S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/08/2017 - 21:10

వీసాలపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ పని చేస్తున్న మన దేశ ఐటీ ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చనే నిపుణులు చెబుతున్నారు. హెచ్-1బీ వీసాలతో ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇబ్బందేమి ఉండకపోవచ్చని చెబుతున్నారు.

02/08/2017 - 21:08

భారత్‌తోసహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన నిపుణులు, ఉద్యోగుల సేవలు, మేధావుల సేవలు అమెరికాకే అవసరం. అమెరికాకు వచ్చేవారికి సంబంధించిన హెచ్1-బి వీసాలపై ఎలాంటి నిషేధం విధించినా అది అమెరికాకు వచ్చే మేధావులకు వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం కలిగించదు. మేధావులు అమెరికా కాకపోతే ప్రపంచంలో తమకు అనుకూలమైన దేశానికి వెళతారు.

02/08/2017 - 21:04

వీసాల వల్ల భారత్‌కు నష్టమే. కానీ భారత్ ఏం చేయగలదన్నదే మనముందున్న ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలపై విధించిన ఆంక్షలు సరైనవికావు. దీన్ని అక్కడి కోర్టు కూడా సమర్థించలేదు. ట్రంప్ అమెరికా దేశాధినేతగా కొంతమేరకు డిగ్నిటీ మెయింటెన్ చేయాలి. అలాకాకుండా ఏడు దేశాల ప్రజలను నిషేధించడం ఆయన స్థాయికి తగింది కాదు.

02/02/2017 - 05:36

కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించింది. 21.47 లక్షల కోట్లతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్ధిక బిల్లును ఆమోదించడం, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర విధానాలను పక్కన పెట్టడం ఈ బడ్జెట్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అరికడతామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకానికి 48వేల కోట్ల కేటాయించారు.

02/02/2017 - 05:35

చాలా కాలంగా ఎదురుచూస్తున్న బడ్జెట్ వచ్చేసింది. అరుణ్‌జైట్లి బడ్జెట్ ఆశనిరాశల మధ్య కొనసాగింది. 21.47 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూనే ఉంది.

02/02/2017 - 05:34

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ నూటికి నూరు శాతం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టింది. 70 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో ఇంత విప్లవాత్మకమైన సాహసోపేతమైన బడ్జెట్ ఎవరూ ఇంత వరకూ ప్రవేశపెట్టలేదు. కొన్ని వర్గాలకు పన్నులు వేస్తే కొన్ని వర్గాలకు మినహాయింపు ఇవ్వడం అనేది ఎపుడూ సహజంగా జరుగుతుంది, అయితే దానికి భిన్నంగా ఏ ఒక్క వర్గంపైనా పన్నుల భారం పడకుండా ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

02/02/2017 - 05:32

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ రైతులకు వ్యతిరేకంగా, తెలంగాణకు అన్యాయం చేసేలా ఉంది. మన దేశం వ్యవసాయ రంగంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేయాలి. కానీ కేంద్రం మాటల బడ్జెట్‌లా చూపించింది. రైతులకు 10 లక్షల కోట్ల రుణాలు ప్రకటించినా, ఇది వాస్తవ రూపం దాల్చడం లేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో అనేక ఆంక్షలు పెడుతున్నారు.

02/02/2017 - 05:31

పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనాలు కల్పించిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయింపు అంశంగానీ, ప్రత్యేక హోదా అంశం గురించి గానీ బడ్జెట్‌లో పేర్కొనకపోవడంతో నిరాశపరచింది.

02/02/2017 - 05:30

వౌలిక వసతులు, గ్రామీణ రంగాలపై దృష్టి పెట్టడం, ద్రవ్య నియంత్రణ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు కార్పోరేట్ పన్ను రాయితీ లేదు. సామాన్య ఉద్యోగులకు ఆదాయపు పన్ను ఊరట కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో ఆహ్వానించదగిందే. విద్య ఆరోగ్యాల్ని పట్టించుకోలేదు. అవినీతి అంతానికి నిజమైన ప్రయత్నం చేయలేదు.

02/02/2017 - 05:28

ఆంధ్రాకు ప్రత్యేకహోదాలేదు. రైల్వే జోన్ లేదు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం దగా చేసింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామని విభజన బిల్లుకు మద్దతు ఇచ్చిన బిజెపి ఈ రోజు కుప్పిగంతులువేస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై స్పష్టమైనప్రకటన వస్తుందని ఈ రోజు ఎదురుచూశాం. కాని నిరాశ కలిగింది. బిజెపి, టిడిపి రెండు పార్టీలు రాష్ట్రప్రజలను వంచించాయి.

Pages