S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/15/2017 - 23:10

గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ పాలనాపరంగా ప్రభుత్వాల్లో తలెత్తే సంక్షోభాలను నివారించాలి. గవర్నర్ అంటే రాష్ట్రాలకు రాజ్యాంగ సంరక్షకుడు. కాని ఇటీవల కాలంలో గవర్నర్ పదవి దుర్వినియోగమవుతోంది. రాజ్‌భవన్‌లో ఉండే గవర్నర్ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నడుచుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. తమిళనాడు సంక్షోభంలో గవర్నర్ పాత్రను శంకించలేం.

02/15/2017 - 23:08

ఏమైనా విపత్కర పరిస్థితుల్లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినపుడు లేదా ప్రజాస్వామ్యానికి ప్రమాదస్థాయిలో విఘాతం కలిగే సందర్భాల్లో రాష్ట్ర గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి సాధ్యమైనంత త్వరితగతిన సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాల్సి ఉంది. అపుడే ప్రజాస్వామ్యం పదికాలాలపాటు వర్థిల్లుతుంది. సాధారణంగా నాయకత్వ మార్పిడి దశలోనే వివాదాలు రచ్చకెక్కుతుండటం ఎంతోకాలంగా చూస్తున్నాం.

02/15/2017 - 23:06

రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొనడం సాధారణమే. అభివృద్ధి, విద్యుత్ కేటాయింపులు, జలాల పంపకం, పాలకులు, ప్రతిపక్షాల బలబలాలు వంటి అంశాలు సంక్షోభాన్ని సృష్టిస్తాయి. స్వయం ప్రతిపత్తితో నడిచే రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలతో రాజకీయ సంక్షోభం వస్తే.. ఆ రాష్ట్ర గవర్నర్ పూర్తి బాధ్యత వహిస్తూ, సంక్షోభానికి తెరదించే అవకాశం ఉంటుంది. అయితే అది రాజకీయాలకతీతంగా జరగాలి.

02/15/2017 - 23:17

తమిళనాడు రాజకీయ నాయకుల తప్పులకు గవర్నర్‌ను తప్పుపడుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు తమిళనాడులో సమర్థవంతమైన నాయకత్వం లేక గవర్నర్‌ను విమర్శిస్తున్నారు. జయలలిత మృతి తరువాత ఏఐఎడిఎంకే శాసనసభ్యుల్లో ఏకాభిప్రాయం లేదు. శశికళ నేరం చేసినట్టు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంవల్ల తమిళనాడుకు మంచే జరిగింది.

02/08/2017 - 21:26

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే అమెరికాలో ప్రవేశించే విదేశీ నిపుణులపై ఆంక్షలు విధించారు. దాంతో భారత్‌సహా పలు దేశాలు ప్రధానంగా ఐటి రంగంలో నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. అంతా ఇపుడు హెచ్-1బి వీసాల గురించే చర్చ జరుగుతోంది. వాస్తవానికి అమెరికా 40 రకాల వీసాలను జారీ చేస్తుంటుంది. అవికాకుండా మరికొన్ని స్పెషాలిటీ వీసాలుకూడా ఇస్తుంది.

02/08/2017 - 21:21

హెచ్1బి వీసాలపై ఆంక్షలు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆభిజాత్యానికి నిదర్శనం. అగ్రరాజ్యమైన అమెరికాకు మొదటినుంచి ఆసియా, ఆఫ్రికా ఖండాలంటే చిన్నచూపే. ట్రంప్‌కు ముందు తొలిసారి ఒక నల్లజాతీయుడు అమెరికా అత్యున్నతి పదవి అలంకరించడానికి కారణం కూడా ఇదే. ఇక అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి.

02/08/2017 - 21:19

అమెరికాలో జరుగుతున్న దాని కన్నా మీడియాలో ప్రచారం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ హడావుడి ఒకటి రెండు నెలల్లో సర్దుకుంటుంది. అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు మన వాళ్లకు ఎంత అవసరమో, అమెరికా కంపెనీలకు మనవాళ్లు కూడా అంతే అవసరం. సాంకేతిక నిపుణులను వదులుకునే పరిస్థితిలో అమెరికా కంపెనీలు లేవు. తాత్కాలికంగా ఆందోళన పరిస్థితిలు కల్పించినా, అంతా సర్దుకుంటుంది.

02/08/2017 - 21:17

అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ విధించిన, ఇంకా విధిస్తున్న ఆంక్షలను అన్ని పార్టీలూ రాజకీయాలకు అతీతంగా ఎదుర్కోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా బాధ్యత ఉంది. ఆంక్షలకు గురైన వివిధ దేశాల అధ్యక్షులతో, ప్రధానులతో కలిసి చర్చించాలి. అవసరమైతే దీనిని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకుని రావాలి. అమెరికాలో ఉగ్రవాదం నిర్మూలన పేరిట ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారు.

02/08/2017 - 21:14

హెచ్1బి వీసాలపై నెలకొన్న అనిశ్చితిపై విద్యార్థులు, ఐటిరంగ నిపుణులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెచ్1బి వీసాల జోలికొస్తే ఎక్కువ నష్టం వాటిల్లేది అమెరికాకె, హెచ్1బి వీసాలతో అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారిలో కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల నెలకొన్న అలజడి తాత్కాలికంగానే ఉంటుంది. హెచ్1బి వీసాలను వలసేతరవీసా సాంకేతిక నిపుణులకు ఇస్తారు.

02/08/2017 - 21:12

అమెరికా విధిస్తున్న ఆంక్షలపై మనదేశంలో అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఉపాధికోసం అమెరికా వెళ్లిన భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. హెచ్1బి వీసాపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.

Pages