S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/06/2015 - 07:31

టెస్టు క్రికెట్‌కు మరో గ్రహణం పట్టింది. ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్‌కు నిర్వచనం చెప్పేలా ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ ఇప్పుడు కొత్త ఒరవడిలో కొట్టుకుపోతున్నది. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌లపై ఐదు రోజుల జరగాల్సిన మ్యాచ్‌లకు మూడు రోజులు కూడా పూర్తికాకుండానే తెరపడుతున్నది. తమతమ ఆటగాళ్లకు అనువునా, వారికి సహకరించే రీతిలో పిచ్‌లను తయారు చేసుకోవడం కొత్త కాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయమే.

12/06/2015 - 07:30

సఫారీలకు చుక్కలు చూపిస్తున్న స్పిన్నర్

11/28/2015 - 23:55

చారిత్రక ప్రాధాన్యం ఉన్న క్రీడల్లో మల్ల యుద్ధం ఒకటి. రెజ్లింగ్‌గా నేడు అంతర్జాతీయ క్రీడగా వెలుగుతున్నప్పటికీ, దీని మూలాలు పలు దేశాల ఇతిహాసాల్లో కనిపిస్తాయ. మల్ల యుద్ధానికి మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది.
==============

11/28/2015 - 23:54

ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్‌లో పాల్గొన్న తొలి భారతీయుడు ‘ది గ్రేట్’ ఖలీ ఆధ్వర్యంలో కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైనె్మంట్ (సిడబ్ల్యుఇ) ఆరంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫైట్స్‌ను ఉత్తరాఖండ్‌లో నిర్వహించేందుకు ఖలీ సన్నాహాలు చేస్తున్నాడు. రెజ్లింగ్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు జరిగిన ప్రయత్నమే ఎంటర్‌టైనె్మంట్ రెజ్లింగ్.

11/28/2015 - 23:56

భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్‌ను కళాత్మక ఆటకు ప్రతీకగా పేర్కొంటారు. అయితే, వనే్డల్లో అతని ఆట ఏమాత్రం సరిపోదన్న విమర్శలున్నాయి. మొదటి వరల్డ్ కప్‌లో అతని జిడ్డు బ్యాటింగ్ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 ఓవర్లలో 335 పరుగులు సాధించాల్సి ఉండగా, ఓపెనర్‌గా వచ్చిన గవాస్కర్ జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను నీరుగార్చాడు.

11/28/2015 - 23:52

స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి, జైలు శిక్షను కూడా అనుభవించిన పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అమీర్ ఒక వివాదాస్పద టోర్నీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో రెండేళ్ల క్రితం చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.

11/28/2015 - 23:51

పారిస్‌లోని సెయింట్ డెనిస్ శివార్లలోని స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం బయట బాంబులు పేలినా, స్టేడియంలోపల ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది. ప్రపంచ చాంపియన్ జర్మనీని ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో ఓడించింది. మ్యాచ్ ప్రథమార్ధంలో స్టేడియం వెలుపల బాంబులు పేలిన శబ్దం వినిపించినప్పటికీ, చాలా మంది దానిని బాణాసంచా శబ్దంగా భ్రమించారు.

11/22/2015 - 05:07

ఫిట్నెస్ శిక్షణ నేడు ఒక పరిశ్రమగా మారింది. ఈ వర్గాలు వెయిట్‌లిఫ్టింగ్‌ను ఒక క్రీడగా అంగీకరించడం లేదు. బాడీబిల్డింగ్‌లో భాగంగానే వెయిట్‌లిఫ్టింగ్‌ను పరిగణిస్తున్నాయి. కొద్దిపాటి మార్పులు, ప్రత్యేక విభాగాలను పక్కకుపెడితే, వెయిట్‌లిఫ్టింగ్ సాధారణ ఫిట్నెస్ కోసం చేసే రొటీన్‌లో భాగమని ఈ వర్గాల వాదన.

11/22/2015 - 05:08

వెయట్‌లిఫ్టింగ్ చేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాయపడడం, ఒక్కోసారి వికలాంగులుగా మారడం ఖాయం. ఒలింపిక్స్ వంటి మెగా ఈ వెంట్స్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయంటే, సాధారణ పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నిపుణుల పర్యవేక్షణలో సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలు అందుకున్న లిఫ్టర్లకు సమస్యలు తప్పనప్పుడు అలాంటి సదుపాయాలు ఏవీ లేనివారి పరిస్థితిని ఊహించడం కష్టం కాదు.

11/22/2015 - 05:05

లాస్ వెగాస్, అక్టోబర్ 28: ఓటమి ఎరుగని ప్రపంచ మేటి బాక్సర్ ఫ్లోయిడ్ మేవెదర్ జూనియర్‌కు బాక్సింగ్ మాత్రమేకాదు.. కార్లన్నా పిచ్చే. ఎప్పుడు మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చినా కొనేస్తాడు. తాజాగా 3.5 మిలియన్ డాలర్లు వెచ్చించి బగాటీ వేరన్ గ్రాండ్ స్పోర్ట విటెస్ కారును కొన్నాడు. ఈ మోడల్ కార్లు కేవలం 44 మాత్రమే ఉత్పత్తికాగా, వాటిలో ఒకదానిని మేవెదర్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ కారుకు చాలా ప్రత్యేకతలున్నాయి.

Pages