S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/23/2016 - 22:05

ముందు చూపు లేకుండా, సంస్కరణలు తేకుండా పెద్ద నోట్లను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో మట్టికరిపిస్తారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక అంతిమకాలం దాపురించింది. అధికార గర్వంతో దేశంలోని ప్రజలను ఇబ్బందుల పాలు చేశారు. నల్లధనాన్ని అరికట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు.

11/23/2016 - 22:04

నల్లధనం నిర్మూలనకు, జమలేని సొమ్మును నిరోధించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ జీవితం అస్తవ్యవస్తమైంది. కొత్తలో పెద్దనోట్ల రద్దును ఆహ్వానించిన వర్గాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో 75 శాతం మంది వ్యవసాయం మీధ ఆధరాపడి జీవిస్తుంటారు. వీరిలో చాలా మందికి అకౌంట్లు లేవు. ఒకవేళ ఉన్నా, వాటిల్లో కష్టార్జితం ఉంటుంది.

11/23/2016 - 22:03

పాత నోట్లను మార్చుకోవడానికి వెళ్లిన సామాన్య ప్రజలపై బ్యాంకులు సిరా చుక్కలు పెట్టినట్టుగా బడా బాబులకు ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్నకు కేంద్ర జవాబు చెప్పాలి. నోట్ల రద్దుకు నల్లధనాన్ని అరికట్టడమే కారణం అయితే సామాన్య ప్రజలను మాత్రమే కేంద్రం దొంగలుగా ఎందుకు చూస్తోందో సమాధానం చెప్పాలి.

11/23/2016 - 22:02

పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. కానీ ముందస్తు చర్యలేమీ తీసుకోకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేయడం, నకిలీ కరెన్సీని అరికట్టగలగడమే. పెద్దనోట్ల రద్దుకు ముందే ప్రత్యామ్నాయంగా ఎటిఎం, బ్యాంకుల్లో సరిపడు కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకొని పాత కరెన్సీ రద్దు ప్రకటన చేస్తే బాగుండేది.

11/23/2016 - 22:02

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందికి గురికాకుండా చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజలకోసం పనిచేయాల్సినవే. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ, ఈ నిర్ణయం వెలువడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

11/16/2016 - 23:35

నోట్ల పాట్లు ఇప్పట్లో తీరేలా లేదు. కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో పాత 500, వెయ్యి రూపాయల నోట్లను అకస్మాత్తుగా రద్దు చేయడంతో పాటు ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు, తిరిగి నగదు తీసుకునేందుకు ఆంక్షలు విధించడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

11/16/2016 - 23:33

నల్లధనాన్ని వెలికితీసేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు, ఉగ్రవాదులను కట్టడి చేసేందుకే రూ.500, వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై ప్రజల్లో భయాందోళన అక్కర్లేదు. నోట్ల రద్దు వెనుక అతి పెద్ద కార్యాచరణ ఉంది. రద్దు వ్యవహారాన్ని ముందుగా చెప్పలేదని చాలామంది అంటున్నారు, అదే జరిగితే లక్ష్యం నెరవేరదు. అవసరమైనంత కొత్త కరెన్సీ అందుబాటులో ఉంది.

11/16/2016 - 23:32

పెద్ద నోట్లను రద్దు చేసే సమయంలో ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవలసింది. నిర్ణయాన్ని మేం వ్యతిరేకించడం లేదు, అమలు చేసిన విధానం బాగాలేదు. 120 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో హఠాత్తుగా నోట్లు చెల్లవు అని ప్రకటించడంతో పేదలు, సామాన్యులు, దినసరి కూలీలు ఎలా బతుకుతారు అనే కోణంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదు. 86శాతం డబ్బు 500, 1000 నోట్ల రూపంలోనే ఉందని కేంద్రమే ప్రకటించింది.

11/16/2016 - 23:31

నల్లధనాన్ని నిర్మూలించేందుకు ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. నల్లధనం నిర్మూలించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తూనే, సామాన్యులకు ఎటువంటి ఇక్కట్లు కలగకుండా చర్యలు తీసుకుంటే బాగుండేది.

11/16/2016 - 23:30

ఉన్నఫళంగా 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారింది. ధనవంతులు, బ్లాక్‌మనీ ఉన్నవాళ్ళు ముందుగానే జాగ్రత్త పడినట్లు వార్తలు వస్తున్నాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అకస్మాత్తు నిర్ణయాలవల్ల అనర్థాలు సంభవిస్తాయి. ఏమి ఘనకార్యం సాధించాలని ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదుకానీ, సామాన్యులు నలిగిపోతున్నారు.

Pages