S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

06/19/2016 - 07:18

ఆర్మ్‌స్ట్రాంగ్‌పై వేటు పడిన తర్వాత మరెవరూ డోపింగ్‌కు పాల్పడరని నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి కూడా డోపింగ్ రహిత రేస్‌ను నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.

06/19/2016 - 07:14

* బ్రిటన్‌కు చెందిన బ్రాడ్లే విగిన్స్ 2012లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి బ్రిటిషర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు. అంతేగాకుండా అతను కెరీర్‌లో నాలుగో ఒలింపిక్ స్వర్ణాన్ని కూడా అతను అదే ఏడాది సొంతం చేసుకున్నాడు. లండన్‌లో టైమ్ ట్రయల్ విభాగంలో విగిన్స్ ఈ ఘనత సాధించాడు.

06/19/2016 - 07:11

* బిఎంఎక్స్ వంటి కొత్తకొత్త సైక్లింగ్ పోటీలు నేడు జోరుగా జరుగు తున్నాయ. వివిధ దేశాలు కూడా వివిధ పేర్లతో మారథాన్ సైక్లింగ్ పోటీ లను నిర్వహిస్తున్నాయ. అయతే టూర్ డి ఫ్రాన్స్‌ను పోలిన లేదా దానితో పోటీపడే సైక్లింగ్ రేస్ ఇప్పటి వరకూ రాలేదు.

06/19/2016 - 06:49

అమెరికా సైక్లిస్టు లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఏడు పర్యాయాలు టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. కానీ, నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన కారణంగా అతను పరువుతో పాటు టైటిళ్లను, రికార్డులను కోల్పోయాడు. డోపింగ్ విషయం బయటపడక ముందు అతను రియల్ హీరోగా వెలిగిపోయాడు.

06/19/2016 - 06:44

జయాపజయాల విషయం ఎలావున్నా ఇది సాదాసీదా సైక్లింగ్ రేస్ కాదు. పచ్చని పంటపొలాలు, పిల్లకాలువలు, ఎత్తయిన కొండల మీదుగా సాగే ఈ రేస్‌ను ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ రేస్‌లో కల్నల్ డు టర్మలెట్ అతి క్లిస్టమైన దశ. 1910లో తొలిసారి ఈ మార్గం మీదుగా రేస్‌ను కొనసాగించగా, అక్టోవ్ లాపెజ్ మొదటి విజేతగా నిలిచాడు. 1947 నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ఈ మార్గం మీదుగా రేస్ కొనసాగిస్తున్నది.

,
06/11/2016 - 21:56

వింబుల్డన్‌లో శే్వత జాతీయుల ఆధిపత్యానికి గండికొట్టిన తొలి క్రీడాకారిణి ఆల్థియా గిబ్సన్. 1957 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె డార్లెన్ హార్డ్‌పై 6-3, 6-2 తేడాతో విజయభేరి మోగించింది. వింబుల్డన్ టైటిల్ సాధించిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించింది. అంతకు ముందే ఆమె ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ఏంజెలా మోర్టిమెర్‌ను ఓడించి, తొలి గ్రాండ్ శ్లామ్‌ను సాధించింది.

,
06/11/2016 - 21:49

టెన్నిస్ ర్యాకెట్ చేతపట్టిన ప్రతి ఒక్కరికీ వింబుల్డన్ ఒక కల. ఈ టోర్నీ గురించి ఎన్నో కలలు కంటారు. ఎన్నో ఆశలు నింపుకొంటారు. అక్కడి టెన్నిస్ కోర్టుల్లో గడిపిన ప్రతి క్షణాన్ని మధుర స్మృతిగా కలకాలం మదిలో దాచుకుంటారు. అక్కడ క్వాలిఫయర్స్‌ను నెగ్గి మెయిన్‌డ్రా చేరుకుంటే చాలు టెన్నిస్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్నందుకు సార్థకత చేకూరిందని అనుకుంటారు. ఇక టైటిల్ గెలిస్తే జన్మధన్యమైందని మురిసిపోతారు.

06/11/2016 - 21:44

వింబుల్డన్ పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలకు ఇచ్చే వెండి ట్రోఫీలు మెరిసిపోతుంటాయి. మహిళలకు బహూకరించే పళ్లెం లాంటి ట్రోఫీని 1884లో తయారు చేశారు. దీనిని ‘వీనస్ రోజ్‌వాటర్ డిస్క్’గా పిలుస్తారు. ఈ ట్రోఫీ చుట్టుకొలత 18.75 అంగుళాలు లేదా 48 సెంటీ మీటర్లు. పురుషుల విభాగంలో చాంపియన్‌కు కప్‌ను బహూకరిస్తారు. దీని ఎత్తు 18.5 అంగుళాలు (47 సెంటీ మీటర్లు), చుట్టుకొలత 7.5 అంగుళాలు (19 సెంటీ మీటర్లు).

06/11/2016 - 21:43

నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన కారణంగా రెండేళ్ల సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాతో మ్యాచ్ ఆడాలంటే అందరూ భయపడతారు. ఆమె అద్భుతంగా ఆడుతుందనికాదు.. ఆమె అరుపులను భరించడం చేతగాక. ఒకప్పుడు మోనికా సెలెస్ పెద్దగా అరిస్తే, ఆమె స్థానాన్ని షరపోవా భర్తీ చేసింది. 2009 వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్నప్పుడు ఆమె ఒకసారి అరుపు 105 డిసిబుల్స్‌కు చేరింది.

06/11/2016 - 21:41

జర్మనీ ఆటగాడు బోరిస్ బెకర్ 1985లో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆ ఒక్క విజయంతోనే అతను ఒకేసారి మూడు రికార్డులు సృష్టించాడు. 17 సంవత్సరాల 227 ఏళ్ల వయసులో అతను కెవిన్ కూర్టెన్‌ను ఫైనల్‌లో 6-3, 6-7, 7-6, 6-4 తేడాతో ఓడించి, వింబుల్డన్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

Pages