S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

03/23/2017 - 01:41

వేద శాస్త్రానికి ఉన్న షడంగాల్లో జ్యోతిషం నయనస్థానానికి చెందింది. శాస్త్ర సహిత పండుగలు, కర్మలు చేయాల్సిన సమయాల్లో చేస్తేనే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. చేయకూడని సమయాల్లో చేస్తే విపరీత ఫలితాలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నపుడు సరైన సమయం అనే అంశంలో విభిన్నవాదనలు వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పండుగల తేదీలు, సమయాలపై వివాదాలు పరిపాటి అయిపోయాయి.

03/23/2017 - 01:37

పూ ర్వపద్ధతి పంచాంగాలలో మకర సంక్రాంతిని ఉత్తరాయణ ప్రారంభంగా గుర్తిస్తున్నారు. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధమని పాండిత్యంతో సంబంధం లేని సామన్య జనులకు కూడా అర్థవుతుంది. సూర్యుని నుండి చంద్రుడి మాట 180 డిగ్రీల దూరం నడిచే స్థితికి పౌర్ణమి పూర్తి అవుతుంది. ఆకాశంలో ఈ 180 డిగ్రీలు యంత్రాలతో పరిశీలిస్తే స్పష్టంగానే తెలుస్తుంది. సూర్యసిద్ధాంతంలో ఒక వచనముంది.

03/23/2017 - 01:36

సిద్ధాంతగ్రహచారేణ వ్రతధర్మాదికం చరేత్‌
దృక్సిద్ధగ్రహచారేణ హోరాఫలముదీరయేత్‌॥
ప్రత్యహం తిథినక్షత్ర యోగస్వానయనే విదుః
అబీజిసంస్కృతోగ్రహ్యః గ్రహణదౌసబీజకః॥
(సూర్యసిద్ధాంత సారసంగ్రహము)

03/23/2017 - 01:35

పంచాంగాల పట్ల సామాన్య జనానికి వున్న గందరగోళాన్ని నివృత్తి చేయాల్సి వుంది. మన ఆంధ్రదేశంలో 4 రకాల పంచాంగాలు బజారులో లభ్యమవుతున్నాయి. ఒకటి- ఆనాడు సూర్య సిద్ధాంతంలో చెప్పిన నేటి కాలానుగుణంగా మార్చకుండా చేస్తున్న గణిత సంబంధాన్ని పూర్వ పద్ధతి పంచాంగం అంటారు. ఇది శ్రీశైలంవారి ద్వారా విడుదల అవుతోంది.

03/23/2017 - 01:34

హేమలంబ ఉగాది పర్వదినము జరుపుకొనేందుకు కొంతమంది సిద్ధాంతులు అవగాహనా రాహిత్యంతో, తప్పుడు నిర్ణయాలతో ప్రజలను గందరగోళపరుస్తున్నారు. తిథి, నక్షత్రాన్ని అనుసరించి పండుగల నిర్ణయం చేస్తారు. దీన్ని అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ, ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ వివరించారు. ఇక్కడ ధర్మశాస్తప్రరంగా ఎలాంటి బేధం లేదు. కాని గణితపరంగా (దృక్సిద్ధాంతం, పూర్వపద్ధతి) వచ్చే బేధాలు మాత్రమే ఈ గందరగోళానికి కారణం.

03/23/2017 - 01:33

‘శ్రుతిశ్చ భిన్నాః స్మృతయశ్చ భిన్నాః
మహామునీనాం మతయశ్చ భిన్నాః
ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం
మహాజనో యేన గత స్స పంథాః

03/23/2017 - 01:32

పండుగలను ఒక్కో పంచాంగంలో ఒకరకంగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఇందులో వ్యత్యాసాలు రావడానికి ప్రధానంగా తిథి, నక్షత్రాదులలో తేడాలు రావడం కారణం. కొన్ని పండుగలు తిథి ప్రాధాన్యతను కలిగి ఉంటే మరికొన్ని పండుగలు నక్షత్ర ప్రాధాన్యత కలిగి ఉంటాయి.

03/23/2017 - 01:31

జ్యోతిష్యంపై ఇటీవల కాలంలో ప్రజలకు నమ్మకం పెరిగిపోయింది. దీంతో కొందరు తమ వ్యక్తిగత ప్రచారంకోసం పండుగలను వివాదాస్పదం చేస్తున్నారు. పండుగలను ఆయా తిథి నక్షత్రాల ప్రకారం ఖరారు చేస్తారు. పంచాంగకర్తలు చాలామటుకు అనాదిగా పూర్వ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. మరికొందరు సూర్య సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు.

03/23/2017 - 01:30

దృక్సిద్ధ పంచాంగం ప్రకారం 2017 మార్చి 28న అమావాస్యనాడు పాడ్యమి ‘ఏష్య’మయింది. ఏష్యా అంటే ముందురోజు సూర్యోదయానికి తిథి ఉండదు. తర్వాతిరోజు సూర్యోదయానికి తిథి ఉండదు. రెండు సూర్యోదయాలను స్పృశించని తిథిని ‘ఏష్య’ అంటారు. పూర్వపద్ధతి పంచాంగం ప్రకారం 2017 మార్చి 29న సూర్యోదయం అనంతరం ఉదయం ఏడుగంటల వరకు పాడ్యమి ఉంది.

03/23/2017 - 01:28

భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పండుగలపై పంచాంగకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతుల మధ్య విభేదాలు నెలకొనటం ఒక ఎత్తయితే మీడియాద్వారా బహిరంగ సవాళ్ళకు దిగటం దురదృష్టకరం. దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది తేదీలపై వివాదం నెలకొనటం బాధాకరం.

Pages