S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/16/2016 - 23:26

వికెట్‌కీపింగ్‌లోనే కాదు... బ్యాటింగ్‌లోనూ ప్రతిభావంతుడిగా ఫరూఖ్ ఇంజనీర్‌కు మంచి పేరు ఉంది. లాంకషైర్‌కు ప్రాతినిథ్యం వహించిన అతను 164 మ్యాచ్‌లు (249 ఇన్నింగ్స్) ఆడి 5,549 పరుగులు సాధించాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు. రెండో స్థానాన్ని రవి శాస్ర్తీ ఆక్రమించడం విశేషం. అతను 60 మ్యాచ్‌లు (95 ఇన్నింగ్స్)లో 3,296 పరుగులు చేశాడు.

04/16/2016 - 23:24

ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ చాంపియన్‌షిప్ ఎనిమిది జట్లతో మొదలైంది. 1890లో గ్లూసెస్టర్‌షైర్, కెంట్, లాంకషైర్, మిడిల్‌సెక్స్, నాటింహామ్, సర్రే, ససెక్స్, యార్క్‌షైర్ జట్లు టోర్నీలో అడుగుపెట్టాయి. సోమర్‌సెట్ 1891లో, వార్విక్‌షైర్, లీసెస్టర్‌షైర్, హాంప్స్‌షైర్, డెర్బీషైర్ 1895లో అడుగుపెట్టాయి.

04/09/2016 - 23:31

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విందు క్రికెట్ అభిమానులను ఊరిస్తున్నది. టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ సృష్టించిన హోరు ఇంకా కొనసాగుతుండగానే ఐపిఎల్ మొదలైంది. నిన్న మొదలైన ఈ టోర్నీలో ఆడే పలువురు స్టార్ల ప్రదర్శన ఏ విధంగా ఉండబోతున్నదోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. కొంత మంది ఆటగాళ్లకు ఇప్పటికే స్టార్ ఫాలోయింగ్ ఉంది.

04/09/2016 - 23:20

ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక సూపర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపిఎల్‌లో ఉత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతను 98 మ్యాచ్‌ల్లో 143 వికెట్లు కూల్చాడు. అమిత్ మిశ్రా 98 మ్యాచ్‌ల్లో 111, హర్భజన్ సింగ్ 111 మ్యాచ్‌ల్లో 110 చొప్పున వికెట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పీయూష్ చావ్లా 111 మ్యాచ్‌ల్లో 109, డ్వెయిన్ బ్రేవో 91 మ్యాచ్‌ల్లో 105 చొప్పున వికెట్లు పడగొట్టారు.

04/09/2016 - 23:18

ఐపిఎల్‌లో అత్యుత్తమ వికెట్‌కీపర్‌గా దినేష్ కార్తీక్ రికార్డు నెలకొల్పాడు. అతను 84 మ్యాచ్‌ల్లో84 మందిని అవుట్ చేశాడు. వీటిలో 61 క్యాచ్‌లుకాగా, 23 స్టంపింగ్స్ ఉన్నాయి.

04/09/2016 - 23:16

ఐపిఎల్‌లో టాప్ స్కోరర్ల జాబితాలో సురేష్ రైనా అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 128 ఇన్నింగ్స్ ఆడిన అతను 3,699 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 124 ఇన్నింగ్స్‌లో 3,385, క్రిస్ గేల్ 81 ఇన్నింగ్స్‌లో
3,199 చొప్పున పరుగులు చేసి, ఈ జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 115 ఇన్నింగ్స్‌లో 3,137, గౌతం గంభీర్ 116 ఇన్నింగ్స్‌లో 3,133 చొప్పున పరుగులు చేశారు.

04/09/2016 - 23:14

అమిత్ మిశ్రా ఐపిఎల్‌లో మూడు పర్యాయాలు హ్యాట్రిక్ సాధించి తిరుగులేని బౌలర్‌గా గుర్తింపు సంపాదించాడు. 2008లో డక్కన్ చార్జర్స్‌పై, 2011లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై, 2013లో పుణె వారియర్స్‌పై అతను హ్యాట్రిక్స్ నమోదు చేశాడు. యువరాజ్ సింగ్ ఖాతాలో రెండు హ్యాట్రిక్స్ ఉన్నాయి. ఈ రెండూ ఒకే ఏడాది నమోదు కావడం విశేషం.

04/09/2016 - 23:13

గత ఏడాది హాట్ ఫేవరిట్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించిన ముంబయి ఇండియన్స్ టైటిల్ కైవసం చేసుకుంది. చారిత్రక కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మే 24న జరిగిన ఫైనల్‌లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది.

04/09/2016 - 23:10

ఒక ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పాడు. పుణె వారియర్స్‌తో 2013లో జరిగిన మ్యాచ్‌లో అతను 66 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు. బ్రెండన్ మెక్‌కలమ్ 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత ఏడాది ఎబి డివిలియర్స్ 59 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

04/09/2016 - 23:06

మొట్టమొదటి ఐపిఎల్ ఫైనల్ చివరి క్షణం వరకూ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. 2008 జూన్ ఒకటో తేదీన జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీ కొన్నాయి. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు సాధించింది. పార్థీవ్ పటేల్ 38, సురేష్ రైనా 43, మహేంద్ర సింగ్ ధోనీ 29 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, రాజస్థాన్ బౌలర్ యూసుఫ్ పఠాన్ 22 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.

Pages