S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/12/2017 - 04:51

ప్రవేశపరీక్షల కాలం మొదలైంది. ఎల్‌కెజిలో ప్రవేశం మొదలు యుజి, పిజి, ఎంఫిల్, పిహెచ్‌డి వరకూ సామాజిక, వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో సీటు పొందాలంటే ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. రెగ్యులర్ పరీక్షలతోపాటు తదుపరి ఉన్నత చదువులకు మరో అదనపు ప్రవేశపరీక్ష రాయడం అనివార్యమైంది.

01/12/2017 - 04:50

విద్యావ్యవస్థలోనే సంస్కరణలు రావలసిన అవసరం ఏర్పడింది. పరీక్షలు, ప్రవేశపరీక్షలే కాదు, మానవీయ సమాజాన్ని నిర్మించేందుకు అవసరమైన మానవ వనరులను తయారుచేయడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయనేది ప్రస్తుత తరాన్ని చూస్తుంటే మనకు తెలిసిపోతోంది. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వస్తున్నారు. మంచి విద్యాసంస్థల్లో చదివిన కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి.

01/12/2017 - 04:48

నీట్ తరహాలో ఇంజనీరింగ్ ప్రవేశానికి కూడా కామన్ పరీక్ష అవసరం. నేడు విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటిఎస్‌లో చేరేందుకు జెఇఇ పరీక్ష రాయాల్సి వస్తుంది. ట్రిపుల్‌ఇ, జెఇఇ ఇతర రాష్ట్రాల్లో చేరడానికి ప్రిలిమినరీ పరీక్ష రాయాలి. ఇవి గాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆయా రాష్ట్రాల్లోని పలు విద్యా సంస్థలు రకరకాల పరీక్షలు నిర్వహిస్తున్నాయ.

01/12/2017 - 04:47

జాతీయ స్థాయిలో నీట్, ఐఐటి జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించడం వెనుక కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, ఆర్థిక భారం లేకుండా చూడాలన్నది నిర్దిష్టమైన లక్ష్యం.

01/12/2017 - 04:46

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు రాస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఏదో ఒక కోర్స్‌లో ఉత్తీర్ణులు అయినవారే. అయితే ఈ లక్షలాది మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించటాన్ని చూస్తే ప్రభుత్వం తను ఇచ్చిన డిగ్రీలను తనే గుర్తించనట్టు లెక్క. వాస్తవానికి ప్రభుత్వం గుర్తించిన విద్యాసంస్థలలో కోర్స్‌లను పూర్తిచేసిన వారికి విధిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదు.

01/12/2017 - 04:46

పరీక్షల గందరగోళానికి విద్యాసంస్కరణల విధాన నిర్ణేతలలో అస్పస్టతే కారణమనేది సుస్పష్టం. పరీక్షల్లో సంస్కరణలు కేవలం మార్పులకే పరిమితం కారాదు, ఆ మార్పులు నిజమైన కొత్త మార్గానికి బాటలు వేయాలి. ప్రవేశపరీక్షల్లో కొత్త పద్ధతి పెట్టడంతో సరిపోదు, కాని దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో ముఖ్యం. ఈ క్రమంలోనే జాతీయస్థాయిలో నీట్ పరీక్షను కేంద్రం ప్రవేశపెట్టింది.

01/12/2017 - 04:45

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎంట్రన్స్ పరీక్షల్లో తప్పులు దొర్లుతున్నాయి. గందరగోళ పరిస్థితులు నెలకొని మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. పరీక్షల నిర్వహణలో తరచూ గందరగోళం నెలకొనడం, ఆ ఎంట్రన్స్‌లు వాయిదాలు పడుతుండడంతో మెరిట్ విద్యార్థులు మానసికంగా కృంగిపోతున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పొరపాట్లు జరగవు, తప్పలు దొర్లవు.

01/12/2017 - 04:44

వైద్యం, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి జాతీయస్థాయిలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి. మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు కామన్ సిలబస్, కామన్ ఎంట్రన్స్ టెస్టులను నిర్వహించి ప్రవేశాలు కల్పించాలి. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యావిధానం చదుకు‘కొనే’వారికే ఉపయోగకరంగా ఉంది తప్ప బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందుబాటులో లేదు.

01/12/2017 - 04:44

ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్ల నియంత్రణకు ఒక రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. కోచింగ్ సెంటర్లు ప్రజలనుంచి డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రతి ప్రవేశపరీక్షకు కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లు అడ్డూ అదుపులేకుండావిస్తరిస్తున్నాయి. దీనివల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు దెబ్బతింటున్నారు.

01/12/2017 - 04:43

వైద్య విద్యార్థులకు ఒకే టెస్టు ఉంది. అందుకు ‘నీట్’ నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే స్థాయిలో ఇంజనీరింగ్ పరీక్ష విధానం కూడా కొనసాగితే బాగుండేది. మెడికల్‌కు ఒకే టెస్టు, కాగా ఇంజనీర్‌కు దాదాపు పది టెస్టులుంటాయి. ఇంజనీరింగ్‌కు అర్హత పరీక్ష మాటున పలు కళాశాలలు పలు రకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

Pages