S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

02/27/2016 - 22:25

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి సమస్యలు కొత్తకాదు. ఉగ్రవాదుల నుంచి పొంచివున్న ముప్పు మొదలుకొని క్రికెటర్ల అనైక్యత వరకూ అడుగడుగునా పిసిబి సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడుతునే ఉంది. ఇప్పుడు తాజాగా తమ దేశంలో తయారైన ‘కూకబురా’ బంతుల కారణంగా కొత్త సమస్య తలెత్తింది. స్వదేశంలో తయారైన బంతులను వాడితే ఖర్చు తగ్గుతుంది. పైగా అత్యంత విలువైన విదేశీ మారకాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

02/27/2016 - 22:23

జ్యూరిచ్‌లో ఫిఫా ఇటీవలే మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దీనికి 100 మిలియన్ పౌండ్ల ఖర్చు చేశారు. ఇందులో 80 మిలియన్ పౌండ్లు లీజ్ కోసం, మిగతా 20 మిలియన్ డాలర్లు వివిధ జ్ఞాపికలు, ప్రదర్శనకు ఉంచే ఇతర వస్తువుల సేకరణకు ఖర్చు చేశారు. ఇంత భారీ ఖర్చుతో సిద్ధమైన మ్యూజియంలో బ్లాటర్‌కు సముచిత స్థానం దక్కలేదు. 17 సంవత్సరాలు ఫిఫా అధ్యక్షుడిగా పని చేసిన అతని ఫొటో, ఇతర అధ్యక్షుల ఫొటోలతోపాటు కనిపిస్తున్నది.

02/27/2016 - 22:19

ఫిఫా బట్జెట్ సామాన్యమైనది కాదు. 33,137 మిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ఒక చిన్న దేశ వార్షిక బడ్జెట్‌ను తలపిస్తుంది. 30,799 మిలియన్ డాలర్లు (సుమారు 2,66,937 కోట్ల రూపాయలు) యూత్ ఫుట్‌బాల్ కోసం వెచ్చిస్తున్నది. 2,225 మిలియన్ డాలర్లు పురుషుల విభాగంలో, 112.5 మిలియన్ డాలర్లను మహిళల విభాగంలో వౌలిక సదుపాయాలకు, పోటీలు, టోర్నీలకు వెచ్చిస్తున్నది.

02/21/2016 - 01:02

ఒకవైపు ఒలింపిక్స్ సమీపిస్తున్నాయ. మరోవైపు రష్యా అథ్లెట్లు ఆ మెగా ఈవెంట్‌లో పాల్గొనే విషయంపై అనుమానాలు తలెత్తుతున్నాయ. వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన రష్యాను ఒలింపిక్స్ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా కెన్యా కూడా ఇలాంటి ప్రమాదానే్న ఎదుర్కొంటున్నది. ఒలింపిక్స్‌లో కెన్యా అథ్లెట్లకు అవకాశం లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

02/21/2016 - 00:51

ప్రపంచ మేటి బౌలర్లలో ఒకడైన డేల్ స్టెయిన్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను భయపెడతాడు. కానీ, అతనే భయపడిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. స్టెయిన్ భయపడింది ఒక బౌలర్‌ని లేదా బ్యాట్స్‌మన్‌ను చూసికాదు.. అత్యంత ప్రమాదకరమైన పామును చూసి. తన స్నేహితుడితో కలిసి వాహనంలో వెళుతున్నప్పుడు రోడ్డుపై పడివున్న ఒక పామును చూసిన స్టెయిన్ దానిని కాపాడేందుకు కిందకు దిగాడు.

02/21/2016 - 00:48

ఈ సీజన్‌లో ఫార్ములా వన్ 21 రేస్‌లతో కొనసాగుతుంది. సాధారణంగా ప్రతి సీజన్‌లోనూ 20 రేసులు ఉంటాయి. అయితే కొత్తగా అజర్‌బైజాన్ రాజధాని బకూ రేస్ ట్రాక్ ఈ జాబితాలో చేరింది. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్‌ఐఎ) ప్రకటించిన షెడ్యూల్‌ను అనుసరించి ఈ ఏడాది మార్చి 20న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీతో మొదలయ్యే 2016 సీజన్ నవంబర్ 27న అబూదబీ రేస్‌తో ముగుస్తుంది.

02/20/2016 - 22:40

ఆసియా కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు బిడ్ వేయాలని చైనా
నిర్ణయించింది. 2023లో జరిగే పోటీలకు ఆతిథ్యమిచ్చే హక్కులను

02/20/2016 - 22:39

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని మరింత

02/13/2016 - 22:17

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కేవలం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కే కాదు.. ఆటగాళ్లకు కూడా బంగారు బాతుగా మారింది. ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చి పడుతున్న భారీ మొత్తాలకు క్రికెటర్లు గులాములవుతున్నారు. నిన్నమొన్న క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వారి నుంచి ఎప్పుడో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి దాదాపుగా కనుమరుగైన వెటరన్స్ వరకూ అందరూ ఐపిఎల్ వెంట పడడానికి ప్రధాన కారణం డబ్బే.

02/13/2016 - 22:12

* అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా ఐపిఎల్ వేలంలో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు 52 మంది ఉన్నారు. వీరిలో 51 మంది భారత క్రికెటర్లే. విదేశీ క్రికెటర్ ఒకే ఒక్కడున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ హాండ్స్‌కోమ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన ఆడం జంపా కూడా అతని సరసన స్థానం సంపాదించేవాడే.

Pages