అన్నది అనుమానంగానే ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న రాఫెల్‌ను గాయాల సమస్య వెంటాడుతున్నది.

05/14/2016 - 22:06

* నలభయ్యేళ్ల వయసులో టెస్టు మ్యాచ్ ఆడడం సామాన్యం కాదు. అందులోనూ సెంచరీ సాధించడమంటే మాటలు కాదు. ఈ అరుదైన రికార్డు విజయ్ మర్చంట్ ఖాతాలో ఉంది. 1952లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఢిల్లీ టెస్టులో సెంచరీ చేసినప్పుడు అతని వయసు 40 సంవత్సరాల 22 రోజులు. మన దేశం తరఫున సెంచరీ చేసిన వారిలో ఎక్కువ వయసుగల బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించాడు.

05/14/2016 - 22:04

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)లో భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల హవాకు తెరపడనుందా? ఇన్నాళ్లు ‘మూడు’ముక్కలాట ఆడిన ఐసిసి ఇప్పుడు మార్పును కోరుకుంటున్నదా?

05/14/2016 - 22:01

టోక్యో (జపాన్)లో జరిగే 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) 984 కోట్ల రూపాయలతో భారీ ప్రణాళికను రూపొందించింది. 13-15 సంవత్సరాల మధ్య ఉన్న యువ ప్రతిభావంతులను ఎంపిక చేసి ఎనిమిదేళ్ల పాటు వారికి శిక్షణ ఇప్పించి 2020 ఒలింపిక్స్‌లో కనీసం 25 పతకాలైనా సొంతం చేసుకోవాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం.

Pages