S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/13/2016 - 04:21

చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొత్త జిల్లాలు తెలంగాణలో ఆరంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. అయితే ఇంకా కొలిక్కి రావడానికి సమయం పట్టొచ్చని చెబుతున్నారు. తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటై, మొత్తం మీద 31 జిల్లాలతో స్వరూపం పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరిభాషలో చెప్పాలంటే ‘్ధమ్‌ధామ్’గా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.

10/13/2016 - 04:14

కొత్త జిల్లాలతో తెలంగాణలో కొత్తశకం ప్రారంభం అవుతుంది. జిల్లాల పరిణామం చిన్నగా ఉండడంవల్ల పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుంది. ప్రజల మేలుకోసమే జిల్లాల ఏర్పాటు కానీ రాజకీయ కోణంలో కాదు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు చేరేందుకు, పేదల జీవితాల్లో వెలుగులు నిండాలని అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాల పునర్విభజనకు పూనుకున్నారు.

10/13/2016 - 04:13

ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తెచ్చేందుకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆశయం చాలా గొప్పది. జిల్లా కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండటం మంచిదే, కాని అది ఆచరణలో చూపించాలి. ప్రజలకు ఏ విధంగా బాధ్యతలు నెరవేరుస్తామో అనేదానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉండాలి. ప్రజలను ఆఫీసుల్లోకి ఏ విధంగా స్వీకరిస్తాం అనే దానిపైనా స్పష్టత ఉండాలి.

10/13/2016 - 04:13

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు శాస్ర్తియంగా లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో అధికారపక్షం, విపక్షాలు, స్వచ్ఛందసేవా సంస్థలు, ప్రజలు తదితరులంతా భాగస్వామ్యులే. ప్రభుత్వం తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయంలో గోప్యత అవసరం ఏముంటుంది. సినిమాల తరహాలో చివరిక్షణం వరకు ఉత్కంఠ కలిగించారు.

10/13/2016 - 04:12

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీసుకున్న నిర్ణయం ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న చందంగా మారింది. పార్టీలో సీనియర్ నాయకులకు చెక్ పెట్టడం ఒక ప్రయోజనం అయితే యువత కొత్తతరంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించడం మరొక ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే యువరక్తానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయింది.

10/13/2016 - 04:11

పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు మంచిదే అయినా, ఈ ప్రక్రియను శాస్ర్తియపరమైన అధ్యయనం లేకుండా చేయడం తొందరపాటు చర్య. తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాలను ఖరారు చేయకముందు జ్యుడీషియల్ కమిటీని నియమించి హేతుబద్ధంగా జిల్లాల విభజన చేసి ఉంటే బాగుండేది.

10/13/2016 - 04:11

జిల్లాల పునర్విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ నియమించి ఉంటే బాగుండేది. జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తే అన్ని వర్గాల, అన్ని పార్టీల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఆస్కారం ఉండేది. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా పట్టుదలకు పోయి, తమకు నచ్చిన వారికి జిల్లాలు ఇచ్చి, నచ్చని వారికి మొండిచేయి చూపించింది.

10/13/2016 - 04:10

పరిపాలనా సౌలభ్యంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు ప్రజలకు ముఖ్యం కాదు.. ప్రజలకు అందే సౌకర్యాలు, పరిపాలన ముఖ్యం. ప్రజలకు ఏ మేరకు సేవలందిస్తున్నాం, కొత్త జిల్లాలవల్ల వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? జిల్లాలకు ఆదాయ, వ్యయ, వనరులపై సమగ్ర అవగాహన ప్రజల్లో ఉండాలి. ప్రజలకు అవగాహన కల్పించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుండేది.

10/05/2016 - 23:20

భారత్-పాకిస్తాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తత ప్రపంచానికే తలనొప్పిగా తయారైంది. వాస్తవానికి ఇది రెండు దేశాల అంతర్గత సమస్య అయినా పాకిస్తాన్ చాలాకాలంగా దీనినో అంతర్జాతీయ అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. భారత్ మాత్రం ఎన్ని యుద్ధాలు జరిగినా, సంయమనాన్ని కోల్పోకుండా, వీలైనంత శాంతిని పాటిస్తూ, చర్చలకు ఎపుడూ స్వాగతిస్తూనే ఉంది.

10/05/2016 - 23:17

దేశంలో మనుష్యుల మధ్య ఉద్రిక్తతలకు, దేశాల మధ్య ఉద్రిక్తతలకు అధర్మం, స్వార్థమే కారణం. పాశ్చాత్య దేశాలలోగాని, ప్రపంచంలో ఒక్క భారత ధర్మం తప్ప మిగిలిన అన్ని దేశాల్లో వ్యక్తివాదమే ఉంది. వ్యక్తియొక్క ఉచ్ఛకాంక్ష, ఆ ఉచ్ఛకాంక్ష నుండే వైరుధ్యం వస్తోంది. ఆ పునాదులపైనే అక్కడున్న విజ్ఞాన శాస్త్రం, అర్ధశాస్త్రం, మత శాస్త్రం ఉంటున్నాయి. మానవ జీవితం కూడా అదే వైరుధ్యం నుండి ఎదుగుతోంది.

Pages