S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

09/07/2016 - 21:40

జిల్లాల విభజన ఎలాంటి హిడెన్ అజండా లేకుండా పూర్తిగా పారదర్శకతతో జరగాలి. జిల్లాల విభజననను సూత్రప్రాయంగా సమర్థిస్తున్నాం. విభజన జరగడం వల్ల పరిపాలనాపరంగా అనేక లాభాలు ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో కేవలం 10 జిల్లాలే ఉన్నాయని ప్రచారం జరిగితే, విదేశాల్లోని పెట్టుబడిదారులు, స్వదేశంలోని పెట్టుబడిదారులు ముందుకు రాకపోవచ్చు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే వారు ముందుకు రాకపోవచ్చు.

09/07/2016 - 21:39

ప్రజల సంక్షేమమే పరిపాలన ప్రధానోద్దేశంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల వికేంద్రీకరణను సిపిఎం సమర్థిస్తోంది. అయితే ఈ నిర్ణయం ప్రజల అభీష్టానికి అనుగుణంగానే ఉండాలి తప్ప, మరొక విధంగా ఉండకూడదు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలు సంతోషంగా, సంతృప్తికరంగా ఉండాలి.

09/07/2016 - 21:38

పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని వర్గాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించే వనరులతో స్థానిక భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను కనీసం 25 జిల్లాలుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి వివాదాలు లేకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ కేంద్రంగా ఒక్కో జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు సమకూరతాయి.

09/07/2016 - 21:37

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లయింది. జ్రాఉద్యమం ద్వారా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలు అనేక కోరికలతో ఉన్నారు. వీటిలో తాగు, సాగునీరు, విద్యుత్, ఉపాధి వంటివి ప్రధానమైనవి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రజాసమస్యలపై దృష్టిసారించి, సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. మిగులు బడ్జెట్‌గా వెలుగులోకి వచ్చిన రాష్ట్రంలో సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి.

09/07/2016 - 21:36

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు అవసరం. కాని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అశాస్ర్తియ పద్ధతులను అనుసరిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది. ఇంతవరకు ముసాయిదా నోటిఫికేషన్‌పై 31 వేల ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిష్కరించాలి. అఖిలపక్ష సమావేశాన్ని రెండోసారి నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

08/31/2016 - 21:12

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంలో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై రోజురోజుకూ స్వపక్షం నుండి, టిడిపి నుండి పెరుగుతున్న ఒత్తిడితో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా నివాసంలో అరుణ్ జైట్లీ, ఎం. వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి సమావేశమై ఆంధ్రప్రదేశ్ పరిణామాలను సమీక్షించారు.

08/31/2016 - 21:12

విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకుగాను ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం వెనుకడుగు వేయలేదు. ఇప్పటికీ హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రక్రియ కొనసాగిస్తోంది. ప్రత్యేక హోదా ప్రకటించేందుకు సాంకేతికంగా ఉన్న ఇబ్బందులే ప్రస్తుత జాప్యానికి కారణం.

08/31/2016 - 21:11

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం కేంద్రానికి గళం వినిపించేలా ప్రజలు ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ యువత ఎలా ముందుకు వెళ్తుంది? రాయితీలు ఇవ్వకపోతే ఎపికి పరిశ్రమలు ఎలా వస్తాయి? ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై అన్ని వైపుల నుంచి వత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. జనసేన నేతృత్వంలో దశల వారీగా కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతుంది.

08/31/2016 - 21:10

దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. జన సాంద్రత తక్కువగా ఉండడం, ప్రకృతిపరంగా అభివృద్ధికి అవకాశాలు లేకపోవడం, వనరులు లేకపోవడం, పరిశ్రమల లేకపోవడం వల్ల ఆదాయం లేక అభివృద్ధి సాధించలేకపోవడం, దేశ సరిహద్దుల్లో ఉండడం వంటి పలు కారణాలతో ప్రత్యేక హోదా ఇచ్చారు.

08/31/2016 - 21:09

ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ లభించేందుకు ఈ రెండు రాష్ట్రాలు కూడా కేంద్రంపై తీవ్రమైన వత్తిడి తీసుకురావలసి ఉంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేవి బిజెపి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేవు. రాజ్యాంగం ప్రకారం రెండు రాష్ట్రాలకు లభించిన హక్కు ఇది. మన దేశంలో పార్లమెంట్ అత్యున్నతమైంది. పార్లమెంట్ చేసిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు అమలు కావల్సిందే. వాటికి తిరుగులేదు.

Pages