S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/28/2016 - 21:59

పెద్ద నోట్లు రద్దయిన తర్వాత దేశవ్యాప్తంగా నల్లధనం పెద్దఎత్తున వెలుగు చూస్తోంది. ఆదాయ పన్ను శాఖ ఇంతవరకూ నిర్వహించిన 734 సోదాలు, దాడుల్లో 3300 కోట్ల రూపాయిల నల్లధనం గుర్తించారు. ఇందులో 92కోట్లు కొత్త కరెన్సీ కావడం విశేషం. దీనికి సంబంధించి 3200 మందికి నోటీసులు జారీచేశారు. దీంతో పెద్దనోట్లను రద్దు చేయడంద్వారా నల్లధనాన్ని అదుపు చేస్తామని కేంద్రం చెప్పిన మాటలకు ఊతం లభిస్తోంది.

12/28/2016 - 21:53

పెద్ద నోట్లు రద్దు నాటి ఇబ్బందులు నేడు లేవు.. పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొంత మేరకు ప్రజలు ఇబ్బందులకు గురైనప్పటికీ, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం విజయవంతమైందనే చెప్పవచ్చు. నవంబర్ 8న రద్దయిన నోట్ల ప్రభావం చిన్న వ్యాపారులపై పడింది వాస్తవమే. కానీ ఓ పక్షం రోజుల్లో ప్రజలు అలవాటు పడిపోయారు. ఇక పెద్ద వ్యాపారస్థులు ఎప్పటికీ వారి లక్ష్యాలు, లావాదేవీలు పెద్దఎత్తునే ఉంటాయి.

12/28/2016 - 21:52

నల్లధనం వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు ఏమాత్రం ఉపయోగపడదు. పైగా ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోంది. నల్లధనం అనేది ఎంత ఉన్నదన్న విషయంలో ఇప్పటివరకు ఖచ్చితమైన లెక్కలు లేవు. అసలు నల్లధనం ఏ రూపంలో ఉందో కూడాతెలియదు. రూపాయల కట్టలను ఎవరూ కుండల్లోనో, మరోచోటనో దాచరు. ఈ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటారు.

12/28/2016 - 21:51

పెద్ద నోట్లు రద్దు చేయడంలో ప్రధాని మోదీ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రధాని ఆశించిన రెండు అంశాలు అరికట్టలేకపోయారు. ధనవంతులు సంతోషంగానే ఉన్నారు. సామాన్య ప్రజలే ఇక్కట్లకు గురవుతున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో నల్లధనం వెలికితీస్తానని, ఉగ్రవాదాన్ని అరికడతానని ప్రధాని భరోసా ఇచ్చారు. దీనికి ప్రజాస్వామ్యంలో ‘నో’ అనే వారు ఎవరూ ఉండరు. ఆ రెండు అంశాలను మేమూ సమర్థిస్తున్నాం.

12/28/2016 - 21:50

బ్లాక్ మనీ కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పదునైన చట్టాలు ఉండాలి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఈ దిశగా ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోలేదు. రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు నల్లధనం కలిగి ఉన్నవారిపై ఉక్కుపాదం మోపాలి. ప్రస్తుతం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం బయటపడుతుందన్న ఆశ పెద్దగా లేదు.

12/28/2016 - 21:49

నల్లధనం నియంత్రణలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఒక ప్రయత్నం మాత్రమే. ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగాలన్న లక్ష్యంతోనే ప్రధాని నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దుతో ఇప్పటివరకూ చెలామణిలో ఉన్న నగదు రూ.16.5 లక్షల కోట్లలో రద్దయిన పెద్దనోట్లే అధికం. మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీలో పెద్దనోట్లది 86 శాతం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్దనోట్లు బ్యాంకుల్లో జమవుతున్నాయి.

12/28/2016 - 21:47

పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం వెలుగులోకి వస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. అయతే ఆ తర్వాత తీసుకుంటున్న చర్యలు ఆశావహం గానే ఉన్నప్పటికీ, ఏ మేరకు ఫలితాలిస్తాయో తెలియదు. అయతే ఏమాత్రం ముందస్తు ఆలోచన లేకుండా పది మంది అభిప్రాయాలను తెలుసుకోకుండానే నోట్ల రద్దుపై తొందరపాటు చర్యలు తీసుకున్నారు.

12/28/2016 - 21:46

ప్రధానమంత్రి నల్లధనంపై యుద్ధ ప్రకటించారు. ఇది ఎంత కాలం సాగుతుందో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పలేం. అయితే ప్రపంచంలో ఎవరికీ లేనంత సహనం మనవారికి ఉందని చెప్పవచ్చు. నోట్ల రద్దుపై ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డా, సహనంతో భరిస్తున్నారు. చదువుకున్నవారు, చదువులేనివారు, పేదలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా దేశంలోని ప్రజలంతా చాలా సహనంతో ఉన్నారు.

12/22/2016 - 09:07

పనె్నండవ పంచవర్ష ప్రణాళిక నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలో కనీసం 1500 యూనివర్శిటీల అవసరం ఉందని తేల్చింది. ప్రస్తుతం దేశంలో అన్ని రకాల యూనివర్శిటీలు కలిపి 777 ఉన్నాయి. వీటిలో సెంట్రల్ యూనివర్శిటీలు 47, స్టేట్ యూనివర్శిటీలు 356, డీమ్డ్ వర్శిటీలు 122, ప్రైవేటు యూనివర్శిటీలు 252 ఉన్నాయి. దేశంలో 39 రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీలున్నాయి.

12/22/2016 - 09:04

ప్రైవేటు యూనివర్సిటీలు అనివార్యం. మనం కావాలన్నా, వద్దన్నా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏదో ఒక రూపంలో వస్తాయి. దేశంలో 25 రాష్ట్రాలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తున్నారు. 30 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చారు.

Pages