S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

01/07/2017 - 23:17

* ధోనీ 2004లో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 24న చిట్టగాంగ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. ఫిఫ్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ అప్పటికే క్రీజ్‌లో ఉన్న మహమ్మద్ కైఫ్‌ను రక్షించే ప్రయత్నంలో తాను రనౌటయ్యాడు.

01/05/2017 - 09:16

తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు భిన్నంగా స్పందించారు. గెజిటెడ్ అధికారుల సంఘం ఒక రీతిన, మిగిలిన ఉద్యోగ సంఘాల నాయకులు వేరేరీతిన స్పందించారు. ఆంధ్రాలోనూ తెలంగాణ మాదిరి జోనల్ వ్యవస్థ రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది.

01/05/2017 - 09:14

జోనల్ విధానాన్ని రద్దు చేయాలనుకోవడం అనాలోచిత చర్య. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా అంతరాలు ఉన్నాయి. జోనల్ విధానాన్ని తీసి వేయడంతో అనారోగ్యకరమైన పోటీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పూర్తిస్థాయి న్యాయం జరగదు.

01/05/2017 - 09:11

రాష్ట్ర విభజనతోనే అనధికారికంగా జోనల్ విధానం రద్దయినట్టు. మల్టీ జోనల్ పోస్టులు, జోనల్ పోస్టులు, జిల్లా పోస్టులు, రాష్ట్ర పోస్టులు అంటూ నాలుగు వ్యవస్థలు ఉండేవి. రాయలసీమతో కలిపి ఇంటర్ జోనల్ పోస్టులు ఉండేవి. రాష్ట్ర విభజనతో ఇంటర్ జోనల్ పోస్టులు వ్యవస్థ రద్దయింది. మల్టీ జోనల్, జోనల్ వ్యవస్థలో ఒకటి రద్దయింది. ఇంకొటి ఉంది. నాలుగు అంచెల వ్యవస్థ స్థానంలో రెండు అంచెల వ్యవస్థ ఉండాలి.

01/05/2017 - 09:11

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారికి ఉద్యోగ నియామకాలలో అన్యాయం జరుగకుండా జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఇంకా జోనల్ వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం లేదు. అలాగని జోనల్ వ్యవస్థ రద్దువల్ల తిరిగి రాష్ట్రంలో మరెవరికీ అన్యాయం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

01/05/2017 - 09:10

జోనల్ వ్యవస్థను రద్దుచేయడం మంచిది కాదు. ఈ విధానాన్ని రద్దు చేయడాన్ని మానుకుని, ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు, చేర్పులు చేయాలి. ఉద్యోగులు ఎవరూ జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని అడగలేదు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ హయాంలో తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగింది.

01/05/2017 - 09:10

ఉద్యోగ నియామకాలు, విద్యా రంగంలో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975కు ముందు వచ్చిన ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని ఆరు జోన్లు చేశారు. ఇప్పుడు 371-డి అమలులో ఉంది. రాష్ట్ర విభజన జరిగినా 371-డి బంధం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచుతోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుంది. అంటే 2024 తర్వాతనే జోనల్ వ్యవస్థకు చరమగీతం పాడే అవకాశం ఉంటుంది.

01/05/2017 - 09:09

జోనల్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, చట్టబద్ధతతో శాస్ర్తియంగా అమలు జరగాలి. జోనల్ వ్యవస్థ, ముల్కి రూల్స్, 6.5 ఫార్ములా అనేది ఉద్యోగులు, ఉపాధితో కూడిన సమస్య. ఇది ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమస్య కాదు. రాష్ట్ర విభజన తరువాత జోనల్ వ్యవస్థను నాలుగు భాగాలుగా విభజించారు.

01/05/2017 - 09:09

ప్రాంతీయ అసమానతలు పూర్తిగా తొలగేవరకు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్ల వ్యవస్థ కొనసాగి తీరాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు చరమగీతం పాడారంటూ ఇక్కడ కూడా అదే విధానం కొనసాగించే ప్రయత్నం ఎంతమాత్రం సహేతుకం కాదు. నదీతీర ప్రాంతాల్లో పుష్కలంగా ఆర్థిక వెసులుబాటు ఉండటంతో ఆ ప్రాంతంలో విద్య, సాంస్కృతిక, కళారంగాలతోపాటు నాగరికత పరిఢవిల్లుతూ వచ్చింది.

01/05/2017 - 09:08

రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ కొనసాగించడం శ్రేయస్కరం. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో మేలు కలుగుతుంది. జోనల్ వ్యవస్థ వల్ల వెనుకబాటుతనం తగ్గుతుంది. ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి. జోనల్ వ్యవస్థలో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్, ఇతర ప్రాంతాల వారికి 20 శాతం కోటా లభిస్తుంది. దీనివల్ల ఉద్యోగాల ఎంపికలో ఆ ప్రాంతంలో నివసించే అభ్యర్థులకు మధ్య పోటీ ఉంటుంది. సీనియారిటీ కూడా అదే పద్ధతిలో నిర్ణయిస్తారు.

Pages