S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/10/2016 - 07:55

ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందినా అక్కడ నివసిస్తున్న మన దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మనదేశం నుంచి వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవలను ఆ దేశం ఉపయోగించుకుంటున్నది. ట్రంప్ ఎన్నికైతే భారత్‌కు చెందినవారిని వెనక్కి పంపిస్తారేమోనన్న అనుమానపు నీడలు అలుముకున్నాయి. అదంతా దుష్ప్రచారమే. అలాచేస్తే అమెరికా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మన భారతీయులే అనేక రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

11/10/2016 - 07:54

ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు కీలకభూమిక పోషిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల (యుఎస్‌ఎ) అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికైనా భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వకతప్పదు. గతంలో ఆహారం, వాణిజ్యం, వ్యాపారం, శాస్తస్రాంకేతిక రంగాలతోపాటు ఇతర అంశాల్లో చేయూత కోసం అమెరికా వెంట భారత్ పడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ వెంట అమెరికా పడాల్సి వస్తోంది. బలమైన శక్తిగా భారత్ మారడమే ఇందుకు కారణం.

11/10/2016 - 07:53

బహుళ జాతి సంస్థలు ఎన్ని పెరిగినా, అవి ఎంత లాభాలు గడించినా, సాధారణ ప్రజల సంపద పెరగనిదే ఎవరిలోనూ సంతృప్తి మిగలదు. అమెరికా సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి, అసమానతలతో అసంతృప్తి పెరుగుతోంది, ఉన్నవారు, లేనివారనే అసమతుల్యతలు పెరిగిపోయాయి. కొద్ది మంది శ్రీమంతులు మహాశ్రీమంతులు అవుతున్నారు. మిగిలిన వారు భారతీయ సమాజం మాదిరి ఇబ్బందుల్లోనే ఉంటున్నారు.

11/10/2016 - 07:53

భారత దేశానికి అమెరికా అవసరం కన్నా. అమెరికాకు భారత్ అవసరమే ఎక్కువగా ఉంది. అమెరికా ప్రాభవం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అదే సమయంలో వర్థమాన దేశంగా ఉన్న చైనా ప్రభావం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో అమెరికాకు ఇండియా స్నేహం అవసరం. అమెరికా ఎన్నికల పట్ల సహజంగా భారత్‌లో చాలా ఆసక్తి కనిపిస్తుంటుంది.

11/02/2016 - 21:51

ఉమ్మడి పౌర స్మృతి (కామన్ సివిల్ కోడ్) పై మరోమారు బహిరంగ చర్చ జరుగుతోంది. కామన్ సివిల్ కోడ్ అమలు చేసే విషయంలో సూచనలు ఇవ్వాలని లా కమిషన్ ప్రజలకు బహిరంగ ప్రశ్నావళి విడుదల చేయడంతో మరో మారు ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను రాజకీయ అస్త్రంగా విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి.

11/02/2016 - 21:50

దేశంలోని అన్ని కులాలు, మతాలవారికీ ఒకే విధమైన చట్టం ఉండాలి. ఉమ్మడి పౌరస్మృతి (కామన్ సివిల్ కోడ్) లేకపోవడం వల్ల ముస్లిం మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. కేవలం మూడు పర్యాయాలు ‘తలాఖ్’ అని నోటి మాటగా చెప్పేసి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్న భార్యను వదిలించుకోవడం అనేది చాలా దారుణం. అలా ‘తలాఖ్’ పొందిన మహిళ ఆ తర్వాత ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. ఆమె సమాజంలో ఎలా బతకగలదు.

11/02/2016 - 21:48

ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) తీసుకువస్తే మంచిదే కాని ఇది ఏ మతాచారాలకు వ్యతిరేకంగా ఉందన్న భావన ప్రజల్లో రాకూడదు. ఒక మతాచారాల్లో ప్రభుత్వం తలదూర్చడం మంచిది కాదు. ఒకే దేశం.. ఒకే చట్టం అనడంలో తప్పు లేదు. కాని మనది లౌకికరాజ్యం. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లో మతస్వేచ్ఛ ప్రధానమైంది. మతాలకు సంబంధించి ప్రజలకు కొన్ని విశ్వాసాలుంటాయి.

11/02/2016 - 21:46

రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి ఉండాల్సిందే. మతం, కులం, స్ర్తి, పురుష అనే వివక్ష లేకుండా ఉమ్మడి పౌర స్మృతి ఉండాలి. హిందూ మతంలో సైతం అభ్యంతరకరమైన అంశాలు ఎన్నో ఉండేవి. అప్పటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్ అభ్యంతరం చెప్పినప్పటికీ జవహర్‌లాల్‌నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ లాంటివారు అందరికీ సమాన హక్కులు ఉండే విధంగా చట్టాలు చేశారు.

11/02/2016 - 21:45

కామన్ సివిల్ కోడ్ ముస్లింలకు సమ్మతం కాదు. మన చేతికి ఉన్న ఐదు వేళ్లు సమానంగా లేనప్పుడు ఉమ్మడి పౌరస్మృతి ఉండాలనుకోవడం సమంజసం కాదు. ఇకపోతే ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘ట్రిపుల్ తలాఖ్’పై చర్చ జరుగుతున్నది. ట్రిపుల్ తలాఖ్‌ను వ్యతిరేకిస్తూ కొంతమంది ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించారు. కానీ వారు ముస్లిం మహిళల్లో ఒక్క శాతం కూడా ఉండరు. నూటికి 99 శాతం మంది ట్రిపుల్ తలాఖ్‌ను సమ్మతిస్తారు.

11/02/2016 - 21:44

భారతదేశం లౌకిక రాజ్యం. ఈ దేశంలో భిన్నమతాలు, విభిన్న కులాలు, జాతులు, అనేక బాషలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. దేశం లౌకికదేశం కావడం వల్ల భారత రాజ్యాంగమే అన్ని చట్టాలకన్నా ఉన్నతమైంది. లింగవివక్ష లేకుండా, జాతులు, మతాల వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరిగేందుకు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అవసరమే. అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Pages