S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

12/15/2016 - 00:11

తలాఖ్ అనే ఒక పదంతో ఒక వివాహ బంధం విచ్ఛిన్నం కావడం అనేది అత్యంత అనాగరికం. ఇది ముస్లిం మతంలో కూడా ఇలాంటి అనాగరికమైన చర్య లేనేలేదు. అయితే అన్ని మతాలలో ఉన్నట్టుగానే ముస్లిం మతంలో కూడా కొంతమంది పురుషాధిక్య భావజాలంతో సృష్టించిందే తలాఖ్ దురాచారం. ఇస్లాం మతం కూడా స్ర్తికి సుముచిత గౌరవాన్ని ఇచ్చింది. స్ర్తిలను బాధించడం కానీ, వారిపై దాడి చేయవద్దనే ఇస్లాం చెప్పింది.

12/15/2016 - 00:10

మనదేశంలో స్వాతంత్య్రం రాక పూర్వం 1937 నుంచే ‘ముస్లిం పర్సనల్ లా’ అనేది అమలులో ఉంది. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరూ ఖురాన్, మొహమ్మద్ ఆదేశాలనే పాటిస్తారు. వేరే మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. దేవుడికి అత్యంత అయిష్టమైనది ‘తలాఖ్’. అందరూ భావిస్తున్నట్లు భర్త మూడుసార్లు భార్యకు తలాఖ్ చెప్పగానే విడాకులు అమలైపోవడం షరియా పద్ధతి కాదు.

12/15/2016 - 00:10

త్రిపుల్ తలాఖ్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదు. భారతదేశం లౌకిక దేశం. ఈ దేశంలో మతపరమైన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సముచితం కాదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నాను. హిందువులకు గీత, క్రిస్టియన్లకు బైబిల్ ఎలా ప్రామాణికమైందో ముస్లింలకు ఖురాన్ అలాంటిదే. ముస్లిం మహిళలకు హక్కులు, బాధ్యతలను కూడా ముస్లింపర్సనల్ లా కల్పిస్తోంది.

12/15/2016 - 00:09

ముస్లిం పర్సనల్ లా విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలనుకోవడం సమంజసం కాదు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాఖ్‌పై చర్చ జరుగుతున్నది. తాజాగా అలహాబాద్ హైకోర్టు ట్రిపుల్ తలాఖ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మీడియాలో చూశాం. అంతకుముందు ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తూ కొంతమంది ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించారు. ముస్లింలలో నూటికి 99 శాతం మంది ట్రిపుల్ తలాఖ్‌ను సమ్మతిస్తారు.

12/15/2016 - 00:08

తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్రిపుల్ తలాఖ్‌లు జరుగుతుంటాయి. ముస్లింలలో ట్రిపుల్ తలాఖ్ చాలా ఎక్కువగా జరుగుతుంటుందనే దురభిప్రాయం చాలామందిలో ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి ఉండాలన్న వాదన ఉంది. మరోవైపు తాజాగా అలహబాద్ హైకోర్టు కూడా ట్రిపుల్ తలాఖ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. నిజానికి ముస్లింలలో తలాఖ్ జరగడం చాలా తక్కువగా ఉంటుంది.

12/15/2016 - 00:07

ముస్లిం సమాజంలో మహిళలు ఎదుర్కొనే అన్ని సమస్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు పరిష్కారాలు చూపిస్తోంది. ముస్లింల వివాహాలపై, విడాకులు, తదితర అంశాలపై రాజ్యాంగంలో చేర్చలేదు. షరియత్ చట్టంలోని అంశాలను భారతదేశంలోని ముస్లింలు మొదటినుంచీ పాటిస్తున్నారు. మత ధర్మంలో భాగమైన ఈ మార్గదర్శకాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు పర్యవేక్షిస్తోంది. కొన్ని శతాబ్ధాలుగా ఎప్పుడూ ఎటువంటి సమస్యలు తలెత్తలేదు.

12/15/2016 - 00:06

‘త్రిపుల్ తలాఖ్’ అంశంలో అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గదే. వాస్తవం చెప్పాలంటే మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైంది. కోర్టులు రాజ్యాంగానికి లోబడే తీర్పులు ఇస్తుంటాయి. అందువల్ల హైకోర్టు ఇచ్చిన తీర్పు శిరోధార్యమే. సాంకేతికంగా అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సునీత్ కుమార్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు విస్తృత ధర్మాసనానికి లేదా ఉన్నత కోర్టుకు వెళ్లవచ్చు.

12/15/2016 - 00:05

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదు. తలాఖ్ ఒక మతానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలో అన్ని మతాలకు, అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ హక్కులుండవు. అవి మనం రూపొందించుకున్నవే. అనాదిగా వస్తున్న మత ఆచారాలు, సంప్రదాయాలను ఆయా వర్గాల ప్రజలు ఎవరూ వదులుకోరు. సివిల్ కామన్ కోడ్ పేరుతో ట్రిపుల్ తలాఖ్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్లాంపై కుట్ర పన్నుతోంది.

12/08/2016 - 08:22

దేశంలో వివిధ కోర్టుల్లో 2.28 కోట్ల కేసులు పెండింగ్‌లో

ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ అధికారికంగా వెల్లడించింది.

దేశంలో జనాభా- న్యాయమూర్తుల నిష్పత్తి కూడా

ఆశావహంగా లేదని, సగటున ప్రతి పది లక్షల జనాభాకు

13 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కేంద్ర న్యాయశాఖ

పేర్కొంది. ఐక్యరాజ్య సమితి అధ్యయనం జరిపిన 65

దేశాల్లో ఇంతకన్నా తక్కువ నిష్పత్తిలో జడ్టీలున్న దేశాలు

12/08/2016 - 08:20

దేశంలోని కోర్టుల్లో, మరీ ముఖ్యంగా హైకోర్టులు,

సుప్రీంకోర్టులో సమర్థత, నిబద్ధత కలిగిన వారినే

న్యాయమూర్తులుగా నియమించాలి. ఇందుకోసం

న్యాయవ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ సంయుక్తంగా నిర్ణయం

తీసుకోవాలి. సమర్థత లేనివారిని నియమిస్తే ఎలాంటి

ఉపయోగం ఉండదు. కొంతమంది జడ్జీలు తమ పదవీ

కాలంలో ఒక్క తీర్పు కూడా ఇవ్వకుండా పదవీవిరమణ

Pages