S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

08/06/2016 - 22:14

బాస్కెట్‌బాల్ అధికారికంగా మొట్టమొదటిసారి 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో దర్శనమిచ్చింది. బంకమట్టి, ఇసుక కలిపి తయారు చేసిన అవుట్ డోర్ కోర్టులో మ్యాచ్‌లను ఆడించారు. మ్యాచ్‌లన్నీ సజావుగానే సాగినప్పటికీ, అమెరికా, కెనడా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మాత్రం నానా కంగాళీగా మారింది. భారీ వర్షం కురవడంతో కోర్టు మొత్తం బురదమయంకాగా, బంతిని టాస్ చేయడానికి ఆటగాళ్లు నానా తంటాలు పడ్డారు.

08/06/2016 - 22:13

ఫిగర్ స్కేటింగ్, ఐస్ హాకీ ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడాంశాలు. కానీ, ఈ రెండు క్రీడలు మొదట సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అడుగుపెట్టాయి. 1908, 1920 ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఫిగర్ స్కేటింగ్ పోటీలు జరిగాయి. 1924లో ఈరెండు ఈవెంట్స్‌ను వింటర్ ఒలింపిక్స్ జాబితాలో చేర్చారు. ఐస్ హాకీ 1920లో మొదటిసారి సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అరంగేట్రం చేసింది.

08/06/2016 - 22:11

ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనాలంటే ఎన్నో దశల్లో ప్రతిభ కనబరచాలి. కనీసం వైల్డ్‌కార్డ్ ఎంట్రీతోనైనా బరిలోకి దిగాలి. కానీ, ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్టు తెలియకుండానే పోటీకి దిగి, విజేతగా నిలిచింది మార్గరెట్ అబోట్. అమెరికాకు చెందిన మార్గరెట్ 1900 పారిస్ ఒలింపిక్స్ సమయంలో అక్కడే ఎడ్గర్ డెగాస్ అండ్ అగస్టే రాడిన్‌లో చదువుతున్నది.

08/06/2016 - 22:09

జపాన్ జిమ్నాస్ట్, ఒలింపిక్స్ డిఫెండింగ్ చాంపియన్ కొహె ఉచిమురాకు స్మార్ట్ ఫోన్‌లో ఇటీవల సంచలనం సృష్టిస్తున్న ఆట ‘పోకెమాన్’ షాకిచ్చింది. ఫోన్‌లో ఈ ఆట ఆడుతూ మైమరచిపోయిన ఉచిమురా తనకు వచ్చిన బిల్లు చూసి అవాక్కయ్యాడు. 5,00,000 ఎన్‌లు (సుమారు 5,000 డాలర్లు) ఫోన్ బిల్లుగా చెల్లించాల్సి రావడంతో లబోదిబోమన్నాడు.

08/06/2016 - 22:07

ఆధునిక ఒలింపిక్స్ 1896లో జరిగాయి. ఏథెన్స్‌లో జరిగిన ఈ పోటీల్లో తొలి పతకాన్ని అమెరికాకు చెందిన జేమ్స్ కానోలీ గెల్చుకున్నాడు. ట్రిపుల్ జంప్‌లో పోటీ పడేందుకు అతను హార్వర్డ్ యూనివర్శిటీలో కొనసాగుతున్న చదువును మానుకున్నాడు. అతని కృషి ఫలించింది. ఆధునిక ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని అందుకున్న అథ్లెట్‌గా అతని పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.

08/06/2016 - 22:05

రెండు కాళ్లు లేకపోయినా, కృత్రిమ కాళ్లతో ఒలింపిక్స్‌లో పరిగెత్తిన అథ్లెట్‌గా ఆస్కార్ పిస్టోరియస్ రికార్డు నెలకొల్పాడు. అయితే, అంగ వైకల్యం ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో పాల్గొనడమేకాదు.. పతకాలు సాధించిన ప్రతిభావంతుడు జార్జి ఇసర్. రైలు ప్రమాదంలో ఎడమకాలును కోల్పోయిన అతను 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడ్డాడు.

07/30/2016 - 22:51

రియో ఒలింపిక్స్‌కు నాలుగు ప్రధాన వేదికలను సిద్ధం చేశారు. బర్రాలో ఒలింపిక్ పార్క్‌ను నిర్మించారు. కోపకాబనా జోన్‌లో బీచ్ వాలీబాల్, ట్రయథ్లాన్, రోయింగ్, సెయిలింగ్ తదితర పోటీలు జరుగుతాయి. దేడొరో జోన్‌లో ఈక్వెస్ట్రియన్, షూటింగ్, రగ్బీ సెవెన్స్ ఈవెంట్స్ ఉంటాయి. అథ్లెటిక్స్‌ను మరకానా జోన్‌లో నిర్వహిస్తారు.

07/30/2016 - 22:38

క్రీడల్లో విపరీతమైన పోటీ, శత్రుత్వమే తప్ప మానవతా విలువలకు తావులేదని వాదించేవారికి మొరాకో అథ్లెట్ నావల్ ఎల్ వౌంటవకెల్ తగిన సమాధానమే చెప్పింది. 1984 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ మహిళల 400 మీటర్ల పరుగులో భారత ఆశా కిరణం, ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’ పిటి ఉష కడవరకూ పోరాడి, చివరికి నాలుగో స్థానంలో నిలిచిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

07/30/2016 - 22:35

* ఒలింపిక్స్‌లో మొదటి డోపింగ్ కేసు 1968లో నమోదైంది. స్వీడన్‌కు చెందిన షూటర్ హన్స్ గన్నర్ లిల్జెవాల్ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు రుజువు కావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. పిస్టల్ టీం ఈవెంట్‌లో అతను సభ్యుడిగా ఉన్న స్వీడిష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. అయితే, డోపింగ్ కేసు కారణంగా లిల్జెవాల్ సస్పెన్షన్‌కు గురికావడంతో ఆ పతకాన్ని నిర్వాహకులు వెనక్కు తీసుకున్నారు.

07/23/2016 - 23:08

1920 ఆంట్‌వెర్ప్ ఒలింపిక్స్‌లో 72 ఏళ్ల ఆస్కార్ స్వాన్ (స్వీడన్) పాల్గొన్నాడు. ఒలింపిక్స్‌కు హాజరైన అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా ఈ షూటర్ రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, గ్రీక్ జిన్నాస్ట్ డిమిట్రాయిస్ లాడ్రాస్ 1896 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు అతని వయసు కేవలం 10 సంవత్సరాల 218 రోజులే. ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడు అతనే.
సుదీర్ఘ ఒలింపిక్స్

Pages