S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/17/2015 - 02:21

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల తంతు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. సంతలో పశువుల కన్నా హీనంగా ప్రజా ప్రతినిధులను కొంటున్నారు, అలాగే అమ్ముడుపోతున్నారు. విలువలను గాలికొదిలేసి పదవులే పరమార్థంగా భావించి డబ్బు, అధికారానికి అమ్ముడుపోవడం దురదృష్టకరం. మనల్ని నమ్ముకుని గెలిపించిన ప్రజలకు ద్రోహం చేయడం నీచాతినీచం.

12/17/2015 - 02:20

స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనైతిక చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలను లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రవర్తిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ముఖ్యం. ప్రతిపక్షాలు బలంగా ఉండాలని రాజ్యాంగ రచయతే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అప్పట్లోనే చెప్పారు. ప్రతిపక్షాలు అద్దం వంటివి. ప్రభుత్వం చేసే పనులను విపక్షాలు ప్రతిబింబింప చేస్తాయ.

12/17/2015 - 02:19

ఏ ఎన్నికల్లోనైనా అధికార పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను తుడిచిపెట్టుకునిపోయే విధంగా వ్యవహరించడం అమానుషం. ఈ తరహా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఇష్టమైన పార్టీకి ఓటు వేసే హక్కు ఉంటుంది. అలాగే తమకు నచ్చిన పార్టీలో నాయకులు చేరవచ్చు.

12/17/2015 - 02:18

స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీ పెద్దల సభకు ఉన్న గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 12 శాసన మండలి సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తుంగా, అందులో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడం వంటి ఘటనలు మునుపెన్నడూ జరుగలేదనే చెప్పాలి.

12/17/2015 - 02:17

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు. రాజకీయాలపై పార్లమెంట్‌లో కఠిన నిర్ణయాలు, ఉన్నత న్యాయస్థానాల్లో చర్చకు తెచ్చే అవకాశాలు లేకపోయినా రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా ఒక బలపైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన అభ్యర్థులు తన పదవీకాలం ముగిసిపోకుండానే మరో పార్టీలోకి మారుతున్నారు.

12/10/2015 - 03:34

బీఫ్ ఫెస్టివల్- పెద్దకూర పండుగ... మాంసాహారులైన ప్రజలు తమకు నచ్చిన మాంసాన్ని భుజించడం సహజం. కొంతమంది కోడి కూర, కొంతమంది గొర్రె మాంసం, మరికొంతమంది మేక మాంసం, ఇంకొంతమంది ఆవుమాంసం, పంది మాంసం ఇలా ఒకొక్కరూ తమ జీవన అలవాట్లకు అనుగుణంగా మాంసాన్ని భుజించడం చాలాకాలంగా జరుగుతోంది.

12/10/2015 - 03:32

బీఫ్ ఫెస్టివల్‌ను ఎక్కడా జరగనీయం. దీనిని ఖచ్చితంగా అడ్డుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు తమ భవిష్యత్తుకోసం ఆలోచన చేయాలి. విశ్వవిద్యాలయాల్లో వారికి ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాటం చేయాలి. అలా చేయకుండా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామనడం సమంజసం కాదు. దీని వెనకాల ముస్లిం, క్రిస్టియన్ సంస్థలు అండగా నిలబడుతున్నాయి.

12/10/2015 - 03:31

ఢిల్లీలోని పారిశ్రామికవాడలో ఆ మధ్య తరుచుగా పిల్లలు మాయం అవుతుండడంతో పోలీసులు నిఘా పెడితే విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి మనిషి మాంసాన్ని తినడానికి అలవాటుపడ్డాడు. నా ఇష్టం తిండిపై నా స్వేచ్ఛను అడ్డుకుంటారా? అని వాదించాడు. ఇప్పుడతను జైలులో ఉన్నాడు. అదే విధంగా కొందరు కోట్లాది మంది హిందువులను రెచ్చగొట్టేందుకు గో మాంసాన్ని విశ్వవిద్యాలయంలో తింటామని వివాదం సృష్టిస్తున్నారు.

12/10/2015 - 03:30

ఇందులో తప్పేమిటో నాకు ఇప్పటివరకు అర్థం కావడం లేదు. దేశంలో ఎక్కడా బీఫ్ మాంసం అమ్మడం లేదా? బీఫ్ మాంసాన్ని విక్రయించరాదన్న ఆంక్షలేమైనా ఉన్నాయా? లేక తినరాదన్న ఆంక్షలేమైనా ఉన్నాయా? ఆ విధమైన చట్టాలు ఏమైనా కొత్తగా వచ్చాయేమో నాకైతే తెలియదు. యూనివర్సిటీలో విద్యార్థులు కొందరు బీఫ్ ఫెస్టివల్ చేసుకుంటామంటే దానిని భూతద్దంలో చూపిస్తూ, హిందు-ముస్లింల తగాదాలా చూపించే ప్రయత్నం జరగడం దురదృష్టకరం.

12/10/2015 - 03:29

దేశంలో రకరకాల జాతులు, రకరకాల ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారు. ఎవరికి కావాల్సింది వారు తినే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉన్నాయి. మరొకరి స్వేచ్ఛను భగ్నంచేసే హక్కు మరొకరికి ఎవరిచ్చారు. అసలు ఆహారపు అలవాట్లకు, మతానికి ముడిపెట్టడం సరికాదు. ఎవరినీ బలవంతంగా బీఫ్ తినాలని చెప్పడం లేదు కదా. అయినా ఇప్పుడు కొత్తగా బీఫ్ తినడం లేదు. అది వారి ఇష్టం. దీనిపై కొత్తగా రాద్ధాంతం అనవసరం.

Pages