S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

03/19/2016 - 21:22

* క్రికెట్ బంతులు సరిగ్గా రెండు అర్ధ భాగాలను కలిపి తయారు చేస్తారన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. కానీ, అది నిజం కాదు. 224 మిల్లీ మీటర్లు, 229 మిల్లీ మీటర్లు ఉండే రెండు అర్ధ భాగాలను కలిపి బంతులను కుడతారు. మరీ సూక్ష్మంగా పరిశీలిస్తే తప్ప ఈ తేడా కనిపించదు. ఒక్కో బంతి బరువు 155.9 నుంచి 163 గ్రాముల వరకు ఉంటుంది.

03/13/2016 - 02:38

వనే్డ ఇంటర్నేషనల్ కెరీర్‌తొలి, చివరి మ్యాచ్‌ల్లో శతకాలను నమోదు చేసిన బ్యాట్స్‌మన్ డెనిస్ అమిస్. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మన్ 1972లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వనే్డ కెరీర్‌ను ఆరంభించాడు. ఆ మ్యాచ్‌లో 103 పరుగులు సాధించాడు.

03/13/2016 - 02:36

కాప్రియాటి

03/13/2016 - 02:35

మరియా షరపోవా.. ప్రతిభకు అందాన్ని జోడించి.. టెన్నిస్‌కు గ్లామర్ సొబగులు అద్దిన క్రీడాకారిణి. ఆరేళ్ల వయసులోనే టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుంది. పదకొండు ఏళ్లకే అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టింది. 17 ఏళ్ల యవసులోనే అత్యంత ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేవలం ఆటను చూడడానికేకాదు... అందం కూడా తోడైతే ఆ మ్యాచ్‌లను చూసేందుకు

03/13/2016 - 02:34

ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నిర్వాకానికి, కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల నిర్లక్ష్యం తోడుకావడంతో చాలా మంది క్రీడాకారుల కెరీర్‌కు తెరపడుతున్నది. ఇందుకు తాజా ఉదాహరణగా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా డోపింగ్ ఉదంతాన్ని పేర్కోవాలి.

03/05/2016 - 22:53

టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తున్నది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీ 2007లో ఆరంభమైంది. మ్యాచ్ మొత్తంలో అత్యధికంగా 40 ఓవర్లు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఫలితం అప్పటికప్పుడే తేలిపోతుంది. తక్కువ సమయంలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించడానికి బ్యాట్స్‌మెన్ వీరవిహారం చేస్తారు. ఒకప్పుడు విశ్రాంతి దినంతో కలిపి ఆరు రోజులు..

03/05/2016 - 22:44

ఆల్‌రౌండర్ల జాబితాలో పాకిస్తాన్ ప్రస్తుత కెప్టెన్ షహీద్ అఫ్రిదీ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను 456 పరుగులు సాధించి, 35 వికెట్లు పడగొట్టాడు. 2009 టి-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అతను అసాధారణ ప్రతిభతో జట్టును గెలిపించాడు. లండన్‌లో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొన్న పాకిస్తాన్ 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది.

02/27/2016 - 22:31

ఫిఫా కొత్త అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. తాజా ఎన్నికల్లో చివరి వరకూ అందరి కంటే ముందున్న షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫాను ఎన్నికల్లో అనూహ్యంగా ఓడించిన ఇన్ఫాంటినో మొత్తం 115 ఓట్లు సంపాదించాడు. ఇబ్రహీం అల్ ఖలీఫాకు 88 ఓట్లు లభించాయి. ఫ్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌కు నాలుగు ఓట్లు దక్కగా, జెరోమ్స్ చాంపేంజ్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు.

02/27/2016 - 22:28

ఫిఫా అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే బ్లాటర్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. గత ఏడాది మే 29న జరిగిన 65వ ఫిఫా మహాసభలో బ్లాటర్‌కు 133 ఓట్లు లభించాయి. అతనితో పోటీపడిన ప్రిన్స్ అల్ బిన్ అల్ హుస్సేన్‌కు 73 ఓట్లే వచ్చాయి.

02/27/2016 - 22:25

బ్రెజిల్‌లో ఒలింపిక్స్ సంవత్సరం సంబరాలకు ‘జికా’ వైరస్ అడ్డుకట్ట వేస్తున్నది. రియో డి జెనీరోలోని క్రీడాభిమానులు సంబరాలు జరుపుకోవడానికి కూడా వెనుకాడుతున్నారు. చిన్న పిల్లల్లో మెదడు పెరగకుండా అడ్డుకొని, కొన్ని సందర్భాల్లో వారి మృతికి కారణమవుతున్న జికా వైరస్‌ను ‘ఎడెస్ ఈజిప్టీ’ జాతికి చెందిన దోమలు వ్యాప్తి చేస్తున్నట్టు వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

Pages