S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

07/02/2016 - 21:59

అర్జెంటీనాలో సాకర్‌కు ఎంతో ఆదరణ. చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌తో ఆటలాడడం, జాతీయ జట్టుకు ఎంపిక కావాలని నిరంతరం శ్రమించడం అక్కడ ప్రతి ఒక్కరికీ అలవాటు. జాతీయ జట్టుకు మ్యాచ్‌లు ఆడడం చాలా గొప్ప. ఇక ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగితే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది. అందుకే, కేవలం ఒక్క నిమిషమైతేనేం...

07/02/2016 - 21:57

రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఐఒసి తీవ్రంగా స్పందించింది. రియో ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లుపై నిషేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) తీసుకున్న నిర్ణయానికే ఐఒసి ఓటు వేసింది. సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎసి)లో రష్యా అథ్లెట్లు కొందరు సవాలు చేసినప్పటికీ, సానుకూల స్పందన రావడం అనుమానంగానే ఉంది.

07/02/2016 - 21:57

ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి రోజురోజుకూ మాయమవుతున్నది. రష్యా ఒలింపిక్ ట్రయల్స్‌లో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రియో ఒలింపిక్స్‌లో పోటీపడే రెజ్లర్లను ఎంపిక చేయడానికి రష్యా రెజ్లింగ్ సమాఖ్య ట్రయల్స్‌ను నిర్వహించినప్పుడు 57 కిలోల విభాగంలో విక్టర్ లెబెడెన్, ఇస్మాయిల్ ముసుకయెవ్ పోటీపడ్డారు. అయితే, బౌట్ మధ్యలో ఇద్దరూ రెజ్లింగ్ పోటీని మరచిపోయి బాహాబాహీకి దిగారు.

07/02/2016 - 21:56

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ చేస్తున్న ప్ర యత్నాలకు గండి పడింది. కండరాల నొప్పి కారణంగా అతను జమైకా ఒలింపిక్ ట్ర యల్స్ నుంచి వైదొలిగాడు. దీనితో అతను బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాల వేట కొనసాగిం చ గలుగుతాడా? లేదా? అన్నది అనుమానంగా మారింది.

06/25/2016 - 22:27

సాకర్ చరిత్రలోనే అసాధారణ క్రీడాకారులుగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ప్రత్యర్థులు పీలే, డిగో మారడోనా ఒకే వేదికపై కలవడం అభిమానులకు కనువిందు చేసింది. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ఒక్కో జట్టులో ఐదుగురు సభ్యులు ఆడిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌ని తిలకించేందుకు పీలే, మారడోనా హాజరయ్యారు. ఒకరినినొకరు సాదరంగా ఆహ్వానించుకున్నారు.

06/25/2016 - 22:25

ఎంతకాలం ఎదురుచూస్తేనేం.. సమర్థుడికే టీమిండియా కోచ్ పగ్గాలు దక్కాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) చాలా కాలం తర్వాత సాధ్యమైనంత వరకూ పారదర్శకతను పాటించినట్టు కోచ్ ఎంపిక ప్రక్రియ స్పష్టం చేసింది. కుంబ్లేతో పోటీపడిన వాళ్లలో చాలా మంది అంతర్జాతీయ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులు అర్జించిన వారే ఉన్నారు. రేసులో అందరినీ ఓడించిన కుంబ్లే కోచ్ పదవిని దక్కించుకున్నాడంటే అతని ప్రతిభను ఊహించుకోవచ్చు.

06/25/2016 - 22:19

* భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ‘జుంబో’ అన్న పేరు అందరి నోళ్లలో నానేది. సహచరులు అనీల్ కుంబ్లేకు పెట్టిన ముద్దుపేరు అది. బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టేవిధంగా బౌలింగ్ చేస్తాడనేకాదు.. అతని పాదాలు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టే జుంబో అన్న పేరు స్థిరపడింది.

06/25/2016 - 22:17

మ్యాచ్ విన్నర్ల జాబితాలో కుంబ్లేకు రెండో స్థానం లభించిందని చాలా తక్కువ మందికి తెలుసు. సచిన్ తెండూల్కర్ అగ్రస్థానంలో నిలవగా, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మీడియం పేసర్ మాదిరి బౌలింగ్ చేసే కుంబ్లే బంతిని తన సమకాలీనులు ముత్తయ్య మురళీధరన్ లేదా షేన్ వార్న్ మాదిరి గొప్పగా టర్న్ చేసేవాడు కాదు. కానీ, పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా తెలివిగా బౌలింగ్ చేసేవాడు.

06/25/2016 - 22:16

అనీల్ కుంబ్లే 1999 ఆగస్టు 9న మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో ఆరంభమైన మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. మొదట్లోనే అతను సంచలనాలు సృష్టించి రికార్డు నెలకొల్పాడు. కేవలం పది మ్యాచ్‌ల్లోనే అతను 50 పరుగుల మైలురాయిని చేరి, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన భారత బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు.

,
06/25/2016 - 22:14

క్రికెట్ మ్యాచ్‌లో మొదట ఎవరు బ్యాటింగ్ చేస్తారు అన్నది టాస్ ద్వారా నిర్ధారిస్తారు. టాస్ గెలిచిన జట్టుకు బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సాకర్‌లో ఎవరు మొదటి కిక్ కొడతారన్నది తేల్చుకోవడానికి కూడా టాస్ వేస్తారు. టాస్ నెగ్గిన జట్టుకు మొదటి కిక్ అవకాశం దక్కుతుంది.

Pages