S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/21/2016 - 03:50

దేశంలోని మహానగరాల జాబితాలో లేకున్నా, అంతకుమించిన ఖ్యాతితో గ్రేటర్ హోదా పొందిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే నెల 2వ తేదీన జరగనున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. 172 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న నగరం జనాభా దాదాపు కోటికి చేరింది. మరో పదేళ్లలో నగర జనాభా 1.84 కోట్లకు పెరుగుతుందని అంచనా.

01/21/2016 - 03:48

మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తాం.. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతాయి. శాంతి భద్రతల పరిరక్షణకు నగర పోలీసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తాం. ఎన్నికలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం నగరంలో 14,716 మంది సిబ్బంది అవసరం కాగా 9,821 మాత్రమే ఉన్నారు.

01/21/2016 - 03:47

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు మంచి ప్రతినిధులను ఎన్నుకుని, స్వయం పరిపాలనకు శ్రీకారం చుట్టాల్సిన అవకాశం హైదరాబాద్‌లోని ప్రతి పౌరునికీ లభించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమకున్న ఓటు హక్కును వినియోగించుకుని, మంచి ప్రతినిధిని ఎన్నుకోవడం వల్ల సుపరిపాలన సాధ్యమవుతుంది.

01/21/2016 - 03:45

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇంకా చేయాల్సిందీ చాలా ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో మా మజ్లిస్ పార్టీ కీలకపాత్ర పోషించింది. లోగడ ప్రకాశ్‌రావు, ఎ.సత్యనారాయణ, ఆలంపల్లి పోచయ్య, మాజిద్ హుస్సేన్ మేయర్లుగా ఉన్నప్పుడు రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని వేగవంతం చేశాం. మా హయాంలోనే డబీర్‌పురా, ఖైరతాబాద్ వంతెనల నిర్మాణం జరిగింది.

01/21/2016 - 03:44

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధికార దుర్వినియోగం, డబ్బు రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీసహా కాంగ్రెస్, టిడిపి, బిజెపి ఖూనీ చేస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ వ్యవహార శైలి గెలుపు ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని అన్ని అడ్డదారులూ తొక్కుతోంది.

01/21/2016 - 03:43

పద్దెనిమిది నెలల పాలనా కాలంలో మేం ఏం చేశామో చూడండి. ఇంతకాలం ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి 50 ఏళ్లలో మిగిలిన వారు చేయంది ఐదేళ్లలో మేం చేసి చూపిస్తాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే మా ప్రచారం. ఇప్పటివరకు గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, టిడిపి-బిజెపి అందరికీ ఇచ్చారు. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడమని కోరుతున్నారు.

01/21/2016 - 03:42

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌తోనే గ్రేటర్ హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది. గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది మేమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చాం. టిడిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందలేదు.

01/21/2016 - 03:41

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మిగతా రాజకీయ పార్టీల కంటే అధికార టిఆర్‌ఎస్ పార్టీకి కొంత అవకాశం దొరికింది. డివిజన్ల రిజర్వేషన్లపై ఆ పార్టీ అధికారంలో ఉండటం వల్ల లోపాయికారికి ముందుగా తెలిసే అవకాశం ఏర్పడింది. దీంతో ఏ డివిజన్‌లో ఎవరిని బరిలోకి నిలబెట్టాలనే దానిపై టిఆర్‌ఎస్ పార్టీ ముందుగానే కసరత్తు చేసుకోగలిగింది. ఇలాంటి అవకాశం ఇతర పార్టీలకు లేకుండా పోయింది.

01/21/2016 - 03:40

తెలంగాణ యావత్తు పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకోవడంపై వైకాపా దృష్టిని సారించింది. పక్కన ఏపిలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తున్న టిడిపి, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బిజెపి, పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వ మద్దతుతో కాంగ్రెస్, ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎంతైనా డబ్బును ఖర్చుపెట్టేందుకు వెనకాడడం లేదు.

01/13/2016 - 22:29

హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు, అత్యంత పవిత్రమైన ప్రదేశాలు అవి. వాటి నిర్వహణకు అనేక సంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు, నిర్వహణ తీరు తెన్నులు పురాణాలు, ఇతిహాసాల నుండే ఉన్నాయి. శాస్త్ర ప్రకారం భక్తుల సౌకర్యార్ధం భగవంతుడు ఆర్చారూపియై భూలోకానికి వస్తాడని, ప్రతి దేవాలయంలో ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆవాహనతో ఉంటారని చెబుతారు.

Pages