S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

03/25/2017 - 22:59

* ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మను ఉదారుడిగా పేర్కోవాలి. సన్‌రైజర్స్ హైదాబాద్ తరఫున 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లు బౌల్ చేసి 66 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు. అదే ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు ఉమేష్ యాదవ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నాలుగు ఓవర్లు వేసి, వికెట్ సాధించకుండా 65 పరుగులు సమర్పించుకున్నాడు.

03/25/2017 - 22:57

* ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కొంత మంది బౌలర్లు కూడా ఈ టోర్నీపై తమదైన ముద్ర వేశారు. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ (ముంబయి ఇండియన్స్) 98 ఇన్నింగ్స్‌లో 143 వికెట్లు పడగొట్టి, మేటి బౌలర్ల జాబితాలో నంబర్ వన్‌గా నిలిచాడు. అమిత్ మిశ్రా 112 ఇన్నింగ్స్‌లో 124, డ్వేయిన్ బ్రేవో 103 ఇన్నింగ్స్‌లో 122 చొప్పున వికెట్లు కూల్చారు.

03/25/2017 - 22:55

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ 2013లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఐపిఎల్‌లో రికార్డుగా నమోదైంది. పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 66 బంతుల్లోనే అజేయంగా 175 పరుగులు సాధించాడు.

03/19/2017 - 06:45

భయపడుతున్న పోటీదారులు బిడ్స్‌కు దక్కని ప్రజాదరణ

03/19/2017 - 06:42

భారత జట్టుకు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో అత్యల్ప స్కోరు 54 పరుగులు. 2000 అక్టోబర్ 29న శ్రీలంకతో జరిగిన షార్జా కప్ ఫైనల్‌లో టీమిండియా కుప్పకూలిన వైనమిది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు సాధించింది. సనత్ జయసూర్య 161 బంతుల్లో, 21 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 189 పరుగులు సాధించాడు. రసెల్ ఆర్నాల్డ్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

03/19/2017 - 06:41

ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటైన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, అసలు బంతిని ఆడకుండానే డకౌట్ కావడం చాలా అరుదు. దీనిని ‘డైమండ్ డక్’ అంటారు. క్రికెట్ చరిత్రలో తొలి ‘డైమండ్ డక్’ కెనడా ఆటగాడు హెన్రీ ఒసినే్డ పేరుమీద ఉంది. అలెక్స్ కూసక్ వేసిన వైడ్ బంతిని ఆడేందుకు క్రీజ్ నుంచి ముందుకు దూకుకెళ్లిన అతను షాట్ కొట్టలేక, వికెట్ కీపర్ స్టంప్ చేయడంతో అవుటయ్యాడు.

03/19/2017 - 06:39

* స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో బ్రెజిల్ పోల్‌వాల్టర్ థియాగో బ్రాజ్ డ సిల్వ ఉత్సాహంగా బరిలోకి దిగాడు. ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఫైనల్ చేరాడు. అక్కడ కూడా అందరి కంటే ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అభిమానులు జేజేలు పలుకుతారనుకున్న అతను వారి వైఖరితో ఒక్కసారిగా నీరుగారిపోయాడు.

03/19/2017 - 06:36

పర్యావరణ పరిరక్షణతోపాటు, ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యర్ధాలను తిరిగి ఉపయోగించే అవకాశాలపై అవగాహన పెంచడానికి వీలుగా 2020 ఒలింపిక్స్‌లో పతకాలను ఆ వ్యర్ధాలతోనే తయారు చేయాలని నిర్వాహణ కమిటీ తీర్మానించింది. పాడైన సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ చేసి పతకాలు తయారు చేస్తామని తెలిపింది.

03/19/2017 - 06:34

మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో కనీసం 50 పతకాలను సాధించే దిశగా నీతి ఆయోగ్ చర్యలు తీసుకుంటోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 13 క్రీడాంశాల్లో పోటీపడేందుకు 83 మందిని పంపింది. ఆరు పతకాలను సాధించింది.

03/19/2017 - 06:33

కెరీర్‌లో వందకుపైగా (136) టెస్టులు ఆడినప్పటికీ, ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన ఏకైక ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్. హైదరాబాద్‌కు చెందిన ఈ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ 86 వనే్డ ఇంటర్నేషనల్స్ కూడా ఆడాడు. కానీ, అతనికి ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. భారత సెలక్టర్లు తీసుకునే విచిత్ర నిర్ణయాలకు ఇదో నిదర్శనం.

Pages