S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

01/07/2017 - 23:29

‘జార్ఖండ్ డైనమెట్’ మహేంద్ర సింగ్ ధోనీ వనే్డ, టి-20 ఫార్మాట్స్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పడంతో, భారత క్రికెట్‌లో ఓ అద్వితీయ శకానికి తెరపడింది. అదే సమయంలో సరికొత్త అధ్యాయానికి పునాది పడింది. ఇన్నాళ్లూ టెస్టు జట్టు కెప్టెన్‌గా టీమిండియాను దూకుడుగా పరుగులు తీయిస్తున్న విరాట్ కోహ్లీ ఇకపై పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ నాయకత్వం వహించనుండడమే అందుకు కారణం.

01/07/2017 - 23:28

ధోనీ హెయర్ స్టయల్ ఎప్పుడూ చర్చనీయాంశమే. అమ్మాయలు కూడా అసూయపడేలా పొడవాటి జుట్టు కావచ్చు... అరగుండు కావచ్చు.. ఒక్కోసారి పూర్తి గుండు గీయంచుకోని ఉండొచ్చు... ‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అన్న చందంగా ధోనీ ఏం చేసినా అదొక సంచలనమే అవుతుంది. చివరికి అతని హెయర్ స్టయల్‌ను కూడా అనుకరించడం అభిమానులకు అలవాటైంది. కెరీర్‌ను ఆరంభించిన రోజుల్లో తన ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌తో ప్రత్యేకంగా కనిపించేవాడు.

01/07/2017 - 23:25

వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తూనే జట్టుకు నాయకత్వం వహిస్తూ ఒక ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ధోనీ టాపర్. అతను ఈ ద్విపాత్రాభియనం చేస్తూ 6,633 పరుగులు సాధించాడు. 1,756 పరుగులతో కుమార సంగక్కర ద్వితీయ స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడాను చూస్తే, ధోనీ రికార్డును ఇప్పట్లో ఎవరూ అధిగమించే అవకాశమే లేదని స్పష్టమవుతుంది.

01/07/2017 - 23:24

కోపిష్టి బాక్సర్‌గా ముద్రపడిన డెరెక్ చిసోరాకు కోపమొచ్చింది. ఈసారి ఏకంగా బ్రిటిష్ బాక్సింగ్ బోర్డు (బిబిబిసి) అధికారులపైనే అతను కాలుదువ్వాడు. బ్రిటిష్ చాంపియన్ డిలియన్ వైట్‌తో చిసోరా ఫైట్‌ను ప్రమోట్ చేయడానికి బిబిబిసి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే లండన్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

01/07/2017 - 23:21

* ధోనీకి ఆర్మీ అంటే ఎంతో ఇష్టం. క్రికెటర్‌ను కాకపోతే, సైన్యంలో చేరే వాడినని అతను చాలా సందర్భాల్లో చెప్పాడు. 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. అప్పటి నుంచి అతను ఎప్పుడు సమయం దొరికినా సైనిక శిబిరాల్లోకి వెళ్లేవాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో, అతనికి ఎక్కువ విశ్రాంతి లభించడం ఖాయం.

01/07/2017 - 23:20

* ధోనీకి మోటార్ బైక్స్‌పై వేగంగా షికార్లు చేయడం అంటే మహా సరదా. అతని వద్ద ఇరవై ఐదుకుపైగా మోటార్ సైకిళ్లు ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పెరుతునే ఉంది. కొన్న ఏ వాహనాన్నీ అతను అమ్మలేదు. ఎప్పుడో ఒకసారి వాటిని వాడుతునే ఉంటాడు.

12/31/2016 - 21:50

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తాను తీసుకున్న గోతిలో తానే పడింది. మొండి వైఖరిని ప్రదర్శించి, తాడును తెగే వరకూ లాగిన బోర్డు అధికారులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ. మూడో తేదీన సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వారిని వేధిస్తున్నది.

12/31/2016 - 21:48

2016లో అద్భుతాలు సృష్టించి, భారత క్రీడా రంగంపై తమ ప్రత్యేకతను చాటుకున్న పలువురు స్టార్లు కొత్త సంవత్సరంలోనూ దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి అపూర్వమైన ప్రతిభాపాటవాలు ఎంతో మంది యువతీయువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయ.

12/31/2016 - 21:45

* రియో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు యావత్ దేశం జేజేలు పలికింది. అయితే, రియోకు వెళ్లిన రెజ్లర్లలో తప్పనిసరిగా పతకాన్ని సాధించే సత్తా ఉందన్న పేరు మాత్రం వినేష్ ఫొగట్‌కు మాత్రమే పరిమితమైంది. ‘్ఫగట్ సిస్టర్స్’లో బబిత, గీత తర్వాత ఆ స్థాయిలో రాణించే సత్తావున్న రెజ్లర్ వినేష్. రియోలో మహిళల 48 కిలోల విభాగంలో ఆమె హాట్ ఫేవరిట్‌గానే బరిలోకి దిగింది.

12/24/2016 - 23:53

ఈ ఏడాది క్రీడా ప్రపంచాన్ని శాసించిన వారి జాబితాలో మొదటి రెండు స్థానాలు అమెరికా స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్, స్ప్రింట్ రారాజు ఉసేన్ బోల్ట్‌కే దక్కుతాయి. రియో ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ ఐదు స్వర్ణాలు, ఒక రజతంతో కలిసి మొత్తం ఆరు పతకాలు సాధించాడు. మరెవరికీ సాధ్యంకాని రీతిలో అతను మొత్తం 28 ఒలింపిక్ పతకాలను గెల్చుకొని, తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. వాటిలో 23 స్వర్ణాలు.

Pages