S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

07/16/2016 - 22:38

క్రీడల్లో డోపింగ్ ఎంతోకాలంగా ఉన్నప్పటికీ, 1968 మెక్సికో సిటీ ఒలింపిక్స్‌లో తొలిసారి చర్యలు తీసుకున్నారు. స్వీడన్‌కు చెందిన పెంటథ్లాన్ అథ్లెట్ హాన్స్-గన్నర్ లిజెన్‌వాల్‌పై వేటు పడింది. పోటీకి ముందు అతను విపరీతంగా బీరు తాగాడట. ఫలితంగా అతను సమర్పించిన శాంపిల్స్‌లో ఆల్కహాల్ పరిమాణం ఎక్కువగా కనిపించింది. అప్పట్లో అథ్లెట్లు ఆల్కాహాల్ వినియోగించడాన్ని నిషేధించారు.

07/16/2016 - 22:32

రియో ఒలింపిక్స్‌లోనూ స్టార్ అట్రాక్షన్‌గా అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌నే పేర్కోవాలి. ఇప్పటికే అత్యధికంగా 18 స్వర్ణ పతకాలను సాధించిన అతను రియో ఎన్ని పతకాలు సాధిస్తాడన్నది అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నది. వాస్తవానికి లండన్ ఒలింపిక్స్‌ను ఫెల్ప్స్‌కే అంకితం ఇవ్వాలి. బీజింగ్ ఒలింపిక్స్‌లో సంచలన విజ యాలు సాధించిన ఫెల్ప్స్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు.

07/16/2016 - 22:17

ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే బృందంలో ఏ దేశమైనా ఎక్కువ సంఖ్యలో అథ్లెట్లను, సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో అధికారులను పంపుతుంది. కానీ, రియో ఒలింపిక్స్‌కు వెళ్లే పాకిస్తాన్ బృందంలో అథ్లెట్ల కంటే అధికారులే ఎక్కువ మంది ఉన్నారు. పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయిన నేపథ్యంలో, ఈసారి పాక్ తరఫున కేవలం ఏడుగురు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

,
07/09/2016 - 23:21

* వివిధ దేశాల నుంచి వచ్చే సుమారు 10,500 మంది అథ్లెట్లను రియోకు చేర్చడానికి ఏకంగా 21 జంబో జెట్ విమానాలు అవసరమవుతాయి. ఇన్ని విమానాలను నిలపాలంటే 21 ఫుట్‌బాల్ పిచ్‌లకు సరిపడినంత స్థలం కావాలి. అదే విధంగా ఒలింపిక్స్ కోసం 315 గుర్రాలు కావాలి. గేమ్స్‌ను సమర్థంగా నిర్వహించాలంటే 1,40,000 మంది సహకారం అవసరం. వీరిలో 90,000 మంది ఉద్యోగులుకాగా, 50,000 మంది వలంటీర్లు.

07/09/2016 - 21:43

రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున 61 ఏళ్ల డ్రెస్సేజ్ రైడర్ మేరీ హన్నా పోటీకి దిగనుంది. ఇప్పటి వరకూ నాలుగు ఒలింపిక్స్‌లో పాల్గొన్న హన్నా రికార్డు స్థాయిలో ఐదో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నది. ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఎక్కువ వయసుగల క్రీడాకారిణిగా రికార్డు సృష్టించనుంది. అంతేగాక, ఐదు ఒలింపిక్స్‌లో పాల్గొన్న మూడో ఆస్ట్రేలియా మహిళగా కూడా ఆమె పేరు రికార్డు పుస్తకాల్లో చేరుతుంది.

,
07/09/2016 - 21:40

రియో డి జెనీరో ఒకవైపు ఒలింపిక్స్‌కు సిద్ధమవుతుండగా, మరోవైపు అడుగడుగునా సమస్యలు చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. బ్రెజిల్ ఆర్థికంగా పతనావస్థలో ఉంది. వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు మెరుగైన సౌకర్యాల కోసం సమ్మెబాట పట్టారు. వివిధ శాఖలకు చెందిన కార్మికులు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. రియోలో పోలీసులు కూడా సమ్మెకు పూనుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పిస్తున్నారు.

07/09/2016 - 21:36

నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్‌కు, ఈసారి ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు మధ్య కాలంలో ‘బ్లేడ్ రన్నర్’ ఆస్కార్ పిస్టోరియస్ జీవితంలో ఎవరూ ఊహించని మార్పులు జరిగాయ. దివ్యాంగులకు మాత్రమే పరిమితమైన పారాలింపిక్స్‌లో ప్రతిభ చాటుకొని, 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో పోటీపడి అందరి దృష్టిని ఆకర్షించాడు. 400 మీటర్ల పరుగులో సెమీ ఫైనల్ వరకూ చేరాడు.

07/02/2016 - 22:05

ప్రపంచ క్రీడా రంగాన్ని కుదిపేసిన సంఘటనల్లో రష్యా వ్యూహాత్మక డోపింగ్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపై ఎనిమిదేళ్ల వేటు పడడం సంచలనాన్ని సృష్టిస్తే, రష్యా వ్యూహాత్మక డోపింగ్ అంశం ప్రకంపనలకు కారణమైంది.

07/02/2016 - 22:02

ప్రపంచ మాజీనంబర్ వన్ రోజర్ ఫెదరర్‌ది విలక్షణ శైలి. తనదైన ఆట తీరుతో అతను లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఫెదరర్ కొట్టిన ఒక ‘ట్రిక్ షాట్’ చాలా కాలంగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఒక కంపెనీ వ్యాపార ప్రకటనలో పాల్గొన్న ఫెదరర్ అద్భుతమైన సర్వీస్ చేశాడు. అతను కొట్టిన బంతి వేగంగా వెళ్లి, స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి తలపై పెట్టుకున్న క్యాన్‌కు తగిలింది. ఒకసారి కాదు..

07/02/2016 - 21:59

ఆటగాళ్లలో చాలా మందికి ఏదో ఒక అలావాటు లేదా నమ్మకం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుటివారికి హాస్యాస్పదంగా కనిపించే చాలా నమ్మకాలు ఎంతో మందిలో కనిపిస్తాయ. ప్రపంచ మాజీ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇందుకు అతీతుడేమీ కాదు. అతనికీ ఓ వింత నమ్మకం ఉంది. మ్యాచ్‌లు ఆడే ప్రతిసారీ అతను తన వాటర్ బాటిల్‌ను కుర్చీకి మధ్యగా ఉంచుతాడు.

Pages