S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

08/31/2016 - 21:09

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేసింది. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా ఉంది. హోదా ఇవ్వడం కేంద్రంపై ఆధారపడి ఉంది. విభజన ప్రక్రియపై అప్పటి యుపిఎ ప్రభుత్వం సంప్రదింపులు, చర్చలకు ఆహ్వానిస్తే యావత్ తెలుగు ప్రజలు, పార్టీలు ఆవేశం, ఆక్రోశాలకు గురై సమైక్యవాదం విన్పించారు. అయినా జరగాల్సింది జరిగిపోయింది.

08/31/2016 - 21:08

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఇందులో రాజకీయాలు లేవు. రాజకీయాలు చేసినా జనం ఆగ్రహానికి గురవుతారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏకపక్షంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు రెండు జాతీయ పార్టీలు పార్లమెంటు వేదికగా కొన్ని హామీలు ఇచ్చాయి. అందులో ప్రత్యేక హోదా అనేది ప్రధానమైంది. దీనికోసం రెండేళ్లుగా వైకాపా తీవ్రమైన ఉద్యమం చేస్తోంది. జగన్ గుంటూరులో నిరవధికదీక్ష చేశారు.

08/31/2016 - 21:07

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అభివృద్ధి కోసమే. ప్రేత్యక హోదా లేకపోయినా.. ఆంధ్రాలో అభివృద్ధి జరగడం లేదా? అభివృద్ధి అన్నది ఆంధ్రాకే కాదు.. తెలంగాణకూ అవసరమే. ప్రత్యేక హోదాకోసం పోరాడుతోన్న రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాలను ఆశించొద్దు. ప్రత్యేక హోదాకు బదులు జిల్లాల వారీగా అభివృద్ధి చేస్తేచాలు.

08/31/2016 - 21:07

బిజెపి, టిడిపి, టిఆర్‌ఎస్ రహస్య అజండాల మూలంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. రాజకీయ కారణాల మూలంగా ఎపికి స్పెషల్ స్టేటస్ రాలేదు.. తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ రాలేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదంటూ బిజెపి నేతలు కాకమ్మ కథలు చెబుతున్నారు.

08/31/2016 - 21:06

ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీకి అసలు ఒకదానితో మరొకదానికి ఏ మాత్రం పొంతన లేదు... అంతకు మించి ప్రత్యామ్నాయం కాదు. అవి రెండూ వేరు వేరు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఈ రెండు తక్షణావసరమే. మొదటిది ప్రత్యేక హోదాలో కేంద్రం అందించే ప్రణాళికా నిధుల్లో 90 శాతం గ్రాంట్.

08/24/2016 - 23:23

వ్యవసాయాధారిత దేశం మనది, తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం మంది వ్యవసాయం లేదా వ్యవసాయాధారిత - అనుబంధ రంగాలపై జీవనం సాగిస్తున్నవారే. రెండు రాష్ట్రాలకు కీలకమైన జీవనదులు కృష్ణా, గోదావరి. ఈ జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలూ అనేక ప్రాజెక్టులను తలపెట్టాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాలకు సంబంధించి మహారాష్టత్రో మహాఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

08/24/2016 - 23:20

తెలంగాణ సాధించిన తరువాత ప్రాజెక్టుల నిర్మాణంపైనే ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టిసారించారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడం ద్వారా సస్యశ్యామలమైన బంగారు తెలంగాణను సాకారం చేయాలనే లక్ష్యంతో వెళుతున్నారు. ఆ దిశగా మూడు నదులపై మూడు బ్యారేజీల నిర్మాణంకోసం మహారాష్టత్రో చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. కృష్ణా, గోదావరి ఈ రెండు నదుల్లో తెలంగాణ వాటాలో నీటిచుక్కను కూడా వదిలేది లేదు.

08/24/2016 - 23:19

తెలంగాణ ప్రభుత్వం రీ-డిజైన్ పేరిట చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులకు భారీగా పెరిగిన అంచనా వ్యయాలు పెంచింది. కేవలం తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టి, కమీషన్లు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించే అంశం ఆందోళన కలిగిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రతిపాదన ఉంది.

08/24/2016 - 23:18

అధికారంలోకి వస్తే తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని, బంగారు తెలంగాణ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత ఆ దిశగా అడుగులు వేయడం శుభపరిణామం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తాగు, సాగు నీరుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇది సరిపోదు. ఇంకా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి.

08/24/2016 - 23:17

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమం కన్నా.. అధికార పార్టీలో ఉన్న వారికి దోచి పెట్టడానికే ప్రాజెక్టులు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టుల సాధన కోసం పెద్ద ఎత్తున మరోమారు ఉద్యమించబోతున్నాం. పోలవరం ప్రాజెక్టు భారత ప్రభుత్వం చేపట్టాలి. రూ.16వేల కోట్లతో పూర్తికావాల్సిన పోలవరాన్ని ఎలాంటి సంబంధం లేకున్నా, అధికారులు వ్యతిరేకించి క్యాబినెట్‌లో పెట్టి రూ.30వేల కోట్లకు అంచనాలు పెంచేసుకున్నారు.

Pages