S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/04/2017 - 19:14

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పోటీతత్వంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేయాలి. అంతేకాని రాజ్యాంగపరమైన లక్ష్మణరేఖ దాటి వ్యవహరిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్‌పైన, కలెక్టర్ ఎమ్మెల్యేపైన అభియోగాలు మోపారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిణామం.

10/04/2017 - 19:13

అధికార పార్టీ చెప్పినట్లే అధికారులు వినాలనే విధంగా బహిరంగ ఆదేశాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి. కలెక్టర్ల సమావేశంలో తమ పార్టీ నేతలను పరిగణనలోకి తీసుకొని నిధుల విడుదల, సంక్షేమ పథకాల అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆదేశించడం రాజ్యాంగానికే విరుద్ధం.

09/27/2017 - 16:27

మద్యం అమ్మకాలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. కాలంతో పనిలేకుండా అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇది ప్రభుత్వాలకు ఉపశమనం కలిగించే విషయమే అయినా ప్రజలకు మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజూ సగటున తెలంగాణలో 50కోట్లు, ఆంధ్రాలో 45కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే తెలంగాణలో 18వేల కోట్లు, ఆంధ్రాలో 17వేల కోట్ల రూపాయిల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి.

09/27/2017 - 16:27

ప్రభుత్వానికి మద్యం ఒక్కటే ఆదాయ వనరుకాదు. గత మూడేళ్లుగా పరిస్థితి చూస్తే రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఎక్సైజ్ ఆదాయంతోనే ప్రభుత్వం నడవటంలేదు. గతంలో 15 నుంచి 25 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అదీ ఉమ్మడి రాష్ట్రంలో.. ఇప్పుడు ఆ పరిస్థితులులేవు. సిండికేట్ల కారణంగా కొన్నిచోట్ల మద్యం వేలం ప్రక్రియకు విఘాతం కలుగుతోంది.

09/27/2017 - 16:26

తెలంగాణ రాష్ట్రం మద్యరహితంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇది ఎకాఎకిన జరిగేది కాదని అందరికీ తెలుసు. తెలంగాణను మద్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు శాస్ర్తియ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మద్యం వల్ల వచ్చే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. 2017-19 ఎక్సైజ్ విధానంలో ఇదే ప్రధాన అంశంగా ఉంటుంది.

09/27/2017 - 16:25

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత మద్యం ఆదాయాన్ని పదింతలు పెంచుకున్నది. మద్యం ప్రియులను పూర్తిగా మద్యానికి బానిసలుగా చేసి, ప్రజలను మాయ మాటలతో, లేనిపోని, ఆచరణ సాధ్యం కానీ హామీలతో బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజలు మద్యం వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, మరింత ప్రోత్సహించడం దురదృష్టకరం.

09/27/2017 - 16:24

రాజ్యంగ విలువలను విస్మరిస్తూ ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను ప్రొత్సహించేలా విధానాలు రూపొందించి అమలు జరుపడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు రాబడి పెంచుకోవాలని చూస్తూ సమాజానికి నష్టం చేస్తోంది.

09/27/2017 - 16:24

మద్యంపై జాతీయ విధానం లేదు. మద్యం రాష్ట్రాల పరిధిలోని అంశం. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంచుమించు ఒక విధానంతో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలను ప్రోత్సహించే విధంగా పాలసీలను రూపొందించాయి. బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

09/27/2017 - 16:23

మద్యం పాలసీపై ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని అమలు చేసింది. గ్రామాల్లో బెల్టుషాపులను, అక్రమ మద్యం సరిఫరాను అరికట్టారు. గతంలో ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం పూర్తిగా నిషేధించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అందువల్లనే ప్రభుత్వం మద్యం పూర్తిగా అరికట్టకుండా విచ్చలవిడితనం లేకుండా చేయాలని భావించింది. అందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టింది.

09/27/2017 - 16:22

రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదు. అయితే కల్తీ మద్యాన్ని నివారించడంతోపాటు మద్యం మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నాటుసారా తయారీదార్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. నూతన మద్యం పాలసీద్వారా చాలా మార్పులు వచ్చాయి. మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరిగింది.

Pages