S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

10/05/2016 - 23:16

భారతదేశాన్ని నష్టపరచాలని, దేశంలో అశాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి తీవ్రవాదులు భారత్‌పై దాడులు చేస్తుంటే, వారికి సరైన బుద్ధి చెప్పాల్సిందే. భారత్‌లో అశాంతి నెలకొల్పేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రవాదులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. తీవ్రవాదులు భారత్ భూభాగంలోకి అక్రమంగా వస్తూ దాడులు చేస్తున్నారు. భారత సైన్యం ఎదురుదాడి చేయడం మంచిదే.

10/05/2016 - 23:16

భారత్ ఎదుగులను చూసి ఓర్వలేక సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతోంది. భారత్‌తో వైరం మంచిది కాదని పాకిస్తాన్‌కు తెలుసు. అయినా తానేమి తక్కువ కాదంటూ సరిహద్దులో కవ్వింపు చర్యలతో కాల్పులకు తెగబడుతోంది. అభద్రతా భావంతోనే పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనే విషయం స్పష్టం. ఎందుకంటే.. పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ప్రత్యక్ష యుద్ధాల్లో ఓడిపోయింది.

10/05/2016 - 23:15

పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ప్రత్యక్ష యుద్ధాల్లో ఓడిపోయినప్పటి నుంచి పరోక్షంగా మన దేశాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలన్న కుట్ర పన్నుతోంది. అంతేకాకుండా ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మన దేశం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నందున పాక్ జీర్ణించుకోలేకపోతున్నది.

10/05/2016 - 23:14

పఠాన్‌కోట్, కాశ్మీరీర్‌లోని ఉరీ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దేశానికి చెందిన ముష్కరులు దాడి చేశారని, దానికి ప్రతీకార చర్యగా మన దేశ సైన్యం పివోకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించారు. కానీ ఆ వీడియో క్లిప్పింగ్‌లేవీ? దాడి జరగలేదని పాకిస్తాన్ ప్రకటించింది. మరోవైపు యుఎన్‌వో కూడా అటువంటి ఆనవాళ్ళు ఏవీ లేవని స్పష్టం చేసింది. నిజంగా దాడి జరిగితే కేంద్రం వీడియో క్లిప్పింగ్‌లను బయటపెట్టాలి.

10/05/2016 - 23:13

యుద్ధం అనివార్యమైతే మన సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్‌కు శాశ్వత నష్టం కలిగిస్తారు. అదే సమయంలో భారత్ కూడా కొంత మేరకు నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో దౌత్యపరంగా, ఆర్థిక, వాణిజ్యపరంగా ఏకాకిని చేయాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనివల్ల పాకిస్తాన్, భారత్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

10/05/2016 - 23:13

ప్రస్తుత పరిస్థితులలో యుద్ధం వాంఛనీయం కాదు. యుద్ధం వినాశనానికి దారితీస్తుంది. చాలా దేశాలు తమ స్వీయరక్షణకు రహస్యంగా అయితేనేమి, బహిరంగంగా అయితేనేమి అణు ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి. అలాగే యుద్ధం జరిగితే అన్ని దేశాలు ఇరుపక్కల మద్దతుగా నిలుస్తాయి. అలాంటప్పుడు పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తే ఆ ఒక్క దేశాన్ని మాత్రమే ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పలేం.

10/05/2016 - 23:12

పాకిస్తాన్ భారత దేశానికి శాశ్వత శత్రువు. ఆ దేశం పుట్టినప్పటి నుంచి ఇండియాపై ద్వేషభావంతోనే ఉంది. రెండు దేశాల మధ్య శత్రుభావం ఉంది. సర్జికల్ దాడుల తరువాత రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందా? అనే చర్చ బలంగా సాగుతోంది. అయితే యుద్ధం జరగాలా? లేదా అనేది పాకిస్తాన్ తీసుకునే నిర్ణయం కన్నా చైనా తీసుకునే నిర్ణయం కీలకం. గతంలో పాకిస్తాన్ అమెరికా గుప్పిట్లో ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ చైనా గుప్పిట్లో ఉంది.

09/29/2016 - 04:57

ఉగ్రవాదం ఏ దేశానికీ కొత్త కాదు, చివరికి అగ్రరాజ్యాలు సైతం ఉగ్రవాద పంజాకు బలి అయినవే. రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రితలలువేస్తూ పెనుభూతంగా మారుతోంది. ఒకవైపు సామ్రాజ్యవాదం మరోవైపు ఉగ్రవాదం భౌగోళిక సరిహద్దులు దాటి విస్తరించుకుపోతున్నాయి.

09/29/2016 - 04:55

పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. పాక్ తీవ్రవాదులు ఇటీవల ఉరీపై దాడి చేసి నిద్దురలో ఉన్న సైనికులను పొట్టన పెట్టుకున్నారు. పాక్ దుశ్చర్యను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అయితే పాక్ దురాగతాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. అందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రధాని మోదీ వేసే అడుగుపై యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

09/29/2016 - 04:54

పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంపై దాడికి దిగనప్పుడల్లా యుద్ధం అనివార్యం అనే వాతావరణం కనిపిస్తుంది. పాకిస్తాన్‌తో యుద్ధం జరగాలని చాలామంది కోరుకుంటున్నా. ఇండియాలానే పాకిస్తాన్ కూడా అణుబాంబు ఉన్న దేశం అని గుర్తించాలి. రెండు దేశాల మధ్య సాంప్రదాయ యుద్ధం జరిగితే భారత దేశమే గెలుస్తుంది. దీనిలో పాకిస్తాన్‌కు కూడా అనుమానం లేదు.

Pages