S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/27/2016 - 03:16

విద్యాహక్కు చట్టం కింద తీసుకువచ్చిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపాల్సిందే. కేంద్రం తన వాటాను, రాష్ట్రం తన వాటాను చెల్లించాలి. కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్రం చెల్లించాల్సిందే. విద్య హక్కు కింద కేంద్రం తన వాటా ఇవ్వకుండా తిరస్కరించవచ్చు.

10/27/2016 - 03:15

ఫీజు బకాయిలను ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే విద్యార్ధులకు చెల్లించాలి. ఈ విషయంలో ఉదాసీన వైఖరి పనికిరాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పథకం ద్వారా విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో అన్ని వర్గాల్లో నిరుపేదలకు ఉన్నత విద్యను అందించేందుకు ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టారు.

10/19/2016 - 22:29

పఠాన్ కోట్ ఉగ్రదాడుల సూత్రధారి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలపాలన్న ఆలోచనలతొ మసూద్ సహా మరో ముగ్గురిపై సీమాంతర ఉగ్రవాదం కింద ఎన్‌ఐఎ చార్జిషీట్ దాఖలు చేసి విచారణ ప్రారంభించింది. పఠాన్ కోట్ దాడుల కేసు విచారణ ముమ్మరం చేసిన భారత్ గోవాలో జరిగిన బ్రిక్స్ దేశాల సమన్వయంతో చైనాపై ఒత్తిడి తేవాలని చూసింది.

10/19/2016 - 22:28

చైనా ఉత్పత్తులను నిషేధించే పరిస్థితులు లేవు. ఇది అనాదిగా మన దేశానికి ఉన్న బలహీనత. కాబట్టే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు, ఇతర దేశాల వస్తువుల దిగుమతులపై ఆధారపడకుండా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇంతకాలం దేశం ఆర్థికంగా, వ్యాపారపరంగా బలోపేతం కాకపోవడానికి గత ప్రభుత్వ అస్థవ్యస్థ పాలనే కారణం.

10/19/2016 - 22:26

మిత్ర దేశం కానందువల్ల చైనా ఉత్పత్తులను నిషేధించాలని, కొనవద్దని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. చైనా ఉత్పత్తులను నిషేధించడం సాధ్యం కాదు. వినియోగదారులు కొనడం ఆగదు. చైనాను బలహీనపరచడం కన్నా మన దేశంను బలపడేట్టు చేయాలి. వినియోగ దారులు ఒక వస్తువులను కొనేప్పుడు ప్రధానంగా రెండు అంశాలను చూస్తారు. ఒకటి ధర తక్కువగా ఉండడం, తాను భరించే ధరతో లభించడం, రెండు నాణ్యత.

10/19/2016 - 22:25

మన దేశం పట్ల చైనా స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ, అంతరంగికంగా పాకిస్తాన్‌కు సహకరిస్తోంది. చైనా ఆగడాలను అరికట్టాలంటే ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న వస్తువులను నిషేధించే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంతకంటే ముందు సమీక్షించాలి. అవసరమైతే అఖిలపక్షంతో చర్చించాలి.

10/19/2016 - 22:25

వస్తు ఉత్పత్తిపై నిషేధం సాధ్యం కాదు

10/19/2016 - 22:23

సమాచార టెక్నాలజీ విప్లవంతో ప్రపంచమే కుగ్రామమైన తరుణంలో, పోటీతత్వం విపరీతంగా ఉన్న ఈ రోజుల్లో ఒక దేశ ఉత్పత్తులను నిషేధించాలనుకోవడం సాధ్యమవుతుందా లేదా అనేది అనుమానమే. కాని పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆ దేశ ఉగ్రవాద తండాలు పాల్పడుతున్న అరాచకాలను తిప్పిగొట్టాలని ప్రతి భారతీయుడు తహతహలాడుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్‌కు చైనా మిత్ర దేశం.

10/19/2016 - 22:22

చైనా వస్తువులను భారతీయులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నందు వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు, రక్షణకు ఏదో నష్టం జరుగుతోందంటూ సోషియల్ మీడియాలో ఒక పద్ధతి ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారానికి సంఘ్‌పరివార్ కారణంగా భావించవచ్చు.

10/19/2016 - 22:21

ప్రపంచం ప్రస్తుతం ఒక గ్రామంగా మారిపోయింది. ఒక దేశంలో తయారయ్యే వస్తువులను ఇతర దేశాల్లో విక్రయిస్తున్నారు. అలాగే చైనాలో తయారయ్యే వస్తువులను భారత్‌లో విక్రయిస్తున్నారు. మన అవసరాలకోసం చైనా వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. అలాగే మన దేశంలో తయారవుతున్న వస్తువులను కూడా చైనాలో మనం విక్రయిస్తున్నాం. చైనా వస్తువులను మనం దిగుమతి చేసుకోకూడదనుకుంటే, ఆ దేశం ఇతర దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేసుకుంటుంది.

Pages