S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/24/2016 - 23:52

జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత్ కైవసం చేసుకుంది. 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మన దేశానికి మళ్లీ ఈ టైటిల్ దక్కింది. హర్జీత్ సింగ్ నాయకత్వంలో భారత్ ఫైనల్‌లో బెల్జియంను 3-2 తేడాతో ఓడించింది.

12/24/2016 - 23:51

ఈఏడు అంతర్జాతీయ క్రీడా రంగాన్ని అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్, జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఏలితే, మన దేశానికి సంబంధించినంత వరకూ తెలుగు అమ్మాయి పివి సింధుదే అగ్రస్థానం. రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఈ హైదరాబాదీ లక్షలాది మందికి రోల్ మోడలైంది.

12/24/2016 - 23:49

రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తారని అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తుండగా, ఒక్కొక్కరే చేతులెతేస్తుంటే, పతకాల ఖాతాను తెరవకుండా దిగాలు పడిన భారత్‌ను సాక్షి మాలిక్ ఆదుకుంది. అప్పటి వరకూ అన్ని విభాగాల్లోనూ భారత అథ్లెట్లు నిరాశ పరిచారు. అయతే, మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్‌లో రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి దేశ పరువును నిలిపింది.

12/24/2016 - 23:48

ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పతకం సాధించడంలో విఫలైంది. ఎంత కష్టపడినా ఫలితం లేక, నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. అయతే, ఆమె పోరాట పటిమకు యావత్ దేశం నీరాజనాలు పలికింది. అత్యంత క్లిష్టమైన ‘ప్రొడునొవా’ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆమె వాల్ట్ విభాగంలో తృటిలో కాంస్యన్ని కోల్పోయిన వైనాన్ని కోట్లాది మంది భారతీయులు టీవీల్లో ఉత్కంఠతో చూశారు.

12/24/2016 - 23:48

ప్రపంచ కబడ్డీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ వరుసగా మూడోసారి గెల్చుకొని హ్యాట్రిక్ సాధించింది. మొత్తం మీద ఈ టైటిల్‌ను అందుకోవడం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. ఇరాన్‌తో జరిగిన ఫైనల్‌లో 38-29 తేడాతో విజయం సాధించి, అంతర్జాతీయ కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకుంది. సూపర్ టెన్‌ను సాధించిన అజయ్ ఠాకూర్ భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు.

12/24/2016 - 23:47

అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్త్న్రకు సింధు, సాక్షి, దీప ఎంపిక కావడం పట్ల ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, షూటర్ జీతూ పేరు ఈ జాబితాలో చేరడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రియో ఒలింపిక్స్‌లో సింధు, సాక్షి పతకాలను సాధించగా, దీప తుది వరకూ పోరాడింది. అందుకే ఈ ముగ్గురికీ ఖేల్ రత్న అవార్డును ముందుగా ఊహించిందే.

12/24/2016 - 23:46

భారత బృందం అట్టహాసంగా రియో డి జెనీరోకు బయలుదేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 118 మంది రియో వెళ్లారు. ఒలింపిక్స్‌కు ముందే డోపింగ్ సమస్య భారత క్రీడా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజింగ్‌లో కాంస్యం, లండన్‌లో రజత పతకాలను గెల్చుకున్న సుశీల్ కుమార్‌ను పక్కకునెట్టేసి, రియోలో పోటీపడే అవకాశాన్ని చేజిక్కించుకున్న నర్సింగ్ పంచమ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

12/24/2016 - 23:44

తనను తాను ‘ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్న ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ మృతితో క్రీడా ప్రపంచం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. టీనేజ్‌లోనే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించి, నల్ల జాతీయుల ఆశాకిరణంగా మారిన అలీ తన జీవిత కాలంలో ఎన్నడూ అమెరికా జాత్యాహంకారం ముందు తలవంచలేదు. యుద్ధ పిపాసను సమర్థించలేదు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకించి, నిషేధానికి గురైనా తన పట్టు వీడలేదు.

12/24/2016 - 23:41

టెన్నిస్‌లో ఈ ఏడాది సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్ తెరమరుగయ్యాడు. ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా వెనుకబడి, రెండో స్థానానికి పడిపోయాడు. ఆ స్థానాన్ని బ్రిటిష్ సూపర్ స్టార్ ఆండీ ముర్రే సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

12/18/2016 - 01:34

ఒకటిరెండు సిరీస్‌లు, రెండు మూడు ఈవెంట్స్‌ను మినహాయిస్తే, ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా సంబరాలకు తెరపడింది. ప్రపంచ క్రీడలకు గ్రహణం పట్టిందన్న వాస్తవాన్ని ఈ ఏడాది చోటుచేసుకున్న అనేకానేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రష్యా వ్యూహాత్మక డోపింగ్ యావత్ క్రీడా రంగాన్ని కుదిపేసింది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

Pages