S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

09/15/2016 - 06:53

భారతదేశంలో అత్యున్నతమైన లోక్‌సభ, రాజ్యసభ.. అలాగే రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి.. ఈ చట్ట సభలకు ఉన్న గౌరవాన్ని పార్టీలకతీతంగా సభ్యులు, స్పీకర్‌లు కూడా కాపాడాలి. ఏడాదిలో అతి కొద్ది రోజులపాటు జరిగే సమావేశాల నిర్వహణకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాయి. ముఖ్యమైన చట్టాలకు రూపకల్పన, అలాగే ప్రజా సమస్యలపై చర్చ జరగాలి.

09/15/2016 - 06:53

ప్రజాసమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేవారినే ప్రజలు ఎన్నుకుంటే బాగుంటుంది. వామపక్షాల ప్రతినిధులు ప్రజాసమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వివిధ కారణాల వల్ల వామపక్షాల ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో చట్టసభలకు రాలేకపోతున్నారు. అందువల్ల ప్రజల్లో చైతన్యం రావలసి ఉంది. సమస్యలపై చర్చ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రజాసమస్యలు చర్చకు రాకుండా చూస్తోంది.

09/15/2016 - 06:51

చట్టసభలు జరుగుతున్న తీరు బాధిస్తోంది. చట్టసభలు ప్రజలకు అవసరమైన శాసనాలు, పాలనా విధానాలు, సంస్కరణలు, సంక్షేమ పథకాలపై చర్చించి మెరుగైన పాలన ప్రజలకు అందించాలి. కాని ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభలు నడుస్తున్న తీరు ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగించడం వాస్తవమే. ఏపి అసెంబ్లీనే తీసుకోండి. హోదాపై చర్చ జరిపిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేయాలని ప్రతిపక్ష పార్టీగా కోరాం.

09/15/2016 - 06:50

ప్రజలకోసం ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సొంత పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత అంశాల మేరకు చట్టసభల్లో నడచుకోరాదు. ఇటీవల కాలంలో ఎపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తోంటే బాధ కలుగుతోంది. గత రెండు సమావేశాలు ప్రజా సమస్యలు సమగ్రంగా చర్చించకుండానే ముగిసిపోయాయి. వర్షాకాల సమావేశాలైతే ఒక్క అంశం చర్చించకుండానే పూర్తయ్యాయి. ఇందుకు అధికార, విపక్షాలదే బాధ్యత.

09/15/2016 - 06:50

చట్టం తీసుకురావాలన్నా.. చట్టానికి రూపకల్పన జరగాలన్నా చట్టసభలే కీలకం. చట్ట సభల నుంచి వచ్చే తీర్మానాలే దేశ అభివృద్ధి, రాష్ట్రాల మనుగడ ఆధారపడి ఉంటుంది. అలాంటి చట్టసభలను మనమంతా గౌరవించాలి. రాజకీయాలు వేరు, చట్టం ప్రతిపాదన, రూపకల్పన వేరు. చట్టసభలు రాజకీయాలకతీతంగా జరగాలి. కానీ ప్రస్తుతం చట్టసభలు రాజకీయాలతో ముడిపడి నడుస్తున్నాయ. చట్టసభల్లో శాసనకర్తల తీరు మరీ దారుణంగా మారింది.

09/15/2016 - 06:49

సభలు ప్రజలకు జవాబుదారి తనంతో ఉండాలి. సభలో ఒక సభ్యుడు ప్రశ్న అడిగితే సమాధానం ఆ సభ్యుని కోసం కాదు. ప్రజలకోసం చెప్పే విధంగా ఉండాలి. ప్రజల కోసమే చట్టసభలు అని తెలంగాణ ప్రభుత్వం, టిఆర్‌ఎస్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పటి వరకు ఉన్న తీరుకు భిన్నంగా అధికార పక్షం విపక్షం అనే తేడా లేకుండా సభ్యులందరికీ తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అనే ధోరణితో సభను నిర్వహిస్తున్నారు.

09/07/2016 - 21:45

తెలంగాణ రాష్ట్రం దసరా నుండి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల ఏర్పాటుతోపాటు డివిజన్లు, క్రమంలో మండలాలు, పంచాయతీల క్రమబద్ధీకరణ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పెంచినపుడు ఆంధ్రాలో కూడా జిల్లాల పెంపు జరుగుతుందని మంత్రులే చూచూయిగా చెబుతున్నారు.

09/07/2016 - 21:43

ఆంధ్రప్రదేశ్‌లోనూ జిల్లాల భౌగోళిక, నైసర్గిక పరిధి చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన చేపట్టడం మంచిది. జిల్లాల పునర్విభజన సహేతుకంగా ఉండాలి. వివాదాలకు, విమర్శలకు తావు లేకుండా ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా పునర్విభజించాలి. ప్రస్తుతం కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఒకటి, రెండు లోక్‌సభ నియోజకవర్గాలైతే మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

09/07/2016 - 21:42

చిన్న జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ సులభంగా ఉండటంతోపాటు పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుంది. దీనివల్ల అధికార యంత్రాంగం సమర్థవంతంగా పని చేయడానికి దోహదం కలుగుతుంది. అలాగే అవినీతి, అక్రమాలు తగ్గుతాయి. శాంతిభద్రతల పర్యవేక్షణ పకడ్బందీగా జరగడానికి అవకాశం కలుగుతుంది. పరిపాలనా పరిధి తగ్గడంవల్ల జిల్లా కలెక్టర్లకు ప్రతి కుటుంబంపై అవగాహన ఏర్పడానికి దోహదపడుతుంది.

09/07/2016 - 21:41

ప్రజల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు కానీ నాయకులకోసం కాదు. రెండు రాష్ట్రాలు మినహా దేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలను పునర్విభజించాయి. జిల్లాల పునర్విభజన గురించి టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పింది. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే జిల్లాల విభజన. ప్రస్తుతం జిల్లా కేంద్రం నుండి కొన్ని గ్రామాలు 200 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి.

Pages