S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

02/12/2017 - 00:07

ఒక టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి, ట్రోఫీని అందుకున్నప్పుడు ఏ జట్టయినా గంతులు పెడుతుంది. ఆనందంతో ఊగిపోతూ, విక్టరీ ల్యాప్స్‌తో సందడి చేస్తుంది. షాంపైన్ జల్లుల్లో మునిగితేలుతుంది. కానీ, బ్రెజిల్ ఫుట్‌బాల్ క్లబ్ చపెకొయన్స్ జట్టు కోపా సుడామెరికానా ట్రోఫీని తీసుకున్నప్పుడు ఎవరి ముఖంలోనూ ఆనందం కనిపించలేదు. కన్నీళ్లు జాలువారుతుండగా, దుఃఖాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకుంటూ ట్రోఫీని స్వీకరించారు.

02/12/2017 - 00:04

* మైదానంలోకి దిగిన తర్వాత ఎవరైనా తన జట్టును గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు. బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయాలని, సాధ్యమైనన్ని తక్కువ పరుగులిచ్చి, ఎక్కువ వికెట్లు తీయాలని బౌలర్లు అనుకుంటారు. కానీ, ఆస్ట్రేలియా బౌలర్ మిక్ లూయిస్‌ను ఇందుకు మినహాయించాలి. 2006లో దక్షిణాఫ్రికాతో వాండరర్స్‌లో జరిగిన వనే్డలో అతను 10 ఓవర్లు బౌల్ చేసి, 113 పరుగులు సమర్పించుకున్నాడు.

02/05/2017 - 01:07

అన్నాదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల సవాళ్లు మిగతా క్రీడల్లో మాదిరిగానే టెన్నిస్‌లోనూ చాలాకాలంగా కొనసాగుతున్నాయ. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనా విలియమ్స్ పోటీపడడంతో మరోసారి తోబుట్టువుల హవా తెరపైకి వచ్చింది. మన దేశంలో విజయ్ అమృత్‌రాజ్, ఆనంద్ అమృత్‌రాజ్, అశోక్ అమృత్‌రాజ్ సోదరులు టెన్నిస్‌కు సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టారు.

02/05/2017 - 01:03

ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకొని, ఈ ఏడాది శుభారంభం చేసిన స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న క్రీడాకారుడిగా అతను తన రికార్డును తానే అధిగమిస్తున్నాడు. పీట్ సంప్రాస్, రాఫెల్ నాదల్ చెరి 14 టైటిళ్లతో ద్వితీయ స్థానంలో ఉంటే, వారి కంటే నాలుగు టైటిళ్లు అధికంగా సాధించిన ఫెదరర్ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు.

02/05/2017 - 01:02

నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినందుకు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా మళ్లీ అంతర్జాతీయ సర్క్యూట్‌పై కాలు మోపేందుకు కసరత్తు చేస్తున్నది. ఫిట్నెస్ కోసం చెమటోడుస్తున్నది. గంటల తరబడి పరుగులు తీస్తూ, బాక్సింగ్ చేస్తూ కెరీర్‌ను కొనసాగించేందుకు మంచి షేపులో ఉండేందుకు శ్రమిస్తున్నది.

02/05/2017 - 00:47

* గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో అత్యధిక టైటిళ్లు సాధించిన టెన్నిస్ స్టార్ల జాబితాలో మార్గరెట్ కోర్ట్‌ది అగ్రస్థానం. ఆమె కెరీర్‌లో మొత్తం 24 టైటిళ్లను అందుకుంది. వీటిలో 11 ఆస్ట్రేలియా ఓపెన్, ఐదు ఫ్రెంచ్ ఓపెన్, మూడు వింబుల్డన్, మరో ఐదు యుఎస్ ఓపెన్ ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించిన సెరెనా విలియమ్స్ 23 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.

02/05/2017 - 00:45

* ఎన్నో సందర్భాల్లో క్రీజ్‌లో నిలదొక్కుకొని, గంటల తరబడి బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన బ్యాట్క్‌మెన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే అతనికి ‘ది వాల్’ అన్న పేరు స్థిరపడింది. అతనిని అవుట్ చేయడం సులభం కాదన్నది వాస్తవం. అది నిజమే.. కానీ, టెస్టు చరిత్రలో ఎక్కువ సార్లు క్లీన్ బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్ కూడా అతనే కావడం విశేషం.

02/05/2017 - 00:43

* బేస్‌బాల్ మాజీ పిచర్ మార్క్ ఫిర్డిచ్‌ని ‘ది బర్డ్’ అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు. ఎవరైనా ఒక మ్యాచ్‌కి ముందు గ్రౌండ్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తారు. కొంత మంది చివరి క్షణం వరకూ అక్కడే ఉంటారు. కానీ, ఫిర్డిచ్ మాత్రం మ్యాచ్‌కి ముందు మట్టిలో గంతులు పెట్టేవాడు. అక్కడే ఒంటరిగా ఏవేవో ఆటలు ఆడేవాడు. చివరికి మురికిపట్టిన బట్టలతోనే మ్యాచ్ ఆడేందుకు వెళ్లేవాడు.

01/28/2017 - 22:57

స్టార్లు గెలవడం.. టైటిళ్లు సాధించడం సర్వసాధారణం. ఎలాంటి అంచనాలు లేకుండా పోటీకి దిగి, స్టార్లను ఓడించడం సంచలనం. ఇలాంటి సంచలనాలకు మారుపేరైన టెన్నిస్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు ఎన్నో నమోదయ్యాయి.

01/28/2017 - 22:53

గొరాన్ ఇవానిసెవిచ్ వైల్డ్‌కార్డ్‌తో ఎంట్రీ సంపాదించి, టైటిల్ సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2001 వింబుల్డన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందినప్పుడు అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 125వ స్థానంలో ఉన్నాడు. ఒక్కో అడుగు ముందుకేస్తూ, ఫైనల్ చేరాడు. టైటిల్ పోరులో అప్పటి మూడోసీడ్ పాట్ రాఫ్టర్‌ను 6-3, 3-6, 6-3, 2-6, 9-7 తేడాతో ఓడించి సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

Pages