S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

06/07/2017 - 23:34

ఇటీవల ఒక సినీనటుడు మహిళలపై అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించారు. చివరకు క్షమాపణ చెప్పాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే మహిళ ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ప్రతిభావంతులైన మహిళలంటే అసూయతో కొంతమంది విపరీత చేష్టలకు పాల్పడుతున్నారు. సెలబ్రిటీలు చౌకబారు పాపులారిటీకోసం మహిళలను సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ కించపరుస్తున్నారు. దీని ప్రభావం యువతపై ఉంది.

05/31/2017 - 23:14

టిఆర్‌ఎస్ పాలనపై ప్రముఖుల అభిప్రాయాలు

05/31/2017 - 23:12

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతానని సోనియాగాంధీని మోసం చేసినట్లుగానే బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రజలను కెసిఆర్ మోసం చేసారు. మూడేళ్ల అభివృద్ధిని పరిశీలిస్తే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగింది. డబుల్ బెడ్ రూం ఇండ్లతో ప్రజలను మభ్య పెట్టారు. అధికారం అప్పగిస్తే స్వంత ఇల్లు లభిస్తుందనే సామాన్య ప్రజల ఆశలను అడియాసలు చేసారు.

05/31/2017 - 23:11

వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 2001లో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కొనసాగుతోంది. మూడేళ్లలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టి దేశానికే దిక్చూచిగా మారింది. ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చే విధంగా జిల్లాల విభజన చేసాం. ఆర్థిక పరిపుష్టి అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలు చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. కరెంటు కోతలతో ఎదుర్కొన్న అవస్థలు తొలగిపోయాయి.

05/31/2017 - 23:08

సుదీర్ఘకాల పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో స్వయం పాలనకు మూడేళ్లు నిండిన తరుణంలో కొత్త రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో, ఆదాయ వనరుల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతున్నాం. 24 లక్షల పంపు సెట్లున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్‌తోపాటు పరిశ్రమలకు సైతం కోతల్లేని విద్యుత్ అందించడం మూడేళ్ల పాలనలో సాధించిన గొప్ప విజయం.

05/31/2017 - 23:04

ఆత్మగౌరవంతో కూడిన అద్భుతమైన అభివృద్థిని కెసిఆర్ చేసి చూపించారు. అన్ని చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా జీవం పోసుకుంటున్నాయ. మూడేళ్లలోనే 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కింది. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా చేయాలనే ముఖ్యమంత్రి ఆశయం త్వరలోనే నెరవేరుతుంది.

05/31/2017 - 23:02

టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ మూడేళ్ళలో ఒరగబెట్టింది ఏమీలేదు. మాటల ప్రభుత్వం అని తేలిపోయింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మాటల గారడీ చేస్తున్నారు. ఇంకా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ కాలం గడుపుతున్నారు. మీరు చేసిందేమిటో చెప్పాలని గట్టిగా నిలదీస్తే కేసులు పెడుతున్నారు లేదా తెలంగాణ ద్రోహులని విమర్శిస్తున్నారు.

05/31/2017 - 23:01

అటు రాష్ట్భ్రావృద్ధి.. ఇటు ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టిన కారణంగానే కెసిఆర్ నాయకత్వంలో పరిపాలన సజావుగా సాగిపోతోంది. అభివృద్ధి రాష్ట్ర రాజధానికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా వరంగల్, కరీనంగర్, నల్గొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఐటి రంగంలో ముందుకు దూసుకుపోతోంది.

05/31/2017 - 23:00

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మోసం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. ఈ మూడేళ్లలో 3500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాడేవారి గొంతులను నొక్కడమే కాకుండా గిట్టుబాటుధర కల్పించాలని అడిగిన రైతులకు టెర్రరిస్టుల మాదిరిగా సంకెళ్లు వేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నికల మ్యానిఫెస్టోను తుంగలో తొక్కారు. ప్రతి నియోజకవర్గంలో వందపడకల ఆసుపత్రిని మరిచిపోయారు.

05/31/2017 - 22:58

కెసిఆర్ అబద్దాలలో మేటిగా నిలుస్తున్నారు. ఎన్నికలకంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అటకెక్కించారు. అర్హులైన ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్నారు. ఈ మూడేళ్లలో రెండువేల ఎకరాలకు మించి పంపిణీ చేయలేకపోయారు.

Pages