S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

09/29/2016 - 04:53

కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను గట్టిబుద్ధి చెప్పాల్సిందే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. భారత్ సహనాన్ని తక్కువగా అంచనా వేస్తే పాక్ పప్పులో కాలేసినట్లే. కాని భారత్ యుద్ధాన్ని చివరి ఆఫ్షన్‌గా ఎంచుకోవాలి. పాత రోజుల్లో మాదిరిగా ప్రస్తుతం యుద్ధం చేయడం అంత సులువు కాదు. యుద్ధాన్ని ప్రారంభించడం మన చేతిలో పని.

09/29/2016 - 04:52

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం చూరగొనాలి. గత అరవై సంవత్సరాల నుండి కేంద్రంలో ఉండే ప్రభుత్వ విధానాలే ఆ రాష్ట్రంలో అశాంతికి మూలకారణం. భారత స్వాతంత్య్రానికి ముందు హైరాబాద్ రాష్ట్రం తరహాలోనే జమ్మూ కాశ్మీర్‌లో రాజరికం ఉండేది. అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలు కాగా, హిందువు రాజుగా ఉండేవాడు.

09/29/2016 - 04:51

కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులతో చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. పాకిస్తాన్‌తో యుద్ధం సమంజసం కాదు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అణుయుద్ధానికి పాకిస్తాన్ పాల్పడితే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. యుద్ధంలో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. యుద్ధం వల్ల ఇరు దేశాల సామాన్య ప్రజలు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

09/29/2016 - 04:50

కాశ్మీర్ సమస్య రాజకీయాలతో ముడిపడి ఉంది. ఈ సమస్య యుద్ధంతో పరిష్కారం కాదు. కశ్మీర్ అల్లకల్లోలంతో దేశ పౌరుల్లో దేశభక్తి పెరిగింది. దేశ విభజన సమయంలో నాటి పాలకుల రాజకీయాలతో కశ్మీర్ సమస్య మరింత జటిలం చేశారు. ఇటీవల ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడి అమానుషం. ఈ సంఘటన యావద్భారతదేశాన్ని కలచివేసింది. ఈ అఘాయిత్యానికి పరిష్కారం చర్చలతో సరిపోదు. దీనికి పలు దేశాల మద్దతు కావాలి. ఐక్యరాజ్య సమితి స్పందించాలి.

09/29/2016 - 04:49

ఉరీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌ను అన్ని మార్గాల నుంచి ఏకాకిగా చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. 1971 సంవత్సరంలో కూడా ఏకాకి చేయడం జరిగింది. యుద్ధం చివరి అంశం అవుతుంది. పాక్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి. నిధులు, అప్పులు పుట్టకుండా చేయాలి. సార్క్ దేశాలు కూడా పాక్‌ను ఏకాకి చేయాలి.

09/29/2016 - 04:48

పాకిస్తాన్ అంశం చాలా సున్నితమైంది. ప్రస్తుత పరిస్థితులలో కయ్యానికి కాలు దువ్వితే ప్రయోజనం లేదు. యుద్ధం జరిగితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయి. ఎంతిట సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చర్చలు జరపడం వల్ల సమస్యకు పరిష్కారం లభించినా, లభించకపోయినా ఉద్రిక్తత పరిస్థితుల నుంచి కొంత గట్టెక్కవచ్చు. జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరిపై మొదట అక్కడి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి.

09/22/2016 - 06:20

దేశంకోసం, స్వాతంత్య్రంకోసం సర్వస్వం త్యాగం చేసి రాజకీయ నాయకులను చూసిన దేశంలోనే అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిన నేతలనూ చూస్తున్నాం. ఒకపుడు ఉన్నదంతా పంచేసి, పూరిళ్లలో చరమాంకాన్ని గడిపిన నేతలు ఎందరో ఉండగా, కళ్ల ముందే అంతస్తులకు అంతస్తులు స్వర్గ్ధామాలను నిర్మించుకుంటూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్న నేతలు రాత్రికి రాత్రి అంత ధనవంతులు ఎలా అవుతున్నారనేది అందరికీ తెలిసిన సత్యమే.

09/22/2016 - 06:20

కొంతమంది రాజకీయ నాయకులు నేర చరిత్ర ఉన్నవారితో సత్సంబంధాలు కొనసాగించడం దురదృష్టకరం. దీంతో పేద ప్రజలకు, సమాజానికి సేవ చేయాలన్న నాయకుల పవిత్ర లక్ష్యం నెరవేరడం లేదు. ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలకు రాజకీయ నాయకులను అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తున్నది.

09/22/2016 - 06:19

నేరాలు, రాజకీయాలు కలిసి పోయాయి, రెండింటిని వేరువేరుగా చూడలేని పరిస్థితికి చేరుకున్నాం. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. ఇప్పట్లో ఇవి మారుతాయి అనే నమ్మకం కలగడం లేదు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే దానికి తగ్గట్టు ఖర్చు చేయాలి. దీని కోసం ఎలాంటి అడ్డదారులకైనా తెగిస్తున్నారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది.

09/22/2016 - 06:08

రాజరిక పాలన వ్యవస్థలో రాజులు రాజ్యమేలితే..నేరస్తులు నేరాలకు పాల్పడే వారు. ప్రజల తిరుగుబాటుతో రాజులు రాజరికానికి దూరం కాగా, నేరస్తులు నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇది నాటి పాలన వ్యవస్థ. ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరం, రాజకీయం సమాజాన్ని అస్తవ్యస్తం చేసిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు..ఏం చేస్తున్నారు. ఎవరికి, ఎవరు తెలియని పరిస్థితి. రాజకీయాలు అనేవి ఇంద్రధనుస్సులా మారాయి.

Pages