S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/03/2016 - 07:44

రవి శాస్ర్తీ స్పిన్ మాయాజాలం ఏమిటో ఆస్ట్రేలియాకు బాగా అర్థమైన మ్యాచ్ 1991 డిసెంబర్ 8న పెర్త్‌లో జరిగింది. ఫాస్ట్ బౌలింగ్‌కు బాగా అనుకూలించే పిచ్‌పై ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. అయితే, కృష్ణమాచారి శ్రీకాంత్ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 60 పరుగులు చేయడంతో, భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల స్కోరును సాధించగలిగింది.

01/03/2016 - 07:43

భారత జట్టుకు 2008లో ఆస్ట్రేలియా కూడా పాల్గొన్న కామనె్వల్త్ బ్యాంక్ ట్రై సిరీస్‌లో నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి ఇంత వరకూ అతను ఆస్ట్రేలియాపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఏడాది కాలంలోనే భారత జట్టు రెండోసారి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 2014-15 సీజన్‌లో, వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు చాలా ముందుగానే భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది.

12/26/2015 - 22:15

సానియా మీర్జా టెన్నిస్‌లో ‘నంబర్ వన్’గా ఎదిగిన సంవత్సరమిది. మన దేశం తరఫున మహిళల డబుల్స్ విభాగంలో గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించిన తొలి టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అంతేగాక, మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించింది.

12/26/2015 - 22:14

ఈ ఏడాది భారత క్రీడా రంగంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించి,దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన ఘనత ఇద్దరు హైదరాబాదీలకు దక్కుతుంది. ఒకరు బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కాగా, మరొకరు టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా. వివిధ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో సగానికిపైగా హైదరాబాదీలే కావడం విశేషం.

12/26/2015 - 22:11

ఫార్ములా వన్ రేస్‌లో లూయిస్ హామిల్టన్ వరుసగా మూడోసారి ప్రపంచ నంబర్ వన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. మెర్సిడిజ్‌కు ప్రాతిథ్యం వహిస్తున్న ఈ 30 ఏళ్ల బ్రిటిషర్ తన జట్టుకే చెందిన నికో రోజ్‌బెర్గ్‌ను పలు రేసుల్లో ఉద్దేశపూర్వకంగా ఓడించే ప్రయత్నం చేయడం, క్రీడాస్ఫూర్తికి, యాజమాన్యం ఇచ్చిన సూచనలకు భిన్నంగా ప్రవర్తించడం వివాదానికి కారణమైంది.

12/26/2015 - 22:10

ఈఏడాది భారత బాక్సర్లు కొత్త పుంతలు తొక్కారు. కానీ, బాక్సింగ్ సమాఖ్య సస్పెన్షన్‌కు గురై పరువు కోల్పోయింది. ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ అనూహ్యంగా ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తడం భారత బాక్సింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా అతను మొదటి మూడు ఫైట్స్‌లోనూ విజయాలను సాధించి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం.

12/26/2015 - 22:09

మంచి చెడుల మేలి కలయకగా 2015 సంవత్సరం భారత క్రికె ట్‌కు వెలుగు, చీకట్లను సమంగా పంచింది. 2013 ఇండియన్ ప్రీమి యర్ లీగ్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దోషులుగా తేలిన రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూ టివ్ గురునాథ్ మెయప్పన్‌లపై జీవితకాల సస్పెన్షన్ వేటు పడింది.

12/26/2015 - 22:08

అంతర్జాతీయ వేదికలపై భారత అథ్లెట్లు పతకాలు కొల్లగొట్టడంలో విఫలమవుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే ప్రమాణాలు పెరిగాయని చెప్పవచ్చు. ఇప్పటికే 15 మంది అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. మరికొన్ని ఈవెంట్స్ జరగాల్సి ఉన్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అథ్లెటిక్స్‌లో ఇప్పటి వరకూ పతకం సాధించలేకపోయిన భారత్ రియోలో అద్భుతాలు సృష్టిస్తుందని అనుకోవడం అత్యాశే.

12/26/2015 - 22:08

భారత క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అతను చైనాకు చెందిన జువా జింటాంగ్‌ను ఢీకొని 8-6 ఫ్రేమ్స్ (117-6, 75-16, 29-68, 63-23, 87-01, 16-72, 110-13, 113-01, 52-65, 13-84, 77-36, 14-126, 26-82, 116-24) తేడాతో విజయం సాధించాడు. అద్వానీకి కెరీర్‌లో ఇది 15వ ప్రపంచ టైటిల్. స్నూకర్స్‌లో ఐదవది.

12/26/2015 - 22:07

ప్రో రెజ్లింగ్ లీగ్ (పిడబ్ల్యుఎల్) తెరపైకి రావడంతో ఈఏడాది భారత రెజ్లింగ్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రపంచ మేటి రెజ్లర్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నుంచి సుశీల్ వైదొలగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంతేగాక సుమారు ఏడాది కాలంగా అతను గాయాలతో బాధపడుతూ చాలా టోర్నీల్లో పాల్గొనలేకపోయాడు. వచ్చే ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకూ 74 కిలోల విభాగంలో మాత్రమే క్వాలిఫై అయింది.

Pages