S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

04/13/2017 - 03:12

వ్యవసాయం పండగలా మార్చేందుకు మేము (రాష్ట్రప్రభుత్వం) బృహత్‌ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సేద్యం రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతులు స్వశక్తిపై ఎదిగే విధంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాం. బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తున్నప్పటికీ, అసలు రుణాల అవసరం లేని విధంగా రైతులు ఆర్థికంగా ఎదిగేలా ఫకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం.

04/13/2017 - 03:04

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దేశవ్యాప్త సమస్యగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం పరిష్కారాలను అందించాల్సి వుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిలో వచ్చిన మార్పుల నేపథ్యంలో వ్యవసాయంలోకూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కరవు కాటకాలతో వ్యవసాయంలో పెనుమార్పులు వచ్చాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగం ప్రతిబంధకాలను ఎదుర్కొంటోంది.

04/13/2017 - 03:03

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రుణమాఫీ ప్రక్రియ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎటువంటి సమస్యలు లేని రాష్ట్రాలు సైతం చేపట్టలేని రుణమాఫీని విభజన వలన ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతంగా అమలుచేస్తున్నాం. దీనిద్వారా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకమైంది.

04/13/2017 - 03:02

రైతుల సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేక అనర్థాలు జరుగుతున్నాయి. గత ఏడాది ప్రకృతి సహకరించి వర్షాలు కురవడంతో రైతులు గట్టెక్కారు. కానీ ప్రభుత్వం తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాటలతో కడుపు నింపుతున్నారే తప్ప సాధించింది ఏమీ లేదు. ఎంత మంది రైతులకు రుణ మాఫీ (పూర్తిగా) చేశారో ప్రభుత్వాన్ని లెక్క చెప్పమనండి, వాస్తవాలు ఏమిటో బయటకు వస్తాయి.

04/13/2017 - 03:01

ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆరుగాలం శ్రమించే రైతు, అర్ధాకలితో అలమటిస్తున్నా, అర్ధాంతపు చావులకు పాల్పడుతున్నా, అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ప్రకృతి వైపరీత్యాలు, కరవు కాటకాలను ధైర్యంగా ఎదిరించి, పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కనీస గిట్టుబాటు ధర లభించని పరిస్థితి.

04/13/2017 - 03:00

రైతు అనేవాడు అన్నం పెట్టే విధంగా ఉండాలి. చేయిచాచే విధంగా ఉండకూడదు. ఎన్నికల సమయంలో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో అనేది తెలియకుండా గెలుపు అనే ప్రాతిపథికన ఇచ్చిన వాగ్ధానం వల్ల ఈ అనర్ధం వచ్చింది. గతంలో రైతులకు వడ్డీలేని రుణం ఉండేది. ఎన్నికల సమయంలో టిడిపి రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రుణమాఫీ చేస్తామంటే మాకు సంతోమే. దానికి మేం వ్యతిరేకం కాదు.

04/13/2017 - 02:59

తెలంగాణ కోటి ఎకరాల మాగాణగా మార్చాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోంది. గత పాలకులు తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కాకతీయుల కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన గొలుసు కట్టు చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత మొట్ట మొదటగా రైతాంగం పైనే ప్రభుత్వం దృష్టిసారించింది. మాటలు కాకుండా చేతల్లో చూపించింది.

04/13/2017 - 02:57

రైతులకు రుణమాఫీ హామీ ఇస్తే కచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిలుపుకోవాలి. లేదంటే రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. మన దేశంలోరైతాంగ సమస్యల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్ధాయిలో సమగ్రమైన విధి విధానాలు లేవు. వ్యవసాయానికి సాగునీరు లేదా సమృద్ధిగా భూగర్భజలాలు, ఉచిత కరెంటు ఉంటే రైతుల కష్టాలు ఒక మేరకు గట్టెక్కుతాయి. ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఉండాలి.

04/06/2017 - 04:27

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో రిజర్వేషన్ల అంశం మరోమారు విస్తృత చర్చకు కారణమైంది. ప్రభుత్వం ఎన్నికల ప్రలోభాలు పెడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ తీరుపై ఆంధ్రా దృష్టిపెట్టింది.

04/06/2017 - 04:27

మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. వీటివల్ల సామాజిక విభజన జరుగుతుంది. అదే తరుణంలో మతం మార్పిడులకు దారితీస్తుంది. ఇటువంటి రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తుంది. రిజర్వేషన్లు అనేవి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పరిమితం కావాలి. ఆన్ని రంగాల్లోను వివక్షకు గురైనవారు రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొంది, భవిష్యత్‌లో వారు ఎదిగేందుకు దోహదం చేస్తాయి.

Pages