S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/13/2016 - 22:21

దేవాలయాల్లో పవిత్రత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాష్ట్రంలో దేవాలయాల స్థితిగతులు వాటి పరిరక్షణకోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. దేవాలయాల్లో ఉద్యోగుల వస్తధ్రారణకు నిబంధనలు విధించాం. తెల్లని దుస్తులు, తిలకం ధరించాలని ఆదేశాలిచ్చాం, దేవాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో కృతకృత్యులయ్యాం.

01/13/2016 - 22:19

ఆలయాలకు సంబంధించి కొత్తగా జీఓలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ భావించినా, చట్టాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని భావించినా రాష్ట్రంలోని పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుంది. వీరి సలహాలను పాటించాలి. ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ పనితీరు అధ్వాన్నంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవాదాయ శాఖ ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో కొనసాగుతోంది.

01/13/2016 - 22:17

రాష్ట్రంలో దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య పరంగా మార్చింది. కోవెల (దేవాలయం) లలను వర్తకంలా వినియోగిస్తున్నారు. ప్రసాదాని కో‘వెల’, దర్శనాని కో‘వెల’, పూజ కో‘వెల’, తీర్థాని కో‘వెల’గా మార్చడంతో హిందూ సమాజం అట్టుడికిపోతోంది. ఈ తీరును మార్చుకోకపోతే కచ్చితంగా హిందూ సమాజం ప్రతిఘటనను ప్రభుత్వం ఎదుర్కోవలసి ఉంటుంది.

01/13/2016 - 22:15

ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉపయోగపడాలి. ప్రతి గ్రామంలోని దేవాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం ఎపి దేవాదాయ పరిపాలన కోసం ఉన్న చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల రెవెన్యూ (దేవాదాయ) శాఖ జారీ చేసిన జీఓలపై ఆందోళన అవసరం లేదు. అవసరం అయితే జీఓల్లో మళ్లీ మార్పులు చేసుకుని కొత్త జీఓలను రూపొందించుకోవచ్చు. జీఓ ఏదైనా అది హిందూ ధర్మాన్ని కాపాడేది అయి ఉంటే చాలు.

01/13/2016 - 22:14

రెండు రాష్ట్రాల్లో ఆలయాల పట్ల పాలకులు శ్రద్ధ చూపుతారని భావిస్తే, మార్పు ఏమీ లేదు. కంటితుడుపు ఓదార్పు చర్యలే తప్ప హిందూ మతంకోసం చేస్తున్నదేమీ లేదు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల వంటిని నిర్వహించడం మినహా హిందూ మతంపై జరుగుతున్న దాడిని, మత మార్పిడుల కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునే చర్యలేమీ లేవు. ఒక ముఖ్యమంత్రి మేరిమాత చర్చిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.

01/13/2016 - 22:13

చిన్న చిన్న దేవాలయాల నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే వాటికి మనుగడ ఉంటుంది. ముఖ్యంగా ఆలయాల విషయం, హిందూ ధర్మ పరిరక్షణ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో ధర్మ ప్రచారం అనేది చాలా అవసరం. ఈ ధర్మ ప్రచారం ద్వారానే ఆలయాల విశిష్టత, హిందూ మత పరిరక్షణ జరుగుతుంది. మతమార్పిడులు యధేచ్చగా సాగుతున్నాయి.

01/13/2016 - 21:55

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన జారీ చేసిన జీవో 13, గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో జారీ చేసిన ఆరు జీవోలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఇది పూర్తిగా తొందరపాటు నిర్ణయం. దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి వౌలిక సంస్కరణలు తేవాలనే ధార్మిక పరిషత్ సూచనలకు కార్యరూపం ఇవ్వాలని చేసిన ప్రయత్నాన్ని నిర్వీర్యం చేయడమేనని చెప్పాలి.

01/06/2016 - 23:06

పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా వాటి వెనుక లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్‌ఖైదాలాంటి ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉంటోంది. ఇప్పుడు కొత్తగా ఐసిస్ పుట్టుకొచ్చింది. భారత్‌లోనూ ఉగ్రవాద ఘటనలు కొత్తేమీ కాదు. దేశీయ ఉగ్రవాదాన్ని తీవ్రవాదంగా భావించినా, వారి ఉద్దేశ్యాల వెనుక ఉన్నది ఉగ్రవాద ఆలోచనలే.

01/06/2016 - 23:05

ప్రపంచ దేశాలకు ఉగ్రవాదం ఒక సమస్యగా పరిణమిస్తోంది. ఉగ్రవాదం ఎప్పటికైనా ముప్పే. ప్రపంచ దేశాలు సహితం ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉగ్రవాద సమస్య యావత్ ప్రపంచానికే సవాలుగా మారింది. దీన్ని వీలైనంత త్వరగా అణచివేయాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. దేశాలు అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.

01/06/2016 - 23:04

పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రమేయంతోనే జరిగింది. దీన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ దాడిలో మనవాళ్లు కొంతమంది ప్రాణాలు కోల్పోవడం విచారకరం. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత దేశంపై కాలు దువ్వుతునే ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ముంబై దాడులు జరిగాయి. ఆ దాడులు జరిపింది కూడా పాకిస్తానే అన్నది బాహ్య ప్రపంచానికి తెలిసిందే.

Pages