S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/25/2017 - 19:29

భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం ఒక పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచాక, మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఎన్నికైన పార్టీని వదిలేసి, మరో పార్టీలో చేరే అభ్యర్థులు ఈ చట్టం ద్వారా అనర్హులవుతారు. ఒక పార్టీ పక్షాన ఎన్నికై, మరో పార్టీలో చేరడం అనేది అనైతిక, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. ఈ తరహా చర్యలను నివారించడానికే ఈ చట్టం చేశారు.

10/25/2017 - 19:28

పార్టీల ఫిరాయింపులు దురదృష్టకరం. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఉండటంతో కొందరు నేతలు తప్పని పరిస్థితిల్లో ఇతర పార్టీలోకి వెళ్ళాల్సి వస్తోంది. ప్రజల మద్దతుతో గెలిచి వారి మనోభావాలకు అనుగుణంగా మెలగాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనోభావాలను కచ్చితంగా గౌరవించాల్సిందే.

10/25/2017 - 19:28

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు మంచి సంప్రదాయం కాదు. అనివార్యమైన పరిస్థితుల్లో విశ్వసనీయతే కొలమానంగా భావించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్నారు. సైద్ధాంతిక ప్రాతిపదికన మార్పులు, చేర్పులు జరగటం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో బలహీనమైన అభ్యర్థులున్నారు? ప్రజాదరణ ఎవరికి ఉంది?

10/25/2017 - 19:27

ప్రజలు వ్యతిరేకించే పార్టీ ఫిరాయింపులను, మార్పులను ఏ రాజకీయ వ్యవస్థా ప్రోత్సహించ కూడదు. ఎవరు పార్టీ ఫిరాయించినా అంతిమ తీర్పును ప్రజలే నిర్ణయిస్తారు. రాజకీయాల్లో పార్టీ విధానాలకు, ఆశయాలకు, కార్యక్రమాలకు, నాయకత్వ లక్షణాలను ఆధారం చేసుకుని అవకాశాలు వస్తుంటాయి. నాయకులు ఆయా పార్టీ విధానాలు, ఆశయాలకు, కార్యక్రమాలను నాయకత్వ లక్షణాలతో నిర్మాణం చేసుకుంటూ రావాల్సి వుంటుంది.

10/25/2017 - 19:27

ఫిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపులకు తావుండదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వాలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎంపీలు, ఎమ్మెల్యేపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పార్టీ ఫిరాయించిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై స్పీకర్లు చర్యలు తీసుకోవాలి.

10/25/2017 - 19:26

ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లే ఫిరాయింపుదారులపై ఎన్నికల సంఘమే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించాలి. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాల్సిన స్పీకర్లు అధికార పార్టీకి చెందినవారై ఉండడం, పార్టీ ఫిరాయించినవారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారై ఉంటుండడంతో వారిపై తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.

10/25/2017 - 19:25

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లుగానే రాజకీయ వ్యవస్థ కూడా అంతే మార్పు చెందుతుంది. రాజకీయ నాయకులకు ఏ పార్టీలో ఆదరణ, అవకాశం లభిస్తే ఆటువైపుగా వెళ్లడం సహజం. కానీ పార్టీని నడిపించే సారథిపైనే ప్రధాన భారం ఉంటుంది. నమ్ముకుని ఎన్నుకున్నవాడు తగిన న్యాయం చేస్తాడనే విశ్వాసం ఉన్నప్పుడే ఓటర్లు ఆ పార్టీని ఆదరిస్తారు.

10/25/2017 - 19:25

ఫిరాయింపులను అంత తేలిగ్గా కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు అంటే ఆ పార్టీ ద్వారా ప్రజలకు అలాగే రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేయాలనే తృష్ణ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మంది ఓటర్లుంటే ప్రధాన రాజకీయ పక్షానికి కనీసం లక్ష మంది కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు ఉంటారు.

10/25/2017 - 19:24

అధికారం అప్పగిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తానని సార్వత్రిక ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నమ్మబలికారు. ప్రజలు కూడా నిజమేనన్న భావనతో టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించారు. అందలమెక్కిన చంద్రశేఖర్ రావు ఒకవైపు కుటుంబ పాలన చేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను అణచివేసి పాలన కొనసాగిస్తున్నారు.

10/25/2017 - 19:23

ఒక పార్టీ నుంచి ఎన్నికై, ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల్లోకి, అధికారంలోకి వచ్చిన పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధం, అనైతికం. ఎన్నికల్లో ప్రజలు తమ అసెంబ్లీ, లోక్‌సభకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీని ఎన్నుకుంటారు. వీరు ఐదేళ్ల పాటు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో అదే పార్టీలోనే కొనసాగాలి. ఒకవేళ రాజకీయపరమైన, సిద్ధాంతమైన చికాకులు, అవరోధాలు ఎదురైతే, ఆ పార్టీకి రాజీనామా చేయాలి.

Pages