S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/02/2017 - 05:27

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ కార్పోరేట్ సంస్ధలకే పెద్ద పీట వేశారు. బడగు, బలహీనవర్గాలపై మరింత భారం మోపారు. బడ్జెట్‌లో ఏదీ స్పష్టత లేదు. సంపన్నులకు రాయితీలను కొనసాగించారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సంవత్సరానికి 5 లక్షలకు మించి ఆదాయం ఉన్నట్లయితే 20 శాతం ఆదాయ పన్ను చెల్లించాలని, 2.5 నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉన్న 5 శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుంది.

02/02/2017 - 05:27

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత గొప్పగా కానీ, అంత చెడ్డగానీ ఉందనలేం. పరిశ్రమలు స్థాపించేవారికి ప్రోత్సహంగా ఉంది. రైతాంగానికి అంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 30 శాతం నుంచి 25 శాతానికి పన్ను తగ్గింపు మంచి పరిణామం. రైతులకు బడ్జెట్‌లో ఇంకా ఎక్కువ కేటాయింపులు ఉంటాయని ఆశించినప్పటికీ ఇది నిరాశపర్చింది.

01/26/2017 - 02:21

రిజర్వేషన్లు అనేవి ప్రజల్లో కొన్ని వర్గాల వారికి ప్రభుత్వం కల్పించే మినహాయింపులు కేటాయింపుల కిందకు వస్తాయి. ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లో కులపరంగా, లింగపరంగా ప్రాంతాలపరంగా, శారీరక మానసిక లోపాలు, సైన్యంలో పనిచేసిన వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ రక్షణ కల్పించారు.

01/26/2017 - 02:21

ముస్లింలలో వెనుకబడిన వారికి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హామీని నెరవేర్చేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. మతపరమైన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో వెనకబడినవారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారని గుర్తించాలి.

01/26/2017 - 02:20

రాజ్యాంగం ప్రకారం దేశంలో ఏ మతమైనా, కులానికి చెందిన వారైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్నట్లయితే వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించాలి. ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నారు. కాబట్టే 1950 నుంచే రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం 70 నుంచి 80 శాతం ముస్లింలు విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.

01/26/2017 - 02:19

దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను రాజకీయ కోణంలో చూడరాదు. సమాజంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మైనార్టీ వర్గాల్లో ముస్లింలు, సిక్కులు, జైనులు ఇలా అనేక మతాలకు చెందిన వారు నేటికీ వెనుకబడి ఉన్నమాట వాస్తవమే. వారు ఇతరులతో పోటీపడే స్థాయికి ఎదిగే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. అందుకు రిజర్వేషన్లు దోహదపడగలవు.

01/26/2017 - 02:19

సమాజంలో అణగారిన, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రస్తుతం వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సదుపాయం ఉంది. వారి కోటాకు ఇబ్బంది లేకుండా ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాలి. మతపరమైన కోణంలో ఈ రిజర్వేషన్లను చూడరాదు. మతం అనేది కేవలం ఆధ్యాత్మికత, ఆచార వ్యవహారాలు, వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది.

01/26/2017 - 02:18

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. ఈ దేశంలో రిజర్వేషన్లు ఏ వర్గాలకు ఉండాలో రాజ్యాంగంలోనే అంబేద్కర్ ఖరారు చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఉన్న వర్గాలకు విద్యా, ఉద్యోగాలలోపాటు చట్టసభలకు కూడా రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఒబిసిలకు జాతీయస్థాయిలో, రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి.

01/26/2017 - 02:17

అన్ని రంగాల్లో ముస్లింలు వెనుకబడివున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యతే వెనుకబడటానికి ప్రధాన కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింలకు రిజర్వేషన్లు కలిస్తే అక్షరాస్యతశాతం పెంపొందడంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. కేవలం మత కలహాలు, ఇతరత్రా దేశాలపై ఉన్న అసాంఘిక కార్యకలాపాలు, స్థానిక ముస్లిం సోదరులపై దిద్దడంతో ముస్లింలపై ప్రజల్లో అపోహలున్నాయి.

01/26/2017 - 01:29

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో ఉన్న జనాభాలో ఉన్న 30 శాతం ముస్లింల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను ఏకంగా 12 శాతానికి పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం. వాస్తవానికి ముస్లింల అభివృద్ధి జరుగకుండా సమగ్ర తెలంగాణ అభివృద్ధి అసాధ్యం.

Pages