S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

08/20/2016 - 22:10

బ్రిటిష్ అథ్లెట్లు జాసన్ కెన్నీ, లారా ట్రాట్ అద్వితీయ ప్రతిభతోనేకాదు.. ఒకరి కోసం ఒకరుగా నిలిచే జంటగానూ అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల సైక్లింగ్ టీం పర్స్యూట్, ఒమ్నియమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న ట్రాట్ రియోలోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేసి, బ్రిటిష్ అత్యుత్తమ క్రీడాకారిణిగా చరిత్ర పుటలోకి ఎక్కింది.

08/20/2016 - 22:08

మెగా ఈవెంట్స్‌లో, ప్రత్యేకంగా ఒలింపిక్స్‌లో స్విమ్మర్లు చాలా మంది రెండేసి క్యాప్‌లు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి ప్రత్యేక కారణం ఉందా అంటే ఉందనే సమాధానం వస్తున్నది. మొదట లేటెక్స్ క్యాప్‌ను పెట్టుకునే స్విమ్మర్లు దానిపైన సిలికాన్ క్యాప్‌ను ధరిస్తారు. నీటిలో కళ్లకు రక్షణగా పెట్టుకునే గాగుల్స్ హఠాత్తుగా కింద పడకుండా ఉండేందుకు రెండు క్యాప్స్‌ను స్విమ్మర్లు వాడుతున్నారు.

,
08/20/2016 - 22:05

* ఒలింపిక్స్ కోసం చేపట్టిన పలు నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయన్న విషయం మరోసారి స్పష్టమైంది. మడురెరా పార్క్‌లో ఏర్పాటు చేసిన ఒలింపిక్స్ రింగ్స్‌లో ఒకటి పాక్షికంగా విరిగింది. ఎవరో బలంగా కొట్టినందుకో లేక ఉద్దేశపూర్వకంగా పెకళించే ప్రయత్నం చేసినందుకో అది విరగలేదు. పార్క్‌లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఓ పిల్లవాడి చేయి తగిలి అది విరగడం విశేషం.

08/20/2016 - 22:02

* ఫిగర్ స్కేటింగ్, ఐస్ హాకీ ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడాంశాలు. కానీ, ఈ రెండు క్రీడలు మొదట సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అడుగుపెట్టాయి. 1908, 1920 ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఫిగర్ స్కేటింగ్ పోటీలు జరిగాయి. 1924లో ఈరెండు ఈవెంట్స్‌ను వింటర్ ఒలింపిక్స్ జాబితాలో చేర్చారు. ఐస్ హాకీ 1920లో మొదటిసారి సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అరంగేట్రం చేసింది.

08/20/2016 - 22:00

* ఏదైనా రేసులో పాల్గొని, ఎవరైనా తోయడంతో లేదా పొరపాటునో కిందపడి.. వెంటనే లేచి మళ్లీ పరుగులు పెట్టి విజేతగా నిలవడం కేవలం సినిమాలకే పరిమితం కాదని నిరూపించాడు బ్రిటిష్ స్టార్ అథ్లెట్ మో ఫరా. రియో ఒలింపిక్స్ పురుషుల 10,000 మీటర్ల పరుగులో పోటీపడిన అతను రేస్ సగం పూర్తయిన సమయంలో పట్టుతప్పి కింద పడ్డాడు. అయితే, వెంటనే కోలుకున్నాడు. పైకి లేచి రేస్‌ను కొనసాగించాడు.

08/13/2016 - 22:09

* మహిళల పట్ల వివక్ష రియో ఒలింపిక్స్‌లోనూ కనిపించింది. పురుషుల ఐదు మీటర్ల డైవింగ్ పోటీలు జరుగుతున్నప్పుడు నీలం రంగులో కళకళలాడిన స్విమ్మింగ్ పూల్‌లో నీరు కొన్ని గంటల్లోనే మురికిపట్టి, ఆకుపచ్చ రంగుకు చేరాయి. అయితే, నీళ్లను మార్చకుండా, మహిళల పోటీలను అక్కడి సిబ్బంది కొనసాగించారు. నీరు మురికిపట్టి ఉన్నాయని మహిళా డైవర్లు ఎంత మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.

08/13/2016 - 22:07

* న్యూజిలాండ్ మహిళా హాకీ జట్టులోని క్రీడాకారిణులు కొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో ఆడుతున్నప్పుడు వారు ముఖాలకు మాస్క్ తగిలించుకోవడం ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసింది.

08/13/2016 - 22:06

* అమెరికాలోని ఓక్లహామాకు చెందిన జేన్ కోప్‌లాండ్, క్రిస్టెన్ దంపతులు ఒలింపిక్స్‌ను చూడాలని ఉత్సాహపడ్డారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసి టికెట్లు సంపాదించారు. రెండు రోజులు ప్రయాణం చేసి రియో డి జెనీరో చేరుకున్నారు. పోటీలను తిలకించేందుకు ఉరుకులు పరుగుల మీద మెయిన్ స్టేడియానికి చేరుకున్నారు. కానీ, అక్కడ సిబ్బంది అడ్డుకోవడంతో అవాక్కయ్యారు. ఇంతకీ వారికి ఎవరో నకిలీ టికెట్లు అంటగట్టారట.

08/13/2016 - 22:05

ఒలింపిక్స్ కోసం రియో నగరం నుంచి సుమారు 77,000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ శాతం మంది తమతమ నివాసాలను వదలి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీనితో అధికారులు బలవంతంగా వారిని తరలించాల్సి వచ్చింది. కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే, నిరాశ్రయులైన వారు కూడా వారితో జతకట్టారు.

08/13/2016 - 22:03

రియో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ అధికారుల తీరు విచిత్రంగా ఉంది. ఎవరైతే మాకేంటి? అన్న రీతిలో వ్యవహరిస్తూ విమర్శలకు గురవుతున్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగితే, అందులో ఎనిమిదేళ్ల ‘సాంబా’ డాన్సర్ తవాన్ లుకాస్ డి ట్రిండేడ్ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించాడు. మ్యూజిక్ స్టార్ విల్సన్ డస్ నెవెస్ సైతం ఆ పిల్లవాడి సామర్థ్యాన్ని గుర్తించి, అతనితో కలిసి స్టెప్పులు వేశాడు.

Pages