S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/30/2016 - 21:53

బిగ్ బాష్ టోర్నమెంట్‌లో ఆడుతూ వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ 12 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించి, గతంలో యువరాజ్ సింగ్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. టి-20 ఫార్మెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీలు సాధించిన వీరిద్దరూ సరిగ్గా 12 బంతులు ఎదుర్కొన్నారు. యువీ 0, 4, 1, 4, 4, 1, 6, 6, 6, 6, 6, 6 చొప్పున పరుగులు చేస్తే గేల్ 2, 0, 6, 6, 6, 6, 2, 6, 6, 4, 1, 6 పరుగులతో అర్ధ శతకం మైలురాయిని చేరాడు.

01/30/2016 - 21:52

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వనే్డలో భారత ఆటగాడు రోహిత్ శర్మ 99 పరుగులు చేసి, కేవలం ఒక పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకోవడం అభిమానులను నిరాశ పరచింది. వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఒక ఆటగాడు 99 పరుగుల స్కోరువద్ద అవుట్ కావడం ఇది 30వ సారి. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ మూడు సార్లు, శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య రెండు పర్యాయాలు 99 పరుగులకు అవుటై వెనుదిరిగారు.

01/23/2016 - 21:22

* జర్మనీకి చెందిన రాబర్ట్ హోజర్‌ను ఫిక్సింగ్ రిఫరీగా పేర్కోవాలి. తాను రిఫరీగా ఉన్న దాదాపు అన్ని మ్యాచ్‌లను అతను ఫిక్స్ చేశాడు. 2005లో జర్మనీ అధికారులు అరెస్టు చేసి, విచారణ చేపట్టగా అతను చెప్పిన వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. జర్మనీలో బుక్‌మేకర్ల నుంచి క్రొయేషియాలోని అండర్ వరల్డ్ మాఫియా వరకూ చాలా మందితో తనకు సంబంధాలున్నాయని హోజర్ అంగీకరించాడు.

01/23/2016 - 21:21

ఏడాది మొట్టమొదటి గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభమైన రోజే టెన్నిస్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయని బిబిసి, బజ్‌ఫీడ్ న్యూస్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కోవడం సంచలనం రేపింది. గత దశాబ్దకాలంలో ‘టాప్-50’ ర్యాంకింగ్స్‌లో ఉన్న 16 మంది క్రీడాకారులు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.

01/23/2016 - 21:20

క్రీడా రంగాన్ని ఫిక్సింగ్ మహమ్మారి క్రమంగా కబళిస్తోంది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం క్రికెట్ రంగంలో ప్రకంపనలు సృష్టించిన ఈ సమస్య, ఇప్పుడు ఇతర క్రీడలకూ పాకుతోంది. బాక్సింగ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య అంగీకరించడం విశేషం.

01/23/2016 - 21:19

స్పాట్ ఫిక్సింగ్ మాయ భారత క్రికెట్‌నేగాక, యావత్ ప్రపంచ క్రికెట్ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయ.

01/23/2016 - 21:19

‘బ్లాక్ సాక్స్ కుంభకోణం’ అమెరికా బేస్‌బాల్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. 1919 బేస్‌బాల్ వరల్డ్ సిరీస్ ఫైనల్‌లో సిన్సినాటి రెడ్స్‌ను ఢీకొన్న చికాగో వైట్ సాక్స్ జట్టు ఓటమిపాలైంది. ఇందులో వింతలేకపోయినప్పటికీ, జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు పరస్పరం కలహించుకొని, సిన్సినాటి రెడ్స్ టైటిల్ సాధించేందుకు సహకరించారు. చికాగో వైట్ సాక్స్ యాజమాన్యంతోనూ వీరికి పడేదికాదు.

01/23/2016 - 21:17

ఇటీవల కాలంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు పెరిగాయి. పందేలు కాసేవారి సంఖ్య ఎక్కువ కావడంతో, వారి బలహీనతను సొమ్ము చేసుకోవడానికి బుకీలు తెరపైకి వచ్చారు. ఒక బలమైన జట్టుతో అనామక జట్టు లేదా ఒక స్టార్ ఆటగాడితో ఒక సాధారణ క్రీడాకారుడు పోటీపడుతున్నప్పుడు సహజంగానే పేరున్న వారివైపే పందెంరాయుళ్లు మొగ్గుచూపుతారు. భారీ మొత్తంలో సొమ్మును ఒడ్డుతారు. బలహీనమైన జట్టు లేదా ఊరూపేరులేని ఆటగాడిపై ఎవరూ పందెం కట్టరు.

01/17/2016 - 03:11

ప్రస్తుతం భారత క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అరుదైన రికార్డును నెలకొల్పి సంచలనం సృష్టించింది. 1997లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకునే సమయానికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఈ టోర్నీ సింగిల్స్ విజేతల్లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు.

01/17/2016 - 00:36

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మక్కువ ఉంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లను తిలకించడానికి ప్రేక్షకులు పొటెత్తుతారు. ఎండ తీవ్రత లేకపోతే ఆస్ట్రేలియా ఓపెన్ మరింత ఆసక్తికరంగా ఉండేది. కానీ, ఈ టోర్నీ జరిగే సమయంలో అక్కడ ఎండలు మండిపోతుంటాయ. అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్ చాలా మంది మేటి క్రీడాకారులను కూడా భయపెడుతున్నది. టోర్నీకి వేదికైన మెల్బోర్న్‌లో వేడిని భరించడం సామాన్యమైన విషయం కాదు.

Pages