S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/30/2017 - 08:27

అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించడంతో అందరి దృష్టీ మళ్లీ ఈ అంశంపైకి మళ్లింది. ‘రామజన్మభూమి-బాబ్రీ మసీదు’ అంశం భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి కూడా సిద్ధమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు.

03/30/2017 - 08:25

సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా నిలిచిన అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలంటూ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసిన సూచన ఆహ్వానించదగ్గ శుభ పరిణామం. ఇలాంటి జటిల సమస్యను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగల్గితే ఇలాంటి వివాదాల పరిష్కారంలో భారతదేశం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలువగలదు. అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అనేది ఎవరి విశ్వాసం వారిది.

03/30/2017 - 08:25

అయోధ్య వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కారించుకొనే ప్రయత్నం ఇది మొదటి సారికాదు. గతంలో ప్రయత్నాలు జరిగాయి, ఫలించలేదు. ఇప్పుడు కూడా అంతే.. చర్చలతో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. చంద్రశేఖర్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు చర్చలద్వారా ఆయోధ్య సమస్యను పరిష్కరించుకోమని సూచించారు.

03/30/2017 - 08:24

రామాలయం అంశంలో న్యాయస్థానం వెలుపల పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పడం ఒకవిధంగా మంచి పరిణామంగానే భావించాలి. దేశ సమైక్యత విషయంలో తామంతా ఒకటిగానే వ్యవహరిస్తామని హిందువులు, ముస్లింలు ప్రపంచానికి చాటి చెప్పడానికి దీనిని సదవకాశంగా తీసుకోవాలి. అయోధ్య సున్నితమైన అంశం కావడంతో ఇరువైపుల నుంచి ఎలాంటి భావోద్వేగాలకు లోనుకాకుండా సహృద్భావంతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది.

03/30/2017 - 08:23

ఆలయ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. దేశంలో భిన్న జాతులు, మతాలు ఉన్నప్పటికీ అంతా మానవజాతి అనే భావనతో ముందుకురావాలి. ఏ ఒక్క మతం గాని, రాజకీయ పార్టీగాని మొండిపట్టు పట్టరాదు. అన్ని మతాల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఓ వేదికపైకి వచ్చి మంచి వాతావరణంలో ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాంటపుడే భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడికి సార్థకత కలుగుతుంది.

03/30/2017 - 08:23

ప్రజల మధ్య ఏవైనా సమస్యలు వచ్చినా, మతపరమైన అంశాల్లో సామాజికంగా తేల్చలేకపోయిన సమస్యలు న్యాయ వ్యవస్థ ముందుకు వచ్చే సందర్భాల్లో న్యాయ వ్యవస్థ బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అయోధ్య అంశంపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడంలో ఉన్నత న్యాయస్థానం విఫలమైంది. కోర్టు వెలుపల పరిష్కరించుకోండంటూ సమాజంపైకి సమస్యను నెట్టివేసింది.

03/30/2017 - 08:22

బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవడం సాధ్యం కాని పని..న్యాయ స్థానంలోనే దీనిని పరిష్కరించడం శ్రేయస్కరం. ఏ వర్గమూ, పక్షమూ వ్యతిరేకించినా ఆ వివాదం కాస్తా మళ్ళీ కోర్టులోనే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎప్పటికైనా తిరిగి తిరిగి మళ్ళీ కోర్టుకు రావాల్సిన పరిస్థితే..దీనికి బదులు ఇపుడే కోర్టులో పరిష్కరించుకుంటే మేలని నా అభిప్రాయం.

03/30/2017 - 08:22

మందిర వివాదాన్ని కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఇలాగైతే పంచాయితీ ఎప్పటికీ తెగదు... ఎందుకంటే లోగడ పలు పర్యాయాలు ఇరు పక్షాలు కూర్చొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇన్ని సంవత్సరాలు కోర్టులో కేసు ఉన్నందున, ఇరు పక్షాలను సంతృప్తిపరిచే విధంగా తీర్పు వస్తుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురు చూశారు.

03/30/2017 - 08:21

దశాబ్ధాల తరబడి భారతీయ సమాజంలో పరిష్కరించేందుకు వీలులేకుండా చిక్కుముడి పడిన అయోధ్య రామజన్మభూమి అంశంపై సుప్రీం కోర్టు స్వయంగా తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. కోర్టు వెలుపల పరిష్కారానికి చొరవ తీసుకుంటే మధ్యవర్తిత్వంకు సిద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు వెలుపల అత్యంత సున్నితమైన ఈ అంశానికి పరిష్కారం లభించడం అసాధ్యం.

03/30/2017 - 08:21

రామాలయ నిర్మాణం సమస్యను కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే తాము మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న సుప్రీం కోర్టు సలహా సరైంది కాదు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. నాటినుంచి ఏళ్లతరబడి కోర్టులో ఉన్న కేసును సుప్రీం కోర్టే స్వయంగా తీర్పునిస్తే బాగుంటుంది. సున్నితమైన ఈ అంశాన్ని కోర్టు వెలుపల పరిష్కారం లభించడం సాధ్యం కాదన్నదే నా అభిప్రాయం.

Pages